Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

Deadly ఏ భాషాభాగం?
         టెట్‌-టీఆర్‌టీ ఇంగ్లిష్‌లో ముఖ్యమైన భాషాభాగాల్లో (parts of speech) Noun, Pronoun, Adjectiveల గురించి కిందటివారం చూశాం. ఈ వారం Adjectiveలోని ఇతర విశేషాలతో పాటు మిగతా భాషాభాగాలను పరిశీలిద్దాం!
అతి తక్కువ సంఖ్యలో ఉండే designate, elect, incarnate లాంటి adjectives ను nouns ముందు కాకుండా nouns తరువాత వాడాలి. ఉదా: Now he is the president elect. తక్కువ సంఖ్యలో ఉండే concerned, involved, responsible లాంటి adjectivesను అర్థభేదంతో nouns ముందుగానీ తరువాత గానీ వాడొచ్చు. ఉదా: The concerned teacher = విచారగ్రస్తుడైన ఉపాధ్యాయుడు, The teacher concerned = సంబంధిత ఉపాధ్యాయుడు.
* deadly, lively, lonely, lovely, manly, homely లాంటి పదాల spellingsలో -ly ఉన్నప్పటికీ అవి adverbs కావు. వీటిని nounsను వర్ణించడానికి వాడతారు కాబట్టి adjectivesగా పరిగణించాలి. ఉదా: a deadly curve, a lively class
Verbs
క్రియలను verbs అంటారు. ఇంగ్లిష్‌ క్రియలు Auxiliary verbs, Main verbs అని రెండు రకాలు. Auxilary verbsనుHelping verbs అని కూడా అంటారు. Auxiliary verbsలో Primary auxiliary verbs, ('be' forms 'do' forms 'have' forms), Modal auxiliary verbs (shall, should, ought to, will, would, can, could, may, might, must) అని రెండు రకాలు.
Tenses ఏర్పరచడానికీ, negativesను తయారుచేయడానికీ, questions నిర్మించడానికీ auxiliary verbsను వాడతారు. వీటికి పెద్దగా అర్థం ఉండదు. Verb phraseలో ప్రధానంగా అర్థాన్ని సూచించే goలాంటి పదాన్ని Main verb అంటారు.
కొన్ని verbs తరువాత objectరాదు. objectవచ్చే verbsను Transitive verbs అనీ, objectరాని verbsనుIntransitive verbs అనీ అంటారు. Intransitive verbsను Passive voiceలో వాడకూడదు.
Adverbs
Verbs, Adjectives/ఇతర Adverbsను వర్ణించడానికి వాడే పదాలను Adverbs అంటారు. Verbsను వర్ణించడానికి వాడే adverbsసందర్భాన్ని బట్టి వాక్య ప్రారంభంలోగానీ, verbsకి ముందుగానీ తరువాత గానీ రావచ్చు.
ఉదా: Slowly, he opened his eyes.
I really enjoyed the party. Ravi went abroad.
* Normal order of Adverbs: Manner, Place, Time (MPT)
He married her secretly here yesterday (Manner Place Time)
Prepositions
ఒక noun/ pronounకి వేరే పదంతో సంబంధాన్ని ఏర్పరచడానికి వాడే at, in లాంటి పదాలు ఇవి. చాలా సందర్భాల్లో prepositionsవాడడం అర్థాన్ని బట్టి ఉండదు. ఫలానా పదం ముందు ఫలానా Preposition రావాలి, ఫలానా పదం తరువాత ఫలానా preposition రావాలి- అనే నియమాలున్నాయి.
* క్యాంపస్‌లో అనడానికి on the campusనూ, సిరాతో అనడానికి in inkనూ, కారులో అనడానికి by carనూ వాడాలి.
* 'అతనికి ఇంగ్లిష్‌లో మంచి పట్టు ఉంది' అని చెప్పడానికి He has a good command of English అనాలి. Command తరువాత over రాకూడదు, ofరావాలి.

posting on 29.12.2014