Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
ఆర్థిక రంగం
 • సంస్కరణలకే పెద్దపీట

  కరోనా కట్టడి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నూటికి 90 శాతం మంది మద్దతు లభించినా 21 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ దగ్గరకు వచ్చేసరికి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
 • ఉద్దీపనలకు నిధులు ఎలా?

  కరోనా వైరస్‌ తాకిడికి చిన్నాపెద్ద వ్యాపారాలు స్తంభించి, కోట్ల సంఖ్యలో ప్రజలు వృత్తి, ఉపాధి కోల్పోయారు. ఆర్థిక కార్యకలాపాలు సాగక ప్రభుత్వాలకు ఆదాయం పడిపోయింది.
 • రాష్ట్రాలకు ఇదా తోడ్పాటు?

  గత ఆర్థిక సంవత్సరం నుంచే గణనీయంగా రాబడులు కుంగి, కేంద్రం నుంచి తోడ్పాటు మందగించి అగచాట్ల పాలవుతున్న రాష్ట్రాలకు కొవిడ్‌ మహమ్మారి సృష్టిస్తున్న విధ్వంసం అక్షరాలా గాయంపై గునపం పోటు!
 • ఈ ఉద్దీపన సరిపోతుందా?

  కొవిడ్‌ కాటుకు గురై దుర్భర క్లేశాల పాలైన దేశాన్ని ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’గా తీర్చిదిద్దనున్నామన్న ప్రధాని మోదీ ప్రకటన కొత్త ఆశలు మోసులెత్తించింది. కరోనా కారణంగా సమస్త ఉపాధి, ఉత్పాదక వ్యవస్థలు సుప్తచేతనావస్థలోకి...
 • చిన్న సంస్థలకు పెద్ద ఉద్దీపన

  సమస్యల పరంపరతో నిరంతరం కిందుమీదులవుతూ అస్తిత్వంకోసం పోరాడుతున్న లఘు పరిశ్రమలకు కొత్త ఊపిరులూదగల భూరి ఉద్దీపన యోజన ఇది. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌’లో భాగంగా...
 • ఉద్దీపనే ఆలంబన

  ఎంత కాలమిలా పారిశ్రామిక సేవారంగాల్ని సుప్త చేతనావస్థలో ఉంచడం? ఇదే- కొవిడ్‌కు మందో మాకో కనిపెట్టేదాకా దానితో సహజీవనం తప్పదన్న నిజాన్ని గ్రహించిన నేతాగణాల మష్తిష్కాల్ని తొలుస్తున్న ధర్మసంకటం!
 • రాష్ట్రాలకేదీ విత్త సత్తువ?

  ఒక ప్రపంచయుద్ధం సృష్టించగల పెను విధ్వంసం తీవ్రత ఏ పాటిదో కరోనా మహమ్మారి నేడు కళ్లకు కట్టింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోని దేశాల్లో అపార ప్రాణనష్టం, తీసుకొన్న దేశాల్లో ఊహాతీత స్థాయిలో...
 • కొత్త లెక్కలు... కొన్ని చిక్కులు!

  కొవిడ్‌ మహమ్మారి యావత్‌ ప్రపంచాన్నీ మాంద్యంలోకి నెట్టేసింది. అమెరికా వంటి దేశాలను కరోనా వైరస్‌ ముట్టడి ఆర్థికంగా అతలాకుతలం చేసింది. ప్రపంచ ఆర్థికం కుదేలవుతున్న దశలో కరోనా విరుచుకుపడింది.
 • స్వావలంబనే ధ్యేయంగా...

  దేశదేశాల వృద్ధిరేట్ల రెక్కలు విరిచి ప్రపంచార్థికాన్నే పెనుమాంద్యంలోకి నెట్టేస్తున్న కరోనా మహమ్మారి- పారిశ్రామిక, వర్ధమాన దేశాల అభివృద్ధి నమూనాల్లోని డొల్లతనాన్నే ఎండగడుతోంది.
 • అసాధారణ విధానాలే శరణ్యమా?

  కరోనా దెబ్బకి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలవుతున్నాయి. ఈ మహమ్మారి మనదేశంలోకి చొరబడక ముందే ఇక్కడి ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ప్రస్తుత లాక్‌డౌన్‌తో వస్తుసేవల ఉత్పత్తితోపాటు...
 • ఇది అతి పెద్ద ముప్పు

  ‘గతంలో వచ్చిన ఎన్నో సంక్షోభాల కన్నా ప్రస్తుత కొవిడ్‌-19 ముప్పు పెద్దది. దీని ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంత త్వరగా కోలుకొనే పరిస్థితి లేదు. వృద్ధిరేటు మందగించడమే కాదు- తగ్గిపోయే అవకాశమూ ఉంది’ అని...
 • ఆర్థిక ఉద్దీపన ఏదీ?

  స్వైన్‌ఫ్లూ కంటే పదింతలు ప్రాణాంతకమైన కరోనా మహమ్మారిపై భారతావని పోరు నిర్ణయాత్మక దశకు చేరింది. మానవాళి చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 130 కోట్ల జనావళిని మూడు వారాలపాటు గృహనిర్బంధంలో...
 • దేశార్థిక ఆరోగ్యానికీ వైరస్‌

  కృతి, ప్రపంచీకరణ రెండూ కలిసి ఆధునిక మానవాళికి కరోనా వైరస్‌ రూపంలో అగ్నిపరీక్ష పెడుతున్నాయి. వైరస్‌ వాప్తిని కట్టడి చేసి, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు విధించిన లాక్‌డౌన్‌, భారత ఆర్థిక వ్యవస్థకు గోరుచుట్టుపై...
 • భయం భయం... ప్రపంచార్థికం

  కొవిడ్‌-19 మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి దింపే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎదురవుతున్న లాక్‌డౌన్‌లతో వ్యాపార కార్యకలాపాల్లో పలు సమస్యలు, అడ్డంకులు తలెత్తి వైమానిక...
 • పునరుత్తేజానికి బహుముఖ వ్యూహం

  ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడం ఎంత ముఖ్యమో, ప్రస్తుత పరిస్థితుల్లో పేదవాడికి సాయం చేయడమూ అంతే కీలకం. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ప్రాణాంతక మహమ్మారిపై పోరాటం సుదీర్ఘంగా...
 • కూలుతున్న ఆర్థిక వ్యవస్థలు

  దూదిగుట్టలో నిప్పు నెరసులా కరోనా వైరస్‌ సృష్టిస్తున్న పెనువిధ్వంసం- ప్రపంచ మానవాళి బతుకుల్ని, బతుకు తెరువుల్ని ఒక్కతీరుగా బుగ్గిపాలు చేస్తోంది. 16 లక్షలు దాటిన కొవిడ్‌ కేసులు, లక్షకు చేరువైన మరణాలతో...
 • ఆర్థిక వ్యవస్థలు చెల్లాచెదురు

  దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సమయంలో కరోనా విజృంభణ పిడుగుపాటులా పరిణమించింది. అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం కావాలంటే ఇకపై పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం...
 • ఆర్థిక సంక్షోభానికి ‘బహుముఖ’ కళ్లెం

  ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారి సృష్టిస్తున్న ఆరోగ్య, ఆర్థిక ఉత్పాతానికి దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఆరోగ్యపరంగా మానవాళిని భయకంపితుల్ని చేసిన కరోనా- కనీవినీ ఎరుగని రీతిలో...
 • ఆర్థిక బలం బ్యాంకులకు ఊతం

  దేశంలోని పది ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగు బ్యాంకుల్లో విలీనం చేయబోతున్నట్లు నిరుడు ఆగస్టులో భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ (నేటి) నుంచి అమలులోకి రానున్న...
 • మాంద్యానికి మందేదీ?

  పట్టుమని రెండు రోజుల్లోనే మరో లక్ష పైచిలుకు కేసుల విస్తృతితో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు, ఒక చెంప ప్రజారోగ్యాన్ని బలిపీఠం మీదకు నెడుతూ, మరోవంక ప్రపంచార్థికాన్ని...
 • దేశార్థికానికేదీ దన్ను?

  విశ్వ మానవాళికిప్పుడు అదృశ్య కరోనా వైరస్‌ ఉమ్మడి శత్రువు. కొవిడ్‌-19 పేరిట వ్యవహరిస్తున్న మహమ్మారి విశృంఖల ఖడ్గచాలనానికి రెక్కలు తెగటారి ప్రపంచార్థికం మునుపెన్నడెరుగనంతటి తీవ్ర అనిశ్చితిలోకి జారిపోతోంది.
 • ఆర్థిక వ్యవస్థలు కకావికలం

  ముడి చమురు బ్యారెల్‌ ధర కనీవినీ ఎరుగని స్థాయికి దిగజారిపోయింది. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజీలో తాజాగా బ్యారెల్‌ ధర 23 డాలర్లు పలికింది. 1973 జులైలో ముడి చమురు బ్యారెల్‌ 20 డాలర్లకు పడిపోయింది.
 • ఎగుమతి దృష్టితో ఆయుధ సృష్టి

  రక్షణ పరిశ్రమలు కేవలం భారతీయ బలగాల కోసమే ఆయుధ ఉత్పత్తి సాగిస్తే వేగంగా ఎదగలేవు. సొంత అవసరాలను తీర్చుకుంటూనే ఆయుధాలను అంతర్జాతీయ విపణికి ఎగుమతి చేస్తే విదేశీ మారక ద్రవ్యం సంపాదించవచ్ఛు...
 • ఆర్థిక సూచీలు నేలచూపులు

  ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. ఎన్నోదేశాలు క్రీడోత్సవాలకు స్వస్తి చెప్పాయి. సామూహిక సమావేశాలకు చెల్లు చీటీ రాసేస్తున్నాయి. విశాలమైన బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలు వెలాతెలాపోతూ కనిపిస్తున్నాయి.
 • సంక్షోభంలో గ్రామీణ ఆర్థికం

  నిరుద్యోగిత, ఆర్థిక మందగమనం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 2020-21 కేంద్ర బడ్జెట్‌ గ్రామీణ రంగంలో ఎలాంటి ఉత్సాహాన్నీ తీసుకురాలేకపోయింది.
 • అంపశయ్యపై అసంఘటిత రంగం

  కొన్నేళ్ల ముందు అత్యంత వేగంతో దూసుకుపోయిన భారత ఆర్థిక వ్యవస్థ నేడు మందగమనంలో పడింది. వార్షిక వృద్ధిరేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6.8 శాతానికి పడిపోయింది.
 • కొడిగడుతున్న నమ్మకం

  పారు బాకీలు పెరిగిపోయి, అసలు పెట్టుబడికే దిక్కు లేకపోవడంతో భారత రిజర్వు బ్యాంకు ఏప్రిల్‌ మూడో తేదీ వరకు యెస్‌ బ్యాంకుపై మారటోరియం విధించడం ఖాతాదారులనే కాక ప్రజలందరినీ దిగ్భ్రాంతపరచింది.
 • సరకు రవాణా దేశార్థికానికి నజరానా!

  భారత రవాణా రంగం భారీ వృద్ధి దిశగా సాగుతోంది. ఏటా 8 నుంచి 10 శాతం దాకా వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు ‘పెట్టుబడి సమాచార, పరపతి రేటింగ్‌ సంస్థ (ఐసీఆర్‌ఏ)’ అంచనా.
 • ఆర్థిక పునరుజ్జీవం సాధ్యమేనా?

  గడచిన అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఆర్థికాభివృద్ధి రేటు పుంజుకొంటుందని ఆశలు పెట్టుకున్నా చివరకు జీడీపీ వృద్ధి రేటు 4.7 శాతానికి పరిమితమవడం ఉసూరుమనిపించింది.
 • మాంద్యానికి మౌలిక చికిత్స!

  ఆర్థిక మాంద్యం ఉద్ధృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌలిక సౌకర్యాల విస్తరణ ద్వారానే సంక్షోభాన్ని ఎదుర్కోవాలన్న వాదన గడచిన కొంతకాలంగా ఊపందుకుంటోంది.
 • కరోనాతో ప్రపంచార్థికం కుదేలు!

  చైనాలోని వుహాన్‌ నగరంపై పంజా విసరిన కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ఆ దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడమే కాదు, క్రమంగా ఇతర దేశాలపైనా పడగ విప్పుతోంది.
 • ఆర్థిక రంగానికి పుటమేసే బంగారం

  బంగారం అనగానే భారతీయులకు తమ హోదా, సంపద ప్రదర్శించేందుకు అనువైన ఆభరణాలు గుర్తుకు వస్తాయి. అదే పాశ్చాత్య దేశీయులు మాత్రం సంపాదనకు నమ్మకమైన పెట్టుబడి మార్గంగా పసిడిని పరిగణిస్తారు.
 • నేల విడిచి సాములెందుకు?

  రెండు నెలల క్రితం దేశంలో మాంద్యం ఉనికినే తోసిపుచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పుడు పరిస్థితి తేటపడిందని, బడ్జెట్‌పై చర్చకు స్పందిస్తూ లోక్‌సభాముఖంగా సంతృప్తి వ్యక్తీకరించారు.
 • సాహసోపేత నిర్ణయాలకు దూరం

  ఆర్థిక మందగతిని అధిగమించడానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి- వస్తుసేవల వినియోగాన్ని పెంచడం, రెండు- పెట్టుబడులను పెంచడం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌లో రెండో మార్గాన్ని ఎంచుకున్నారు.
 • పెట్టుబడులకే పెద్దపీట

  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన రెండో బడ్జెట్‌లో కార్పొరేట్‌ సంస్థలకు గణనీయ రాయితీలివ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు మళ్ళీ ఊపు వస్తుందని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు...
 • అంచనాలను అందుకోలేక...

  ఆర్థిక వ్యవస్థను వేధిస్తున్న మందగమనాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలన్నీ సంధిస్తారనే అంచనాల నడుమ 2020 బడ్జెట్‌ మన ముందుకొచ్చింది. కాకపోతే, అలాంటి భారీ అంచనాలను...
 • దక్షిణాదికి ఆర్థిక సంకెళ్లు

  ‘పదిహేనో ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరానికి సంబంధించి చేసిన సూచనల్ని గణనీయంగా సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం ఆమోదించింద’ని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ మొన్నటి బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు.
 • ఆశల పద్దు

  చుట్టూ నైరాశ్యం కమ్మిన స్థితిలో, నిర్మాణాత్మక చర్యలతో ముందడుగేస్తున్నామంటూ కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన సుదీర్ఘ బడ్జెట్‌- ఒక్క ముక్కలో, ఆకాంక్షల పద్దు.
 • సవాళ్ల పథంలో బడ్జెట్‌ రథం

  గడచిన అయిదేళ్లలో ఏ కేంద్ర బడ్జెట్‌కూ లేనంత ప్రాధాన్యం 2020-2021 బడ్జెట్‌కు ఉండబోతోంది. భారత ఆర్థికవ్యవస్థను పీడిస్తున్న సమస్యలు మరింత తీవ్రరూపం ధరించవచ్చుననే భయాల మధ్య కొత్త బడ్జెట్‌ వెలువడనుంది.
 • వృద్ధి అంచనాల మోత

  పదకొండేళ్ల కనిష్ఠస్థాయికి పతనమై ఆందోళనపరుస్తున్న భారత వృద్ధిరేటు ఇకమీదట ‘అనుకూల వాతావరణంలో’ పుంజుకొని ఆరున్నర శాతందాకా ప్రగతిని నమోదు చేయగలదని తాజా ఆర్థికసర్వే నమ్మకంగా చెబుతోంది.
 • వృద్ధిరేట్లకు ఊతమిచ్చేదెలా?

  దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా బడ్జెట్లు మాత్రం ఆశావహ చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. 2020-21 కేంద్ర బడ్జెట్‌ దీనికి భిన్నంగా ఉండే అవకాశం లేదు. సాధారణంగా పాలక పార్టీలు విజయాలన్నింటినీ తమ ఖాతాలో...
 • సంస్కరణలకూ మంద భాగ్యమేనా?

  ప్రస్తుతం నెలకొన్న మందగమన పరిస్థితులు క్రమంగా ఆర్థిక వ్యవస్థను మాంద్యం దిశగా తీసుకెళ్తున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో వరసగా రెండు త్రైమాసికాలలో...
 • టెలికాంరంగం తెప్పరిల్లేలా...

  ఆర్థిక సంస్కరణల శకంలో భారతావని ప్రగతి సౌధానికి పునాదులు వేసిన కీలక రంగాల్లో టెలికాం ఒకటి. ఇండియా స్థూల దేశీయోత్పత్తిలో ఇప్పటికే ఆరున్నర శాతం వాటా కలిగి, 5జి సాంకేతికత అందిపుచ్చుకొన్నాక జీడీపీలో...
 • మాంద్యానికి మందుకోసం!

  మందగమనంతో వేగం తగ్గిన ఆర్థిక వ్యవస్థకు రాబోయే వార్షిక బడ్జెట్‌ ఉద్దీపనను అందించగలదా? ఇప్పుడు అందరి చూపులూ ఫిబ్రవరి ఒకటిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌పైనే ఉన్నాయి.
 • దేశార్థికానికి బొగ్గే ఇంధనం

  కోల్‌ ఇండియా లిమిటెడ్‌ గుత్తాధిపత్యాన్ని తోసిరాజంటూ వాణిజ్య అవసరాల నిమిత్తం బొగ్గు తవ్వుకోవడానికి రెండేళ్లనాడు ప్రైవేటు సంస్థల్ని అనుమతించిన కేంద్రప్రభుత్వం- ఆ క్రమంలో భారీ సంస్కరణకు తాజాగా తెరతీసింది.
 • మాంద్యం పీడకు విరుగుడు

  గత నెలలో రిజర్వ్‌ బ్యాంకు, ఇప్పుడు ఒకరోజు తేడాలో కేంద్ర గణాంక సంస్థ ప్రపంచబ్యాంకు నోట వెలువడింది... ఒకే మాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు అయిదు శాతానికి పరిమితం కానున్నదని వాటి అంచనా.
 • సుస్థిర లక్ష్యాలకు దూరంగా...

  ‘ఇండియా ధనిక దేశమేగాని భారతీయులే నిరుపేదలు’ అన్నది దశాబ్దాలుగా వాడుకలో ఉన్న నానుడి. పేదరికాన్ని దాని కవలలైన ఆకలి అనారోగ్యాల్ని పరిమార్చి పౌరులందరి గౌరవప్రద జీవనానికి భరోసా ఇస్తామన్న...
 • నట్టేట ముంచుతున్న నమ్మక ద్రోహాలు

  వ్యాపారాలకు ప్రతి రోజూ సవాలే, నష్టభయమే. ఆర్థిక మోసాలవల్ల వ్యాపార సంస్థల లాభాలు దెబ్బతినడమే కాదు, చాలా సందర్భాల్లో వాటి మనుగడ సైతం ప్రమాదంలో పడుతుంది.
 • మౌలిక సమస్యలు అధిగమిస్తేనే...

  వచ్చే అయిదేళ్లలో భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరింపజేసే క్రమంలో మౌలిక వసతుల రంగాన నూరు లక్షల కోట్ల రూపాయల దాకా వెచ్చిస్తామన్నది మోదీ ప్రభుత్వం గతంలో జాతికిచ్చిన హామీ.
 • నిధులు పెరగాలి - రాష్ట్రాలు వెలగాలి

  కేంద్రం, రాష్ట్రాల మధ్య 2020-25 ఆర్థిక సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వ పన్ను, ఇతర ఆదాయాల్లో విభజించదగ్గ మొత్తాలను పంచడానికి ఏర్పాటైన 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్‌ కమిషన్‌)...
 • అదుపులేని అప్పుతో ముప్పు

  కాలగర్భంలో కలిసిపోనున్న 2019 సంవత్సరం భారతదేశానికి మేల్కొలుపుగా నిలిచిపోతుందా లేక ఏం చేయాలో తోచని జటిలమైన మలుపుగా గుర్తుండిపోతుందా అనేది మన రాజకీయ నాయకుల స్పందనను బట్టి ఉంటుంది.
 • ముందున్నవి మూడు సవాళ్లు

  దేశంలో అధిక వినియోగం, వృద్ధి లక్ష్యాల సాధనకు మూడు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. దేశ వినియోగ భవిష్యత్తు కోసం సానుకూల దృక్పథాన్ని సాధించడం మూడు క్లిష్టమైన సవాళ్లపై ఆధారపడి ఉందని...
 • అంచనాలు తప్పి బేజారు

  భారతదేశ ఆర్థిక సంక్లిష్టతలను అర్థం చేసుకోకుండా హడావుడిగా జీఎస్టీ చట్టాన్ని రూపొందించిన విధానకర్తలు ఎన్నో కఠిన వాస్తవాలను అంచనా వేయడంలో విఫలమయ్యారు. ఆదరాబాదరాగా జీఎస్టీని అమలు చేయడం మొదటి తప్పు.
 • చెదిరిన స్వప్నం

  భారత ఆర్థికరంగ వృద్ధి గమనం తీరుతెన్నులపై అయిదు నెలలక్రితం రెండు పరస్పర విరుద్ధ అంచనాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది వృద్ధిరేటు ఏడు శాతానికి తగ్గబోదని ఆర్థిక సర్వే మదింపు వేయగా, దేశంలో...
 • మరింత పదునుగా సంస్కరణలు

  భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి.రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికమైన జులై-సెప్టెంబరు మధ్యకాలంలో గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా 4.5 శాతానికి తగ్గిపోయింది.
 • ఆదుకోవాల్సింది రిజర్వు బ్యాంకే

  ఏదైనా బ్యాంకు దివాలా తీయగానే భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఆదరాబాదరాగా రకరకాల చర్యలు తీసుకుంటుంది.ఆ పనేదో దివాలాకు ముందే చేసిఉండొచ్చు కదా, సంక్షోభాలు తలెత్తక ముందే నివారణ చర్యలు...
 • పారు బాకీల ప్రగతి ‘ముద్ర’

  మోదీ ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం (పీఎంఎంవై) లక్ష్య సాధనలో ముందంజవేసినప్పటికీ, ఈ రుణాలవల్ల క్రమంగా పెరుగుతున్న నిరర్థక ఆస్తులు బ్యాంకింగ్‌...
 • అవ్యవస్థను చక్కదిద్దలేరా?

  వచ్చే అయిదేళ్లలో ఇండియా అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే, ఏటా ఎనిమిది శాతం వృద్ధి రేటు నమోదు చేయాల్సి ఉంటుందని రంగరాజన్‌ లాంటి ఆర్థిక వేత్తలు నిర్దేశిస్తున్నారు.
 • జోరెత్తుతున్న మోసాల ఖాతా

  దేశం నలుమూలలా ప్రభుత్వరంగ బ్యాంకుల్ని బురిడీ కొట్టించి కోట్లకు కోట్లు దోచేసే బాగోతాలు ఇంతలంతలవుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్‌ రాజ్యసభాముఖంగా చేసిన ప్రకటన...
 • ముదురుతున్న మాంద్యం

  ఆర్థిక వ్యవస్థపై అనునిత్యం వెలువడుతున్న ప్రతికూల వార్తలు మందగమనం పరిస్థితుల్ని చాటిచెబుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నివారణకు తీసుకుంటున్న చర్యలు మాత్రం ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయి.
 • ప్రగతి చోదకంగా పెట్టుబడులు

  భారత ఆర్థిక వృద్ధిరేటు గతంలో కంటే తక్కువగా ఉంటుందన్న అంచనాతో అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ ‘మూడీస్‌’ రెండు వారాల క్రితం క్రెడిట్‌ రేటింగ్‌ను ‘స్థిరం’ (స్టేబుల్‌) నుంచి ‘రుణాత్మకం’ (నెగెటివ్‌) స్థాయికి తగ్గించింది.
 • బలోపేతం చేస్తే బహు లాభం

  అప్పు ఇచ్చినవారు తప్పని పరిస్థితుల్లో సాధ్యమైనంత ఎక్కువ మొత్తాలను రాబట్టుకోవడానికి తోడ్పడే దివాలా చట్టం దేశంలో 2016 నుంచి అమలులోకి వచ్చింది. రుణదాతలు, రుణగ్రహీతల కష్టనష్టాలను...
 • ఆహార శుద్ధితో ఆర్థికానికి జోరు

  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆహార శుద్ధి పరిశ్రమ పాత్ర పరిధి, ప్రాధాన్యం పెరుగుతోంది. గత అయిదేళ్లుగా భారత్‌ కూడా ఈ రంగంలో వృద్ధి సాధిస్తోంది. ఈ పరిశ్రమ వ్యవసాయ, ఉత్పత్తి రంగాలకు అదనపు విలువను జోడిస్తోంది.
 • రాష్ట్రాల దన్నుతోనే ప్రగతి పొద్దు

  సులభతర వాణిజ్య నిర్వహణకు దోహదపడటంలో 190 దేశాల పనితీరును తులనాత్మకంగా మదింపు వేసిన ప్రపంచ బ్యాంకు తాజా విశ్లేషణాత్మక నివేదిక, భారత ప్రస్థానగతిని అభినందించింది.
 • నియంత్రణతోనే ప్రజావిశ్వాసం

  సహకార బ్యాంకుల స్థితిగతులు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. దేశంలోని అతి పెద్ద పట్టణ సహకార బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్‌, మహారాష్ట్ర సహకార బ్యాంకు(పీఎంసీ)లో వెలుగు చూసిన కుంభకోణ...
 • బీదజనోద్ధరణకు కొత్త బాటలు

  పురోభివృద్ధి పథంలో పడుతూ లేస్తున్న వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. చిన్నారులకు రోగ నిరోధక టీకాలు వేయించడం ఎలా, పసిబిడ్డలను దోమల బారినుంచి రక్షించడమెలా, వారిని రోజూ బడికి...
 • అపనమ్మకమే అసలు సమస్య

  ప్రస్తుతం దేశంలో అత్యధికుల నోటి నుంచి వినిపిస్తున్న మాట- ఆర్థిక మందగమనం. వాహనాలు, బంగారం, స్థిరాస్తి... ఇలా ఏ రంగం తీసుకున్నా అమ్మకాలు తగ్గాయనే చెబుతున్నారు.
 • మాంద్యానికి ఈ-కామర్స్‌ మందు!

  ప్రపంచం ఎదుట ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సవాలు- ఆర్థిక మాంద్యం. దేశీయంగా అమ్మకాలు నెమ్మదించినా తొలుత పెద్దగా ఎవరి దృష్టీ పడలేదు.
 • దిగుమతులతో అసలుకే ఎసరు

  ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ) కూటమిలోని 15 సభ్యదేశాల అధినేతలు నవంబరు నాలుగున బ్యాంకాక్‌లో సమావేశం కానున్నారు.
 • ముద్రలో తడబాటు

  ‘సూక్ష్మ, కుటీర, చిన్నతరహా పరిశ్రమలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఉపాధి కల్పనలో భారీ పరిశ్రమల కంటే ఇవి ముందున్నాయి. వాటికి చేయూతనివ్వడం ప్రభుత్వాల బాధ్యత.
 • దిగుమతులతో దైన్యం

  ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్‌ ప్రస్థానం ఆశించిన స్థాయిలో లేదు. ఇటీవలి అంతర్జాతీయ పోటీతత్వ సూచీ (జీసీఐ) ర్యాంకుల్లో భారతావని 68వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇదేమీ ఊహించని విషయం కాదు.
 • వృద్ధికి కొలమానం?

  పేదరికం, ఆకలి, అనారోగ్యాలకు తావే లేని సమాజావిష్కరణకోసం ప్రతిన పూనిన స్వతంత్ర భారతావని ఏడు దశాబ్దాలకు పైగా స్వపరిపాలన తరవాతా- ఆ బృహత్తర లక్ష్యసాధనకు యోజనాల దూరాన నిలిచిపోయింది.
 • అంతరాల అంతానికి అభివృద్ధి అస్త్రం

  హింసకు అత్యంత హీనరూపం పేదరికం అనేది మహాత్మాగాంధీ మాట. పేదరిక నిర్మూలన పేరిట ప్రత్యేకంగా ఏటా ఓ రోజును కేటాయించి జరుపుకొంటూనే ఉన్నాం. అక్టోబర్‌ 17 అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం.
 • అదుపు తప్పుతున్న విత్తలోటు

  ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ను విత్తలోటు ఆందోళనకర పరిస్థితుల్లోకి నెడుతోంది. భారత్‌ కొత్త అభివృద్ధి మార్గాలను కనుగొనలేకపోతోంది. - రఘురాం రాజన్‌ (రిజర్వుబ్యాంక్‌ మాజీ గవర్నర్‌)
 • గ్రామీణ ఉద్దీపనే ఆపద్బంధు

  దేశ ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వృద్ధిరేటు 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. నిరుద్యోగిత రేటు 45 ఏళ్లలో గరిష్ట స్థాయికి చేరింది.
 • పోటీలో ఎక్కడున్నాం?

  అంతర్జాతీయ పోటీతత్వ సూచీ (జీసీఐ) వార్షిక ర్యాంకింగుల్లో భారత్‌కు చుక్కెదురైంది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) తాజా క్రోడీకరణ ప్రకారం- నిరుడు 58వ స్థానంలో నిలిచిన ఇండియా...
 • మదుపరుల కంట్లో సహ‘కారం’

  భారతావనిలో ‘బ్యాంక్‌’ అంటే ఒక నమ్మకం. దాన్ని నిలబెట్టేలా పటిష్ఠ వ్యవస్థల నిర్మాణంలో దశాబ్దాల తరబడి ఘోర వైఫల్యాలు- స్కాముల పాములై కోరచాస్తున్నాయన్నది నిష్ఠుర సత్యం!
 • ప్రగతిని పొదిగే వ్యూహం

  భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో భాగ్యనగర సదస్సు ముక్తకంఠంతో తీర్మానించినట్లు, చిన్న పరిశ్రమలు అసంఖ్యాక సవాళ్లతో కుంగుతున్నాయన్నది చేదునిజం.
 • పెట్టుబడులకు ఊతం

  గడచిన రెండేళ్లలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) లో మౌలికంగా, నిర్వహణపరంగా అనేక మార్పులు వచ్చాయి. 2017 జులై ఒకటి నుంచి అమలులోకి వచ్చిన ఈ పన్ను రేట్లను తరచూ మారుస్తూ వచ్చారు.
 • మాంద్యానికి మౌలిక చికిత్స

  ఆర్థిక మందగమనం... ఇప్పుడు ప్రపంచ దేశాలతోపాటు భారత్‌నూ వణికిస్తున్న సమస్య. ఈ ఊబిలో కూరుకుపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిళ్లూ పెరుగుతున్నాయి.
 • పన్ను ఉగ్రవాదంపై మెరుపుదాడి

  ఆర్థిక మాంద్యం తాలూకు అమాస చీకట్లు దట్టంగా కమ్ముకొస్తున్నాయని బెంగటిల్లుతున్న కార్పొరేట్ల ముంగిట్లోకి అక్షరాలా దీపావళి సంబరాల్ని తెచ్చింది మోదీ సర్కారు.
 • సాంకేతికతతో సమూల మార్పులు

  ఆర్థిక మాంద్యం అలముకున్న దశలో ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంధించిన విలీనాస్త్ర పర్యవసానాలు ఎలా ఉంటాయనే అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.
 • ఉపాధికి ఆశా కిరణం

  ఆర్థిక మందగమనంతో పారిశ్రామిక రంగం కుదేలవుతోంది. ఎన్నో సంస్థలు ఉద్యోగ నియామకాలను కుదించుకుంటున్నాయి. మరికొన్ని నష్ట నివారణకు ఉద్యోగుల తొలగింపు దిశగా కార్యాచరణకు ఉపక్రమించాయి.
 • రుణ గ్రహీతలకు మంచి రోజులు?

  బ్యాంకులు తన నుంచి తీసుకొనే స్వల్పకాలిక రుణాలపై వసూలు చేసే వడ్డీ (రెపోరేటు) తగ్గింపు ప్రయోజనాన్ని పూర్తిస్థాయిలో వెంటనే రుణగ్రహీతలకు అందించాలన్న లక్ష్యంతో బ్యాంకుల వడ్డీరేట్లను లెక్కకట్టే విధానంలో....
 • ప్రయోజనం లేని ‘ప్రాయోజితం’

  పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసలపై కలివిడిగా పోరాడాలని, 2022 నాటికి నూతన భారత్‌ నిర్మాణమే కేంద్రం రాష్ట్రాల ఉమ్మడి లక్ష్యం కావాలని మొన్న జూన్‌ నాటి నీతిఆయోగ్‌...
 • స్వయంకృతమీ సంక్షోభం

  అమెరికా-చైనా వాణిజ్య వైరం వల్ల ప్రపంచం ఆర్థిక మాంద్యంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. అది భారత్‌కూ సోకే ప్రమాదం ఉన్న మాట నిజమే కానీ, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక...
 • మాంద్యానికేదీ సమగ్ర చికిత్స?

  ప్రపంచం నలుమూలలా చాపకింద నీరులా విస్తరిస్తున్న ఆర్థిక మాంద్యం తాలూకు ప్రభావం ప్రసరించి దేశీయంగానూ వృద్ధిరేటు అంచనాలు తెగ్గోసుకుపోతున్నాయి.
 • నీలి విప్లవానికి కొత్త రెక్కలు!

  భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో మత్స్య పరిశ్రమది కీలక పాత్ర. ప్రతి దశాబ్దానికీ ఈ పరిశ్రమ చెప్పుకోదగిన ప్రగతి చూపుతోంది. ప్రస్తుతం చేపల ఎగుమతుల్లో చైనాది ప్రథమ స్థానం.
 • నల్లధన రాజకీయం!

  అవినీతి పంకిల రాజకీయాల్లో తరతమ భేదాలతో అందరూ గ్రంథసాంగులే. ‘అధికారం అవినీతిని మప్పుతోంది... అందుకు మా పార్టీ వాళ్లూ అతీతులు కా’రన్న భారతరత్న వాజ్‌పేయీ...
 • విలీనంతో ఉనికికి ముప్పు

  బ్యాంకుల విలీన ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో కొంత ఆందోళన, ఉద్విగ్నతలు చోటుచేసుకున్నాయి. నిజాం నవాబు స్థాపించిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ను తొలుత స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేశారు.
 • ఆర్థిక రంగం ఆపసోపాలు

  దేశ ఆర్థిక రథం కుదుపుల బాటలో సాగుతోంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంతకంతకూ కరిగిపోతుండటమే ఇందుకు నిదర్శనం.
 • ‘మూలధనం’పై మధ్యే మార్గం

  రిజర్వ్‌బ్యాంకు దగ్గర అవసరానికి మించి మూలధన నిల్వలు ఉన్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలనే విషయంపై ఇటీవల వాడివేడి చర్చ జరిగింది.
 • అరచేతిలో అంతర్జాల విప్లవం

  సాంకేతిక విప్లవం దేశమంతటా చాపకింద నీరులా విస్తరిస్తోంది. చేతిలో సెల్‌ఫోన్‌, అందులో అంతర్జాలం లేకుండా ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదు.
 • మహమ్మారిలా మాంద్యం

  ఆర్థిక మందగమనం... ఆర్థిక మాంద్యం... మహామాంద్యం... ఆర్థిక ఉద్దీపన... వాణిజ్య యుద్ధం... డీగ్లోబలైజేషన్‌- ఇప్పుడు ఎక్కడ చూసినా వీటిమీదే చర్చ జరుగుతోంది.
 • విలీనంఎంత ప్రయోజనం?

  బ్యాంకింగ్‌ చరిత్రలో అతి పెద్ద విలీన ప్రక్రియకు మోదీ ప్రభుత్వం ఒక్కసారిగా తెరతీసింది. ఈ రంగంలో సంస్కరణలను మరింత వేగవంతం చేసింది.
 • ప్రగతికి ప్రాతిపదికలేమిటి?

  దేశ ప్రగతి ప్రస్థానాన్ని అంచనా వేసేందుకు అనుసరించాల్సిన ప్రాతిపదికలేమిటి అన్న విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి.
 • ప్రతిభావంతులకు పట్టం

  ధనిక దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతూ యువతీయువకుల సంఖ్య తగ్గిపోతున్నందు వల్ల ఉద్యోగుల కొరత ఏర్పడింది. మరోవైపు డిజిటల్‌ సాంకేతికత విస్తరించి నైపుణ్య సిబ్బందికి గిరాకీ అంతకంతకూ పెరిగిపోతోంది.
 • రుణగ్రస్త రాష్ట్రాలతో లక్ష్యం నెరవేరేనా?

  రాబోయే అయిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను అయిదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలన్న నరేంద్ర మోదీ సర్కారు సంకల్పం సర్వత్రా ఆసక్తిని, ఆశాభావాన్ని రేపుతోంది.
 • పోలవరానికి ని‘బంధనాలు’

  నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వం కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలను రద్దు చేసింది.
 • బీమా సంస్థలకే లాభాల పంట

  ప్రకృతి ప్రకోపాలకు పంట కోల్పోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతు జీవితాలు దుర్భరం కావడం ఈ దేశంలో సర్వసాధారణం.
 • ప్రోత్సాహకాలతో మెరుపు వేగం

  దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు, పరిశ్రమల్లో ఉత్కంఠ, ఉత్తేజం వ్యక్తమవుతున్నాయి.
 • వినియోగదారులకు రక్షాకవచం

  ‘వినియోగదారు రారాజు’ అనేది ఎప్పటి నుంచో వ్యాపారవర్గాలు పఠిస్తున్న మంత్రం. కొనేవారే లేకుంటే ఏ వ్యాపారమూ సాగదు. సమాచార, సాంకేతిక రంగాలు ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్నాయి.
 • వినియోగదారులకు రక్షాకవచం

  ‘వినియోగదారు రారాజు’ అనేది ఎప్పటి నుంచో వ్యాపారవర్గాలు పఠిస్తున్న మంత్రం. కొనేవారే లేకుంటే ఏ వ్యాపారమూ సాగదు. సమాచార, సాంకేతిక రంగాలు ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతున్నాయి.
 • సర్కారీ వ్యయంతోనే మాంద్యం మాయం

  ప్రతి దేశ ఆర్థిక రథం నాలుగు గుర్రాలతో పరుగులు తీస్తుంది. అవి- ప్రభుత్వ వ్యయం, ప్రైవేటు పెట్టుబడులు, స్వదేశంలో వస్తుసేవల వినియోగం, విదేశాలకు ఎగుమతులు.
 • ‘పన్ను ఉగ్రవాదం’తో ఉక్కిరిబిక్కిరి

  ‘యూపీఏ ప్రభుత్వం పన్ను ఉగ్రవాదం పగ్గాలు విప్పింది. అనిశ్చితిని నెలకొల్పింది. వ్యాపారవర్గంలో ఆందోళన సృష్టించింది’. 2014 ఎన్నికల ప్రణాళికలో భారతీయ జనతాపార్టీ చేసిన విమర్శ ఇది.
 • వట్టిపోతున్న ఉపాధి హామీ!

  జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.67 వేలకోట్లు ఖర్చుపెడుతున్నప్పటికీ, బడుగు వర్గాలకు అది భరోసా ఇవ్వలేకపోతోంది.
 • పల్లెకు చేరని ప్రాథమిక వైద్యం

  స్వతంత్ర భారతావనిలో నాణ్యమైన ప్రజావైద్యం అందని ద్రాక్షలాగే మిగిలిపోతోంది. వైద్యరంగానికి నిధుల కేటాయింపులు అరకొరగా ఉంటున్నాయి.
 • పేదరికంపై ‘ఉపాధి’ అస్త్రం

  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. గ్రామీణ పేదలకు ఏడాదిలో 100 రోజులు పని..
 • అప్పుల ఆర్థికం అభివృద్ధికి ఆటంకం

  సార్వభౌమ బాండ్ల రూపంలో విదేశీ రుణాలు సేకరించాలని ఈ ఏటి బడ్జెట్‌లో భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదన భిన్న రాజకీయ వర్గాల విమర్శలకు గురవుతోంది.
 • సంక్షేమానికేనా కోతల వడ్డన?

  ప్రతి సంవత్సరం బడ్జెట్‌ సమర్పించేటప్పుడు ఏయే రంగాలకు ఎంతెంత మొత్తాలు కేటాయించినదీ కేంద్ర ఆర్థికమంత్రులు ప్రకటించడం ఆనవాయితీ.
 • కొల్లబోతున్న ‘జాతీయ’ లక్ష్యం

  బ్యాంకింగ్‌ వ్యవస్థపై సామాజిక నియంత్రణ కోసమన్న ఆకర్షణీయ నినాదంతో ఇందిర జమానా దేశంలో తొలిసారి 14 బ్యాంకుల్ని జాతీయీకరించి నిన్నటికి సరిగ్గా యాభై ఏళ్లు.
 • జనాభా వడి వడి... రాష్ట్రాలపై ఒత్తిడి!

  జనాభా పెరుగుదల విషయంలో భారత్‌ కొత్త రికార్డులు బద్దలు కొట్టే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఐక్య రాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం ...
 • నిర్దుష్టలబ్ధికి విస్పష్ట వ్యూహం

  ఆదాయ, వ్యయ వివరాలను చట్టసభలకు ఏటా బడ్జెట్ల రూపంలో సమర్పించే ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో లక్ష్యాల అమలు తీరుపై దృష్టిపెట్టడం లేదన్న విమర్శలున్నాయి.
 • నాలుగో తరం నైపుణ్యభరితం

  ఒకప్పుడు ఏ వస్తువైనా చేతులతోనే తయారయ్యేది. ఆవిరి యంత్రం కనిపెట్టినప్పటి నుంచి యంత్రాలతో వస్తుతయారీని చేపట్టి మొదటి పారిశ్రామిక విప్లవానికి తెర తీశారు.
 • భారత్‌లో తయారీకి భారీ ఊతం

  భారతదేశం ఈ ఏడాది చివరికల్లా మూడు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగి, మరి అయిదేళ్లలో అయిదు లక్షల కోట్ల డాలర్ల స్థాయిని ...
 • విదేశీ (దా)రుణాలు

  అప్పును నిప్పులా భావిస్తూ, విత్తం కొద్దీ విభవం అన్న సూక్తిని పాటిస్తూ, ఉన్నంతలో నాలుగు రాళ్లు వెనకేసుకొనే పొదుపు జపం చేస్తూ నిశ్చింతగా జీవన యానం చేయడం భారతీయ సంస్కృతి.
 • అవగాహనే అసలైన మందు

  ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతోంది. ప్రతి దేశంలోనూ ఏటా జనసంఖ్యలో ఎంతో కొంత వృద్ధి నమోదవుతోంది. ఆసియా దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనపడుతోంది. భారత్‌ ఇందుకు మినహాయింపేమీ కాదు.
 • సంస్కరణలకు చోటేది?

  సార్వత్రిక ఎన్నికల్లో గణనీయమైన మెజారిటీ సాధించి మలిదఫా అధికారం చేపట్టిన ఎన్డీయే ప్రభుత్వం సమర్పించే మొట్టమొదటి బడ్జెట్‌ సాంతం సంస్కరణలతో కళకళలాడుతుందని ఆశించినవారికి నిరాశే మిగిలింది.
 • ఆలోచనే అసలు పెట్టుబడి

  ప్రస్తుతం ఉద్యోగార్థుల అడ్డాగా ఉన్న భారత్‌ను ఉద్యోగ సృష్టికర్తల గడ్డగా మార్చడానికని 2016లో ఎన్డీయే ప్రభుత్వం అట్టహాసంగా స్టార్టప్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
 • నష్టాల ఊబిలో డిస్కమ్‌లు

  ఒకప్పుడు దేశంలో విద్యుత్‌ కొరతతో కటకటలాడిన పలు ప్రాంతాలు నేడు మిగులు స్థాయికి చేరుకున్నాయి. తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగడం తగ్గిపోయింది.
 • ఉపాధి పట్టుకొమ్మకు ఊతమేదీ?

  అఖండ మెజారిటీతో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తొలి బడ్జెట్‌ కూర్పుపై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
 • లౌక్యంగా వడ్డన

  నవీన భారత రూపకల్పనకు ప్రణాళికలు రచిస్తున్నామంటూ తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌- ఎన్డీయే రెండో ప్రభుత్వ తొలి బడ్జెట్‌ సమర్పణలో తనదైన ముద్ర వేశారు.
 • వృద్ధి మంత్రం

  ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఘనత మనదేనన్న తాజా ఆర్థిక సర్వే 2019-20 సంవత్సరంలో భారత వృద్ధిరేటు ఏడు శాతానికి తగ్గబోదని అంచనా వేస్తోంది.
 • లెక్క తేలని నల్లధనం

  లెక్కాపత్రాల్లేని లక్షల కోట్ల రూపాయల సొమ్ము రెక్కలొచ్చి దేశంనుంచి ఎగిరిపోయిందన్న మాట గడచిన కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. దేశ, విదేశాల్లో భారతీయులు దాచుకున్న...
 • వృద్ధి-ఉద్యోగితలే రెండు కళ్లు

  జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రతికూల ఆర్థిక పవనాలు వీస్తున్న సమయంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చింది.
 • చిన్న పరిశ్రమలే పెద్దదిక్కు

  రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన దేశం జపాన్‌. అమెరికా విసిరిన అణు బాంబులతో ఆ దేశం సర్వనాశనమైంది. తరవాత మూడు దశాబ్దాలకే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది.
 • అపసవ్య విధానాలతో అస్తవ్యస్తం

  ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజాసేవల అవసరాల రీత్యా ఏర్పాటయ్యాయి. వాటి పరిధి క్రమేపీ విస్తరించాలి. లక్ష్యాలను సాధించే దిశగా అవి పనిచేయాలి. ప్రభుత్వాలు విశాల దృక్పథంతో వ్యవహరించాలి.
 • ఆర్థిక రంగం మందగమనం... భవిష్యత్‌ ఆశాజనకం

  స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు క్రమంగా మందగిస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు గత అయిదేళ్ల ..
 • వాణిజ్యంలోనూ అదే పెడసరం

  విదేశీ వాణిజ్యం దేశ ఆర్థికాభివృద్ధికి ఒక మూలస్తంభం. ప్రపంచంలో ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల ప్రగతిలో విదేశీ వాణిజ్యం గణనీయమైన పాత్ర పోషించిందనేది చారిత్రక సత్యం.
 • సుసంపన్న భారత స్వప్నం

  స్థూల‌ దేశీయోత్పత్తి (జీడీపీ) 2024 నాటికి అయిదు లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవడమే లక్ష్యమని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇది సవాళ్లతో కూడిన లక్ష్యమే అయినప్పటికీ సాధించగలమన్న....
 • నిరుద్యోగంపై రామబాణం!

  దేశంలో వ్యవసాయ రంగం తరవాత అత్యధికంగా సుమారు 12 కోట్లమందికి బతుకు తెరువు కల్పిస్తున్న ఘనత లఘు పరిశ్రమలది. పేరుకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)
 • హామీల అమలు సేద్యం సాగాలిక...

  దేశంలో వ్యవసాయ సంక్షోభం విస్తరిస్తోంది. ఈ తరుణంలో సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించి కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి పగ్గాలు చేపట్టడం రైతాంగంలో కొత్త ఆశలు నింపింది. లోక్‌సభ ఎన్నికలకు...
 • ముళ్ల కిరీటం

  వచ్చే మూడు దశాబ్దాల్లో విశ్వమానవాళి సంఖ్య రెండు వందలకోట్ల మేర విస్తరించి 970 కోట్లకు చేరనుందంటున్న ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక- 2027 సంవత్సరంనాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా ..
 • చిక్కులు విప్పని చట్టాలు

  భూమి లేని పేదవారిని ఆర్థికంగా ఆదుకోవడం కోసం, వారికి జీవనోపాధి కల్పించడం కోసం దశాబ్దాలుగా ప్రభుత్వాలు భూముల్ని పంపిణీ చేస్తున్నాయి. భూసంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల ఎకరాల...
 • సవాళ్ల పథంలో ఆర్థిక రథం

  కొంత కాలం నుంచి భారతీయ స్టాక్‌ మార్కెట్‌ పదేపదే కుదేలవడంతో మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఇది చాలదన్నట్లు డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ..
 • వ్యవస్థీకృత లోపాలే విస్తరణకు శాపాలు

  ఎలక్ట్రానిక్‌ చెల్లింపుల గురించి రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన సమాచారం ఆశావాదులు ఎగిరి గంతేసేంత గొప్పగా లేదు, నిరాశావాదులు పెదవి విరవడానికి ఆస్కారమిచ్చేలానూ ఏమీ లేదు.
 • పైన పటారం... లోనంతా లొసుగులమయం

  రుణాల ఎగవేత సమస్య బ్యాంకింగ్‌ వ్యవస్థను కొంతకాలంగా కుదిపివేస్తోంది. పారుబాకీలతోనే బ్యాంకులు సతమతమవుతున్నాయని ఇప్పటివరకు భావిస్తున్నారు. రుణగ్రస్తులు ఆ స్థాయినీ దాటి పూర్తి ఎగవేతకు..
 • స్వావలంబన బాటలో కొత్త సంకేతాలు

  పూర్వ యూపీఏ ప్రభుత్వాలు శత్రువుపై మెతక వైఖరి అవలంబించాయంటూ గతంలో నిప్పులు చెరిగిన భారతీయ జనతా పార్టీ- అధికార పగ్గాలు చేతికి రాగానే కరకు పంథాకు శ్రీకారం చుట్టింది.
 • ‘కేటు’ బ్యాంకులకు ప్రై‘వేటు’ మందు!

  ఇష్టానుసారం ఎడాపెడా అప్పులిచ్చి.. అవి తిరిగిరాక నష్టాల పాలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతిసారీ సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తున్నాయి. వేరే దారి లేక, అలా చూస్తూ ఊరుకోలేక..
 • సమతుల ప్రగతికి కట్టాలి పట్టం

  మానవుల పుట్టుక చావులు ప్రకృతి సృష్టి. జీవన విధానాలు మాత్రం మానవ నిర్మితం. మనుషులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, సమాజంలో వారి మధ్య, సమూహాల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ..
 • ఆర్థిక సుస్థిరతకు అప్పులముప్పు

  భారత ఆర్థిక వ్యవస్థ పలు పెను సవాళ్లు ఎదుర్కొంటోంది. పెరుగుతున్న టోకు ధరల ద్రవ్యోల్బణం, హద్దులు దాటుతున్న ప్రభుత్వ రుణం ఆర్థికవేత్తలను కలవరపెడుతున్నాయి.
 • గ్రామీణంపై దృష్టితోనే వృద్ధిరేట్లకు పుష్టి

  భారతదేశ త్రైమాసిక ఆర్థికాభివృద్ధిపై కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌ఓ) ఇటీవల విడుదల చేసిన అంచనాలు ప్రభుత్వ వర్గాల్లో ఆనందం నింపాయి.
 • నిధులకు నీళ్లు... విధులకు సీళ్లు

  ఒకప్పుడు దేదీప్యమానంగా వెలుగొందిన జిల్లా, మండల పరిషత్తులు ఇప్పుడు కాంతిహినమయ్యాయి. అభివృద్ధి పనులు ఏవీ చేయలేక పోతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇవి ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి.
 • ఆహార రాయితీపై మళ్ళీ పంచాయితీ

  అంతర్జాతీయ వేదికపై వ్యవసాయ సబ్సిడీలు మరోసారి కీలక చర్చనీయాంశం కాబోతున్నాయి. అర్జెంటీనా రాజధాని బ్యునస్‌ ఎయిర్స్‌లో నేటినుంచి 13వ తేదీ వరకు జరిగే పదకొండో...
 • మదుపరులకేదీ రక్షణ ఛత్రం?

  దేశంలోగల బ్యాంకులు, బీమా, ఆర్థిక సంస్థలు ఎప్పుడైనా విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుని విఫలమయ్యే పరిస్థితికి చేరుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో...
 • నలు మూలలకూ ‘భారత్‌ మాల’

  బ్యాంకులకు అదనపు మూలధనం సమకూర్చడంతోపాటు రహదారుల విస్తరణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం నడుంకట్టడం మన ఆర్థిక వ్యవస్థ దశదిశలను మార్చేయనుంది.
 • సరళతర పన్ను... వస్తుసేవల దన్ను!

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడేళ్ల పదవీకాలంలో సాధించిన అతి గొప్ప ఆర్థిక విజయం- వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందడం! దేశంలో ఏకీకృత పన్నుల వ్యవస్థకు నాంది పలుకుతున్న..
 • పారు బాకీలతో పారా హుషార్‌!

  దేశ బ్యాంకింగ్‌ రంగాన్ని పట్టి పీడిస్తున్న మొండిబాకీల (నిరర్ధక ఆస్తులు) సమస్య, నానాటికి మరింత తీవ్రరూపం దాలుస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రెండు మూడేళ్లుగా మొండిబాకీలను తగ్గించేందుకు..
 • ఆర్థిక రథానికి జోడు గుర్రాలు!

  దేశ ఆర్థిక రథాన్ని ముందుకు దూకించడంలో ఒక్కో సారథిది ఒక్కో తీరు. కట్టుతప్పుతున్న ధరలను నియంత్రించి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడమే ప్రాథమిక లక్ష్యంగా మొన్నటిదాకా ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న రఘురామ్‌..
 • నగదు... తగదు!

  నగదు లావాదేవీలు వేగంగా తగ్గుముఖం పడుతున్న కాలమిది. అంతర్జాలం ద్వారా డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం వూపందుకున్న తరుణంలో- ఈ మార్పునకు మరింత విప్లవాత్మకతను జోడిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏకీకృత చెల్లింపు..
 • సంస్కరణలకు పాతికేళ్లు...

  నిన్నటికి నిన్న కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలకమైన ఔషధ, రక్షణ, పౌరవిమానయాన రంగాల్లో నూరుశాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.
 • చమురు విపణిలో కల్లోలం!

  భారతదేశం 80శాతం మేరకు చమురు దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలో చైనా తరవాత అత్యధిక జనాభా కలిగినది ఇండియానే. ఆ మేరకు దేశంలో ఇంధన అవసరాలూ ఎక్కువే.
 • మెరవని పసిడి పథకాలు

  పెరిగిపోతున్న పసిడి దిగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థను అయోమయంలో పడేస్తున్నాయి. వాటిని కట్టడిచేసే ప్రయత్నంలో భాగంగా మోదీ ప్రభుత్వం ఈ ఏడాది నవంబరు అయిదున మూడు పసిడి పథకాలు..
 • అవసరాలకు 'చెల్లింపు'

  సమ్మిళిత వృద్ధిసాధన, అధిక ఆదాయానికి అవకాశాలు కల్పించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, అట్టడుగు వర్గాల జీవితాలను బాగుచేయడం వంటివి దేశప్రగతిలో ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి.
 • చైనా 'గోడ'కు బీటలు

  ప్రపంచ విపణిలో ఇటీవల కల్లోలం చెలరేగింది. చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను ఒక్కసారిగా తెగ్గోయడంతో అన్ని దేశాల కరెన్సీలూ బలహీనపడ్డాయి. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి.
 • కుదింపుతో పాటు మదింపు

  కేంద్ర పథకాలను బాగా కుదించాలన్న రాష్ట్ర ప్రభుత్వాల వాదన నెగ్గే సూచనలు ఉన్నాయి. ఇదివరకటి మొత్తం పథకాలు 147. ఇప్పడు వాటి సంఖ్య 72కు తగ్గింది. వీటిని 30కి పరిమితం చేసే అవకాశం ఉంది.
 • చైనా సంద్రంలో అల్పపీడనం

  చైనా ఈ నెలలో తన కరెన్సీ విలువను వరుసగా మూడుసార్లు తగ్గించడం ప్రపంచ ద్రవ్య విపణుల్లో కలకలం రేపింది. చైనా కరెన్సీ సాధికార నామం రెన్‌మిన్‌బీ కాగా, వాడుకలో ఉన్న పేరు యువాన్‌.
 • గాడి తప్పిన గ్రామీణ బ్యాంకులు

  పల్లెసీమల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గాలకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి గ్రామీణ బ్యాంకులను నెలకొల్పారు. ఇప్పుడు అవి పేరుకే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు.
 • భూతద్దంలో... భవిష్యత్తు!

  జనాకర్షణ మంత్రమా, సంస్క'రణ' తంత్రమా అన్నదానిపై తీవ్ర సంఘర్షణ దరిమిలా నిన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటుకు సమర్పించిన ఎన్‌డీఏ ప్రభుత్వ మొట్టమొదటి పూర్తిస్థాయి
 • డాలరు-రూపాయి మధ్య అగాధం...

  మొన్న, కొత్త సంవత్సరం రోజున డాలరుతో రూపాయి మారకం విలువ రూ.63.32. సరిగ్గా సంవత్సరం క్రితం అది రూ.61.93. అమెరికాలోని నాలుగో అతిపెద్ద మదుపు బ్యాంకు లెహ్‌మన్‌ బ్రదర్స్‌
 • బ్యాంకులకు మరింత స్వేచ్ఛ!

  ప్రమాదఘంటికలు మోగిస్తున్న నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) పెరుగుదల, అంతంతమాత్రంగా ఉన్న రుణగిరాకీ, అధికమవుతున్న మూలధన అవసరాలు దేశ బ్యాంకింగ్‌ రంగానికి పెనుసవాళ్లు విసురుతున్నాయి.
 • అదిగదిగో... ఆర్థిక నవలోకం..!

  జులై 2013లో భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం అన్ని వైపుల నుంచి ఆవరించింది. 2008 నాటి ఆర్థిక మాంద్యం నుంచి త్వరగా కోలుకున్నామని మురిసిపోతున్న మనదేశానికి వివిధ ఆర్ధిక కొలబద్దలు ప్రతికూలంగా తయారవడం