Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

స్థానికేతర కోటాకు ఆంధ్రప్రదేశ్‌ అభ్యర్థులే అర్హులు
* ఉపాధ్యాయ నియామకాలపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న ఉపాధ్యాయ నియామకాల్లో స్థానికేతర కోటాకు రాష్ట్రంలోని అభ్యర్థులు మాత్రమే అర్హులని ఏపీ సాధారణ పరిపాలన శాఖ విద్యా శాఖకు తెలియజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో అనుసరించిన పద్ధతిలోనే.. రాష్ట్ర విభజన అనంతరం కూడా స్థానికేతర కోటా ఉపాధ్యాయ నియామకాలకు ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల వారికి మాత్రమే అర్హత ఉంటుందని వెల్లడించింది. తాజాగా సాధారణ పరిపాలన శాఖ నుంచి స్పష్టత రావడంతో స్థానికేతర కోటా కింద ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించిన వివరాలను డిసెంబరు 3న ఉదయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ లెక్కన అభ్యర్థులు తమ సొంత జిల్లాలో మినహా మిగిలిన ఏ జిల్లాలోనైనా స్థానికేతరులే అవుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే విధానం ఉండేది.

Published on 03/12/2014