Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

నేడే ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఫలితాలు
ఈనాడు - హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2014 (టెట్-కమ్-టెర్ట్) ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నంలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాల్ని విడుదల చేయనున్నారు. తుది 'కీ'లో 13 తప్పుల్ని సవరించి తాజా 'కీ' విడుదల చేశారు. తుది 'కీ'లోనూ తప్పులు దొర్లడంపై సోమవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలో అధికారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను నిశితంగా పరిశీలించి చివరికి తుది 'కీ'లోని 13 తప్పుల్ని సవరించారు. గతనెల 29న ప్రకటించిన తుది 'కీ'పై 1836 అభ్యంతరాలు వచ్చాయి. వీటిలో విశ్వసనీయత కలిగిన అభ్యంతరాలను నిశితంగా పరిశీలించిన అనంతరం తప్పులను సవరించారు. సాయంత్రం తాజా 'కీ'ని అధికారికంగా ప్రకటించారు. ఇక 'కీ'పై అభ్యర్థుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవని ఆశిస్తున్నట్లు ఏపీ విద్యా శాఖ కమిషనర్ కె.సంధ్యారాణి అభిప్రాయపడ్డారు.
* పైవి కాకుండా ఎస్.ఎ లాంగ్వేజి సోషల్ స్టడీస్‌లో ఇచ్చిన ప్రశ్న యథాతథంగా ఎస్.ఎ ఇంగ్లీష్ (సోషల్ స్టడీస్-కోడ్-1811)లోనూ వచ్చింది. 811 కోడ్ నెంబరులోని సమాధానాలు ఎస్.ఎ. ఆంగ్లం (గణితం అండ్ సైన్స్ - ప్రశ్నపత్రం కోడ్-611)లోనే ఉన్నాయి. అందుకు అనుగుణంగా వీటినీ సవరించారు.

Published on 02/06/2015