Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

402 ఉపాధ్యాయ నియామకాలకు ఆమోదం
ఈనాడు, హైదరాబాద్: ఏపీ గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక డీఎస్సీ ద్వారా 402 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలుపుతూ మే 12న ఉత్తర్వులు జారీచేసింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు- 45, తెలుగు పండిట్ గ్రేడ్ 2- 30, హిందీ పండిట్ గ్రేడ్ 2- 24, ఎస్జీటీ- 118, ఎస్జీటీ/జీపీఎస్- 148, పీఈటీ- 6, క్రాఫ్ట్- 6, డ్రాయింగ్/మ్యూజిక్- 5 పోస్టుల భర్తీకి గిరిజన సంక్షేమ శాఖ నుంచి ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ శాఖ నిర్వహించే ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలను జిల్లా స్థాయిలో తగిన మార్గదర్శకాలు అనుసరించి చేపట్టనున్నారు.




Published on 12/05/2015