1. చేయాలనుకునే వృత్తి/ ఉద్యోగాన్ని బట్టి బ్రాంచ్‌ను నిర్ణయించుకోవచ్చు.
2. విద్యార్థికి ఉన్న అభిరుచిని బట్టి నిర్ణయించుకోవచ్చు.
ఏమైనా విద్యార్థి తన బలాబలాను బేరీజు వేసుకుంటూ బ్రాంచి ఎంపికలో జాగ్రత్తగా ఆలోచించాలి. భవిష్యత్తులో ఆ బ్రాంచికి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయో కూడా ఒక అంచనాకు రావాలి. అందరూ చేరుతున్నారు కదా అని ఆలోచన లేకుండా బ్రాంచిని ఎంపిక చేసుకోవడంవల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి.
కళాశాలను ఎంచుకోవడం ఎలా?
సాధారణంగా చాలా కాలంగా బోధనరంగంలో ఉన్న (పాత) ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక వసతులు బాగా ఉండే అవకాశం ఉంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులూ ఉంటారు. అయినా, విద్యార్థి తాను చేరాలనుకునే కళాశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? అధ్యాపకుల బోధనానుభవం ఏమిటి? లేబోరేటరీ, లైబ్రరీ, హాస్టల్, రవాణా వంటి సదుపాయాలేమిటి? తదితర సంగతులను తెలుసుకోవాలి. అంతకుముందు ఆయా కళాశాలల్లో చదివిన విద్యార్థుల ద్వారా లేదా స్వయంగా పరిశీలించి ఈ వివరాలను సేకరించాలి. తరువాతే నిర్ణయం తీసుకోవాలి.