Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు..!
* భాషా పండితుల పరీక్షకు 87.06 శాతం
* పీఈటీ పరీక్షకు 93.76 శాతం హాజరు

ఈనాడు, హైదరాబాద్: ఏపీలో మే 10న డీఎస్సీ భాషా పండితులు, పీఈటీ పోస్టులకు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నిర్వహించిన భాషా పండితుల పరీక్షకు 50,070 (94.40 శాతం) మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు 56,497 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత కలిగిన 53,042 మందికి ప్రభుత్వం ప్రవేశపత్రాలు జారీ చేసింది. పశ్చిమగోదావరిలో అత్యధికంగా 96.08 శాతం, అత్యల్పంగా ప్రకాశంలో 87.06 శాతంగా హాజరు ఉంది. తెలుగు భాషా పండితుల పోస్టులకు సంబంధించి కొన్ని ప్రశ్నలు నూతన పాఠ్యాంశం నుంచి వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. నోటిఫికేషన్‌లో 2012 నాటి పాఠ్యంశం అని చెప్పినా, సిలబస్ బయటి నుంచి కొన్ని ప్రశ్నలు రావడంతో ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం జరిగిన పీఈటీ పోస్టుల పరీక్షకు మొత్తం 8,878 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 8,252 మందికి ప్రవేశ పత్రాలు జారీ అయ్యాయి. వీరిలో 7,737 మంది పరీక్షలకు హాజరయ్యారు. హాజరుశాతం 93.76గా ఉంది.




Published on 10/05/2015