Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఆదర్శ పాఠశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1038 అధ్యాపక పోస్టుల భర్తీకి పది రోజుల్లో ప్రకటన ఇవ్వబోతున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు.. పోస్టుగ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ (పీజీటీ) పోస్టులు 636, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు 402 భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 96 ప్రధాన అధ్యాపకుల పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. విద్యాశాఖకు చెందిన 192 మంది ఉపాధ్యాయులు ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వారి సేవలను ఇక్కడ కొనసాగించేందుకు పింఛను వంటి విషయాల్లో సమస్యలున్నాయి. ఆ ఉపాధ్యాయులను తిరిగి విద్యాశాఖకు పంపించే పక్షంలో ఆ 192 పోస్టులను కూడా భర్తీచేయవచ్చని భావిస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి మార్గదర్శకాలు అనుసరించి ఈ పోస్టుల భర్తీకి 2012లో అర్హతలు ఖరారు చేశారు. తెలుగు మాధ్యమంలో అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేకెత్తించింది. ఈ విషయం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై విద్యాశాఖలో తర్జనభర్జనలు సాగుతున్నాయి.




Published on 13/05/2015