ప్రభుత్వ (యూనివర్సిటీ) ఇంజినీరింగ్ కళాశాలల్లో రూ.10,000
ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటుకు రూ.31,000
మేనేజ్‌మెంట్ కోటా సీటుకు రూ.92,500
ఎన్ఆర్ఐ కోటా సీటుకు 5వేల డాలర్లు.
పెరగనున్న ఇంజినీరింగ్ ఫీజులు?
ఎంసెట్-2012 (ఇంజినీరింగ్) ప్రవేశాల కౌన్సెలింగ్ త్వరలో జరగనున్న నేపథ్యంలో ఇంజినీరింగ్ ఫీజుల పెంపుపై కసరత్తు జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. కనీసం కొన్ని ప్రైవేటు కళాశాలల్లో అయినా ఫీజుల పెంపు అనివార్యమని అధికారులు అంటున్నారు. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఇప్పుడున్న ఫీజుల విధానంలో తమకు నష్టం కలుగుతోందని న్యాయస్థానాలను ఆశ్రయించడమే ఇందుకు కారణం.