Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

జూన్‌ 1న డీఎస్సీ ఫలితాలు
ఈనాడు, హైదరాబాద్‌: డీఎస్సీ-2014 (టెట్‌ కమ్ టీఆర్టీ) రాత పరీక్షల ఫలితాలను జూన్‌ 1న విడుదల చేయనున్నారు. తొలుత ఈ ఫలితాలను జూన్‌ 4న విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఎందకుంటే డీఎస్సీ రాత పరీక్షలను రాసేందుకు తమకు అర్హత కల్పించాలని పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జూన్‌ 3 వరకు నియామకాలు జరపవద్దని విద్యాశాఖ అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తర్జన భర్జనల అనంతరం జూన్‌ 4న ఫలితాలు విడుదల చేస్తే బాగుంటుందని విద్యాశాఖ భావించింది. అయితే ఫలితాల విడుదల, నియామకాల ప్రక్రియ వేర్వేరు అయినందున విద్యాశాఖ మరోసారి న్యాయనిపుణులను సంప్రదించింది. ఫలితాల విడుదలకు ఎలాంటి సమస్యలేదని న్యాయనిపుణులు తెలిపారు. దీనికి తోడు డీఎస్సీ ప్రకటన జారీ సమయంలోనే జూన్‌1 ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొన్నారు. జూన్‌1 న ఫలితాల విడుదల చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొనే ఏపీ మానవవనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జూన్‌ 1న విజయవాడ లేదా హైదరాబాద్‌లో డీఎస్సీ ఫలితాలను విడుదల చేయనున్నారు. వచ్చిన మార్కుల ఆధారంగా ఉపాధ్యాయుల పోస్టులకు ఎంపికైన వారితో జూన్‌ 11 లేదా 12న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ జరపాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమం తిరుపతిలో జరిగే అవకాశముంది. ఇలాంటిది నిర్వహించడం ప్రప్రథమం. డీఎస్సీ తుది 'కీ'లను ఏపీ విద్యా శాఖ ప్రకటించింది. వీటిని ఏపీ డీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు, అవసరమున్నవారు నేటి (మే 29) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు. పరీక్షలు జరిగిన పేపర్ల వారీగా 'కీ'లను పరిశీలించినప్పుడు అదనపు మార్కులు కలిశాయి. పలు సందర్భాల్లో రెండు జవాబుల్లో దేనినీ గుర్తించినా మార్కు ఇస్తున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది.
'కీ' లో ముఖ్యాంశాలు :
* సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ - 'ఎ' కోడ్‌లో 29, 41 ప్రశ్నలకు సంబంధించి అందరికీ అదనపు మార్కులను ప్రకటించారు.
* స్కూల్‌ అసిస్టెంట్‌ జీవశాస్త్రం- 47, 182 ప్రశ్నలకు అదనపు మార్కులు. 98వ ప్రశ్నకు రెండు సమాధానాలు
* స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం - 103, 104 ప్రశ్నలకు అదనపు మార్కులు
* స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘిక శాస్త్రం - 47వ ప్రశ్నకు రెండు సమాధానాలు (2 లేదా 3)
* స్కూల్‌ అసిస్టెంట్‌ ఆంగ్లం- 85వ ప్రశ్నకు రెండు సమాధానాలు (3 లేదా 4)
* స్కూల్‌ అసిస్టెంట్‌ భౌతికశాస్త్రం - 47, 182 ప్రశ్నలకు అదనపు మార్కులు

Published on 29/05/2015