Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

జూన్ 1న డీఎస్సీ ఫలితాలు
విశాఖపట్నం, ఈనాడు: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ రాత పరీక్ష ఫలితాలను జూన్ ఒకటో తేదీన ప్రకటించనున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం ఆయన విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయ పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. పదో తరగతి ఫలితాలను ఈ నెల 20వ తేదీన, ఎంసెట్ ఫలితాలను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి కేటాయించిన జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలను కూడా ప్రస్తుత సంవత్సరం నుంచే చేపడతామని తెలిపారు.
Published on 10/05/2015