| |
లోకల్ - నాన్‌లోకల్ కేటగిరీని ఎలా నిర్ణయిస్తారు?
లోకల్, నాన్‌లోకల్ అభ్యర్థులను ఎలా నిర్దేశిస్తారనే విషయమై చాలా సందేహాలున్నాయి. దీనిపై కౌన్సెలింగ్ కేంద్రం క్యాంప్ ఆఫీసర్ కె.రఘునాథ్ ఇస్తున్న వివరణ..
విద్యార్థికి అర్హత పరీక్ష అయిన ఇంటర్మీడియట్ నుంచి వెనుకకు వరుసగా నాలుగేళ్లు ఏ ప్రాంతంలో చదివితే ఆ విద్యార్థి ఆ ప్రాంతానికే లోకల్ అవుతాడు.
ఒకవేళ 9, 10 తరగతులు ఒక ప్రాంతంలో, ఇంటర్మీడియట్ మరో ప్రాంతంలో చదివి ఉంటే, ఇంటర్ నుంచి వెనుకకు ఏడు వరుస సంవత్సరాలను పరిశీలిస్తారు. అందులో నాలుగేళ్లు ఎక్కడ చదివాడో ఆ ప్రాంతానికి ఆ విద్యార్థి లోకల్ అవుతాడు. అంటే ఉదాహరణకు ఇంటర్మీడియట్ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో; 9, 10 తరగతులు ఆంధ్రా వర్సిటీ పరిధిలో చదివి ఉంటే 7, 8 తరగతులు (అవసరమైతే ఆరో తరగతి కూడా) ఎక్కడ చదివాడో చూడాలి.
|
|
|
|
|
|