Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

జూన్ 2 లేదా 3న డీఏస్సీ ఫలితాలు
* అభ్యంతరాలపై పరిశీలనకు నిపుణుల కమిటీ
* మంత్రి గంటా వెల్లడి

విశాఖపట్నం (వన్‌టౌన్), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ టెట్-కమ్-టీఆర్‌టీ (డీఎస్సీ) ఫలితాల విడుదలను వాయిదా వేశామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. మే 31న ఆయన విశాఖలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వాస్తవానికి ఫలితాలను జూన్ 1న విడుదల చేయాలని భావించామని, అయితే తుది 'కీ' అభ్యంతరాలను 31వ తేదీ మధ్యాహ్నం వరకూ స్వీకరించడం వల్ల వాయిదా వేయక తప్పలేదన్నారు. తుది 'కీ'పై 1800 అభ్యంతరాలు వచ్చాయని, వీటన్నింటిని పరిశీలించి అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా, ఫలితాల వెల్లడిలో పారదర్శకత ఉండేలా నిపుణుల కమిటీ వేశామని చెప్పారు. కమిటీ అభ్యంతరాలను పరిశీలన చేస్తోందని, ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ 2 లేదా 3న ఫలితాలను ప్రకటిస్తామని మంత్రి వివరించారు.

Published on 31/05/2015