Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: జాతీయ, అంతర్జాతీయ తొలి సంఘటనలు - తొలి వ్యక్తులు :::
 
సంఘటన వ్యక్తి/ వ్యక్తులు  
» ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ - లండన్ (1863)  
» ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ - లండన్ (1890)
» ప్రపంచంలో తొలి గ్రంథం - రుగ్వేదం
» భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్ - అప్సర (1956)
» తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు - ఇండో - గ్రీకులు
» భారత్‌లో తొలి పత్రిక - బెంగాల్ గెజిట్ (1780)
» దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్ (1956)
» ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం - ముంబయి
» భారత్‌లో మొదటి మహిళా కళాశాల - బెతూన్ కళాశాల, కలకత్తా (1879)
» దేశంలో తొలి చమురు బావి - దిగ్బోయ్ (అస్సాం, 1890)
» ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం - జపాన్ (టోక్యో, 1964)
» మానవుడు మొదటిసారిగా మచ్చిక చేసుకున్న జంతువు - కుక్క
రాగి
» మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం - రాగి
» దేశంలో 100 శాతం కంప్యూటర్ అక్షరాస్యత సాధించిన తొలి గ్రామం - చామ్రవట్టం (కేరళ)
» భారత్‌లో తొలి నాగరికత - సింధు  
» భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం జరిగిన స్థలం - ముంబయి (1885)
» తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం - జనతా ప్రభుత్వం (1977 - 79)
» మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం - న్యూజిలాండ్ (1893)
డాలీ
» తొలి క్లోన్‌డ్ జంతువు - డాలీ అనే గొర్రె (1996)
» భారత్‌లో తొలిసారిగా భారజల ఉత్పత్తిని ప్రారంభించిన కేంద్రం - నంగల్ (పంజాబ్)
» భారత్‌లో తొలి పూర్తి బ్యాంకింగ్ జిల్లా - పాలక్కడ్ (కేరళ)
» భారతదేశంలో సౌరశక్తితో విద్యుదీకరించిన తొలి గ్రామం - చోగ్లామ్‌సార్ (జమ్ము, కాశ్మీర్)
» తొలి ఇ-నెట్‌వర్క్ జిల్లా - మలప్పురం (కేరళ)
» భారత్‌లో వైర్‌లెస్ కనెక్టివిటీ ఉన్న మొదటి నగరం - మైసూర్ (కర్ణాటక)
» భారత్‌లో మొదటి సమాచార సాంకేతికత ఉన్న జిల్లా - పాలక్కడ్ (కేరళ)
» భారత్‌పై దండెత్తిన తొలి యూరోపియన్ - అలెగ్జాండర్ (క్రీ.పూ. 326)
» భారత్‌లో పూర్తిగా విద్యుదీకరించిన తొలి నగరం - బెంగళూరు (1906)
» భారత్‌లో తొలి మహిళా విశ్వవిద్యాలయం - ఇండియన్ ఉమెన్స్ యూనివర్సిటీ (పుణె)
» మొదటి యాంటీ బయోటిక్ డ్రగ్ - పెన్సిలిన్
» భారత్‌లో మొదటి అణు పరీక్ష - పోఖ్రాన్ (రాజస్థాన్ - 1974)
» భారత్‌లో తొలి సైన్స్ నగరం - కలకత్తా
» భారత్ ప్రయోగించిన మొదటి ఉపగ్రహం - ఆర్యభట్ట (1975)
» కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి కృత్రిమ ఉపగ్రహం - స్పుత్నిక్ (రష్యా - 1957)
» ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన తొలి మహిళ - రజియా సుల్తానా
» భారత్‌లో మొదటి రైల్వే లైను - ముంబయి నుంచి థానే (1853)
» ఇండియాలో మొదటి టెలిగ్రాఫ్ లైను - కలకత్తా, డైమండ్ హార్బర్‌ల మధ్య (1851)
» శని గ్రహంపైకి పంపిన తొలి స్పేస్ క్రాఫ్ట్ - కేసినీ హ్యుగిన్స్ (2004)
» భారత్ మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం - ఆపిల్ (1981)
» భారత్ ప్రయోగించిన తొలి మల్టిపుల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ - PSLVC - 2
» భారత్‌లో తొలి తపాలా కార్యాలయం ఉన్న నగరం - కలకత్తా (1727)
» మనదేశంలో రేడియో ప్రసారాలు తొలిసారిగా ప్రసారమైన ప్రాంతం - ముంబయి, కలకత్తాల మధ్య (1927)
» ఇండియాలో తొలి మూగ (మూకి) సినిమా - రాజా హరిశ్చంద్ర (1913)
» ప్రపంచంలో మొదటి టాకీ సినిమా - ది జాజ్ సింగర్ (1927)
» భారత్‌లో మొదటి టాకీ సినిమా - ఆలం ఆరా (1931)
» పూర్తినిడివి ఉన్న మొదటి కార్టూన్ చిత్రం - స్నోవైట్ అండ్ ది సెవెన్ డ్వార్ఫ్స్
» భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం - టాటా ఐరన్, స్టీల్ కంపెనీ (1907)
» విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం - మదర్ ఇండియా
» భారతదేశ మొదటి యోగా శాస్త్రవేత్త - పతంజలి
» భారతదేశంలో మొదటిసారిగా స్థాపించిన పోలీసు మ్యూజియం - ఘజియాబాద్ (ఉత్తర్‌ ప్రదేశ్)
» ప్రపంచంలో మొదటిసారిగా నిర్వహించిన అందాల పోటీలు - కార్నిత్ (గ్రీకు క్రీ.పూ. 700)
» మొదటి కంపాక్ట్ డిస్క్ - సోనీ, ఫిలిప్స్ కంపెనీలు తయారు చేశాయి (1978)
» భారత్ తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ - ఇంగ్లండ్‌తో (1932)
» భారత్ తొలి ఎలక్ట్రిక్ రైలు - ముంబయి నుంచి వి.టి. కుర్లా వరకు (1925)
» మొదటి ఆటంబాంబు - లిటిల్ బాయ్ (1945)
» ప్రపంచంలో మొదటిసారిగా కుటుంబ నియంత్రణ అమలు చేసిన దేశం - భారతదేశం
» భారత దేశాన్ని సందర్శించిన తొలి చైనీస్ యాత్రికుడు - పాహియాన్
» భారత దేశంలో శాసనాలు వేయించిన తొలి చక్రవర్తి - అశోకుడు
» దేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం - పంజాబ్
» బోర్లాగ్ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ - డాక్టర్ అమితా పటేల్ (1992)
» భార‌త‌ దేశ మొదటి రాష్ట్రపతి - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1950 - 1962)
» భారత దేశ మొదటి ఉపరాష్ట్రపతి - సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952 - 62)
» భారత దేశ మొదటి ప్రధానమంత్రి - జవహర్‌లాల్ నెహ్రూ (1947 - 64)
» భారత దేశ మొదటి ఉప ప్రధానమంత్రి - సర్దార్ వల్లభాయ్ పటేల్ (1947 - 50)
» సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి - హీరాలాల్ జె.కానియా (1950 - 51)
» సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి - మీరా సాహెబ్ ఫాతిమా బీబీ (1989)
» భారత దేశ తొలి మహిళా అడ్వకేట్ - కోర్నేషియా సొరాబ్జి (కోల్‌క‌తా 1894)
» భారత దేశ హైకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి - లీలాసేథ్ (ఢిల్లీ)
» భారత్‌లో హైకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి - అన్నాచాంది
» స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్ - విలియం బెంటింగ్ (1828 - 35)
» భారతదేశ చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్ - లార్డ్ కానింగ్ (1856 - 62)
» స్వతంత్ర భారత మొదటి, చివరి గవర్నర్ జనరల్ - మౌంట్ బాటన్ (1947 - 48)
» స్వతంత్ర భారత మొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్ - సి. రాజగోపాలాచారి
విజయలక్ష్మి పండిట్
» ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ - విజయలక్ష్మి పండిట్ (1953)
» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి మహిళ - అనిబిసెంట్ (1917, కలకత్తా)
» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ - సరోజినీ నాయుడు (1925 - కాన్పూర్)
సరోజినీ నాయుడు
» భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు - ఉమేష్ చంద్ర బెనర్జి (1885 - బొంబయి)
» భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు - బద్రుద్దీన్ త్యాబ్జీ (1887 - మద్రాసు)  
» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు - పి. ఆనందాచార్యులు (1891 - నాగపూర్)
» వరుసగా రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి - రాస్ బిహారీ ఘోష్ (1907 - సూరత్, 1908 - మద్రాస్)
దాదాభాయ్ నౌరోజీ
» విడివిడిగా రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అయిన తొలి వ్యక్తి - దాదాభాయ్ నౌరోజీ (1886 - కలకత్తా, 1906 - కలకత్తా)
» భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కువసార్లు జరిగిన మొదటి పట్టణం - కలకత్తా (1886, 1906, 1917, 1928)
» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు - జార్జి యూల్ (1888 - అలహాబాదు)  
» భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి పార్శీ మతస్తుడు - దాదాభాయ్ నౌరోజీ
» బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు - దాదాభాయ్ నౌరోజీ
» భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన తొలి మహిళ - కాదంబినీ గంగూలీ (1901)
» భారత్‌లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి - బేబి హర్ష (1986)
» రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి గవర్నరు - ఒస్‌బ‌ర్న్ స్మిత్ (1935 - 37)
» ఆర్‌బీఐ తొలి భారతీయ గవర్నరు - సి.డి. దేశ్‌ముఖ్ (1943 - 49)
» ఆర్‌బీఐ తొలి మహిళా డిప్యూటీ గవర్నరు - కె.జె. ఉదేశి
» వెండితెరపై మొదటి నటి - దేవికారాణి
» గుండె మార్పిడి చికిత్స నిర్వహించిన మొదటి భారతీయుడు - డాక్టర్ వేణుగోపాల్
» భారత రత్న పురస్కారం పొందిన మొదటి వ్యక్తులు - సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలచారి, సి.వి.రామన్ (1954)
» భారతరత్న పొందిన తొలి మహిళ - ఇందిరాగాంధీ (1971)
సర్వేపల్లి రాధాకృష్ణన్
» భారతరత్న అవార్డు పొందిన తొలి ఉప రాష్ట్రపతి - సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954)
» భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త - సి.వి.రామన్ (1954)
» భారతరత్న అవార్డు పొందిన మొదటి ఇంజినీర్ - మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1955)  
» భారతరత్న అవార్డు పొందిన తొలి ప్రధాని - జవహర్‌లాల్ నెహ్రూ (1955)
బాబూ రాజేంద్రప్రసాద్
» భారతరత్న అవార్డు పొందిన తొలి రాష్ట్రపతి - బాబూ రాజేంద్రప్రసాద్ (1962)
» మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి - లాల్‌బహదూర్ శాస్త్రి (1966)
» భారతరత్న అవార్డు పొందిన తొలి విదేశీయుడు - ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ (1987)  
» భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడు - ఎం.జి. రామచంద్రన్ (1988)
» భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా దర్శకుడు - సత్యజిత్ రే (1992)
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి
» సంగీతంలో భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి, తొలి మహిళ - ఎం.ఎస్. సుబ్బులక్ష్మి(1998)
» పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి - డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969)
» పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి - కృష్ణకాంత్ (2002)  
» తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి - వరాహగిరి వెంకటగిరి (1969 మే - 1969 జులై)
» మొదటి ముస్లిం రాష్ట్రపతి - డాక్టర్ జాకీర్ హుస్సేన్
» మొదటి సిక్కు రాష్ట్రపతి - జ్ఞానీ జైల్‌ సింగ్
» అత్యధిక కాలం రాష్ట్రపతిగా పనిచేసిన తొలి రాష్ట్రపతి - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్
» ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టిన మొదటి వ్యక్తి - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
» మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రాష్ట్రపతి - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1962)
» అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా వ్యవహరించిన రాష్ట్రపతి - డాక్టర్ జాకీర్ హుస్సేన్
» మొదటి కాంగ్రెసేతర రాష్ట్రపతి - వరాహగిరి వెంకటగిరి
» స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మొదటి రాష్ట్రపతి - వరాహగిరి వెంకటగిరి
» సుప్రీంకోర్టులో సాక్షిగా హాజరైన మొదటి రాష్ట్రపతి - వరాహగిరి వెంకటగిరి
» అతి ఎక్కువ ఆర్డినెన్స్‌లు జారీచేసిన రాష్ట్రపతుల్లో ప్రథముడు - ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్
» ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి - ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్
నీలం సంజీవరెడ్డి
» ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి - నీలం సంజీవరెడ్డి
» పిన్న వయసులోనే (63 సంవత్సరాలు) రాష్ట్రపతి మొదటి వ్యక్తి - నీలం సంజీవరెడ్డి
» ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా (ఆంధ్రప్రదేశ్), స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి - నీలం సంజీవరెడ్డి
కె.ఆర్. నారాయణన్
» తొలి దళిత రాష్ట్రపతి - కె.ఆర్. నారాయణన్
» ఓటు హక్కు ఉపయోగించుకున్న తొలి రాష్ట్రపతి - కె.ఆర్.నారాయణన్  
» తొలి మహిళా రాష్ట్రపతి - ప్రతిభా దేవీసింగ్ పాటిల్
» అత్యధిక కాలం (2 పర్యాయాలు) (1952 - 62) ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి వ్యక్తి - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
» తొలి ముస్లిం ఉపరాష్ట్రపతి - డాక్టర్ జాకీర్ హుస్సేన్
» అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి - వరాహగిరి వెంకటగిరి
» తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి ఉపరాష్ట్రపతి - వరాహగిరి వెంకటగిరి
» ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన తొలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా
» పెద్ద వయసులో ఉపరాష్ట్రపతిగా (73 ఏళ్లు) వ్యవహరించిన తొలి వ్యక్తి - ఆర్.వెంకట్రామన్
» అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి - జవహర్ లాల్ నెహ్రూ (17 సంవత్సరాలు; 1947 - 64)
» . పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధాని - జవహర్‌లాల్ నెహ్రూ
» ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని - జవహర్‌లాల్ నెహ్రూ
» విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని - లాల్‌బహదూర్‌శాస్త్రి
» మొదటి మహిళా ప్రధాని - ఇందిరాగాంధీ
ఇందిరాగాంధీ
» ప్రధానిగా వ్యవహరిస్తూ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన మొదటి ప్రధాని - ఇందిరాగాంధీ (1977)
» రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి - ఇందిరాగాంధీ
» అత్యధిక రాజ్యాంగ సవరణలు చేసిన మొదటి ప్రధాని - ఇందిరాగాంధీ  
» ఎక్కువసార్లు రాష్ట్రపతి పాలన విధించిన మొదటి ప్రధాని (48 సార్లు) - ఇందిరాగాంధీ
» హత్యకు గురైన మొదటి ప్రధాని - ఇందిరాగాంధీ
» అరెస్టు అయిన మొదటి ప్రధాని - ఇందిరాగాంధీ
» మొదటి కాంగ్రెసేతర ప్రధాని - మొరార్జీ దేశాయ్
» పెద్ద వయసులో ప్రధానిగా (81 ఏళ్లు) వ్యవహరించిన వ్యక్తి - మొరార్జీ దేశాయ్
» ప్రధాని పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి - మొరార్జీ దేశాయ్
» మొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి - చరణ్ సింగ్
» తన పదవీకాలంలో పార్లమెంటులో అడుగుపెట్టని ఏకైక ప్రధాని - చరణ్ సింగ్
రాజీవ్ గాంధీ
» అతి పిన్న వయసులో (47 ఏళ్లు) ప్రధాని పదవిని అధిష్టించిన తొలి వ్యక్తి - రాజీవ్ గాంధీ
» విశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడిన ఏకైక ప్రధాని - విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్
» ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని - చంద్రశేఖర్  
» దక్షిణ భారత దేశం నుంచి ప్రధాని అయిన మొదటి వ్యక్తి - పి.వి. నరసింహారావు
» పార్లమెంటులో సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన తొలి వ్యక్తి - పి.వి. నరసింహారావు
» ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి ప్రధాని - అటల్ బిహారీ వాజ్‌పేయ్
» ‘వరల్డ్ స్టేట్స్‌మెన్’ అవార్డు పొందిన ఏకైక ప్రధాని - ఐ.కె. గుజ్రాల్
» ప్రధానమంత్రి పదవిని అలంకరించిన మొదటి ఆర్థికవేత్త - మన్మోహన్ సింగ్
» ఏకైక తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి - గుల్జారీలాల్ నందా
» లోక్‌సభ తొలి స్పీకర్ - గణేష్ వాసుదేవ్ మౌలాంకర్
» లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు - నీలం సంజీవరెడ్డి
» రెండు లోక్‌సభలకు స్పీకర్‌గా చేసిన తొలి వ్యక్తి - డాక్టర్ బలరాం జక్కర్
» లోక్‌సభకు తొలి దళిత స్పీకర్ - జి.ఎం.సి. బాలయోగి
» లోక్‌సభకు తొలి మహిళా స్పీకర్ - మీరాకుమార్‌
» భారత తొలి ఎన్నికల కమిషనర్ - సుకుమార్ సేన్
» భారత ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన తొలి ఆంధ్రుడు - ఆర్.ఎ.ఎస్. పేరిశాస్త్రి
» భారత ఎన్నికల తొలి మహిళా కమిషనర్ - వి.ఎస్. రమాదేవి
» అతి తక్కువ కాలం ఎన్నికల కమిషనర్‌గా వ్యవహరించిన వ్యక్తి - వి.ఎస్. రమాదేవి (16 రోజులు)
» మొదటి మహిళా గవర్నర్ - సరోజినీ నాయుడు (ఉత్తర్ ప్రదేశ్, 1947 - 49)
» మొదటి మహిళా ముఖ్యమంత్రి - సుచేతా కృపాలానీ (ఉత్తర్ ప్రదేశ్, 1963 - 67)
» మొదటి దళిత మహిళా ముఖ్యమంత్రి - మాయావతి (ఉత్తర్ ప్రదేశ్, 1995)
దామోదరం సంజీవయ్య
» మొదటి దళిత ముఖ్యమంత్రి - దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్, 1960 - 62)
» ముఖ్యమంత్రి అయిన తొలి సినిమా నటుడు - ఎం.జి. రామచంద్రన్ (తమిళనాడు)
» ముఖ్యమంత్రి అయిన తొలి స్వతంత్ర అభ్యర్థి - బిశ్వనాథ్ దేశ్ (1971)  
» అవినీతి కుంభకోణంపై అరెస్టు అయి జైలుకు వెళ్లిన తొలి ముఖ్యమంత్రి - జయలలిత (తమిళనాడు, 1996)
» ప్రజలు ఎన్నుకున్న తొలి లెఫ్ట్ ప్రభుత్వాధినేత (ప్రపంచంలో కూడా) - నంబూద్రిపాద్ (కేరళ, 1957)
» ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి హిజ్రా - షబ్మమ్ మౌసి (మధ్యప్రదేశ్, 2000)
» ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయురాలు - భాను అథయా (1983)
» ఆస్కార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పొందిన తొలి భారతీయుడు - సత్యజిత్ రే (1992)
» రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భారతీయుడు - ఆచార్య వినోబా భావే (1958)
» రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి మహిళ - మదర్ థెరిసా (1962)
ఆచార్య వినోబా భావే
» రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి ఆసియావాసి - ఆచార్య వినోబా భావే(1958)
» రామన్ మెగసెసె అవార్డును మొదటిగా గ్రహించింది - ఆచార్య వినోబా భావే
» సామాజిక నాయకత్వంలో రామన్‌మెగసెసె అవార్డును తొలిగా గ్రహించింది - ఆచార్య వినోబా భావే(1958)  
» రామన్‌మెగసెసె అవార్డు పొందిన తొలి తండ్రీకొడుకులు - బాబా ఆమ్టే (1985), ప్రకాష్ ఆమ్టే (2008)
» రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భార్యాభర్తలు - మందాకినీ ఆమ్టే (2008), ప్రకాశ్ ఆమ్టే (2008)
» ఎమర్జంట్ లీడర్‌షిప్ అంశం కింద రామన్ మెగసెసె అవార్డు పొందిన తొలి భారతీయుడు - సందీప్ పాండే (2002)
» జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి వ్యక్తి - శంకర కురూప్ (1965) (రచన: ఒడక్క జుల్, మలయాళం)
» జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి మహిళ - ఆషాపూర్ణాదేవి (1976, ప్రథమ్, ప్రతిశ్రుతి, బెంగాలీ)
» బుకర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయుడు - వి.ఎస్. నైపాల్ (1971)
» బుకర్‌ప్రైజ్ పొందిన తొలి భారతీయ మహిళ - అరుంధతీ రాయ్ (ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, 1997)
» పులిట్జర్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ - ఝంపా లాహిరి (2000)
» దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి వ్యక్తి - దేవికారాణి రోరిచ్ (1969)
» దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి ఆంధ్రుడు - బి.ఎన్.రెడ్డి (1974)
» బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన తొలి వ్యక్తి - ఇంద్రజిత్ గుప్తా (1993)
అక్కినేని నాగేశ్వరరావు
» ఎన్టీఆర్ అవార్డు పొందిన తొలి వ్యక్తి - అక్కినేని నాగేశ్వరరావు (1996)
» వైశ్రాయ్ కౌన్సిల్ మొదటి భారతీయ సభ్యుడు - ఎస్.పి. సిన్హా
» సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి - కె.జి. బాలకృష్ణన్ (2007)  
» మహాభియోగ తీర్మానాన్ని ఎదుర్కొన్న తొలి, ఏకైక సుప్రీంకోర్టు న్యాయమూర్తి - జస్టిస్ వి. రామస్వామి (1993)
» తొలి మహిళా మేజిస్ట్రేట్ - ఓమన కుంజమ్మ
» అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు - డాక్టర్ నాగేందర్ సింగ్
» రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు - విశ్వనాథన్ ఆనంద్ (చదరంగం, 1991 - 94)
» రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారిణి - కరణం మల్లేశ్వరి (1995)
సచిన్ టెండూల్కర్
» రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి క్రికెటర్ - సచిన్ టెండూల్కర్ (1997)
» బాక్సింగ్‌లో రాజీవ్‌ఖేల్‌రత్న అవార్డు పొందిన తొలి మహిళ - మేరికోమ్ (మణిపూర్)
» పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి - సోమనాథ్ శర్మ  
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు - టెన్సింగ్ నార్కే (1953, మే 29)
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలు - బచేంద్రిపాల్ (1984)
» ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి భారతీయురాలు - సంతోష్‌యాదవ్ (1993, మే 10)
» ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న తొలి దక్షిణ భారతీయుడు - శేఖర్ బాబు (ఆంధ్రప్రదేశ్)
» ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన తొలి వ్యక్తి - నవాంగ్ గొంబూ (1965)
» ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తి - పూదోర్జి
» తొలి భారతీయ ఐ.పి.ఎస్. అధికారి - సత్యేంద్రనాథ్ ఠాగూర్
» తొలి మహిళా ఐ.ఎ.ఎస్. అధికారి - అన్నాజార్జ్
కిరణ్‌బేడి
» తొలి మహిళా ఐ.పి.ఎస్. అధికారి - కిరణ్‌బేడి (1972)
» తొలి మహిళా డి.జి.పి. అధికారి - కంచన్ చౌదరి భట్టాచార్య (ఉత్తరాఖండ్)
» ఐక్యరాజ్యసమితి సివిల్ పోలీస్‌కు సలహాదారుడిగా నియమితులైన తొలి భారతీయ మహిళ - కిరణ్‌బేడి  
» భారతీయ రైల్వే బోర్డులో మొదటి మహిళా సభ్యురాలు - విజయలక్ష్మీ విశ్వనాథన్
» తొలి మహిళా రాయబారి - విజయలక్ష్మి పండిట్ (మాజీ సోవియట్‌కు, 1947 - 49)
» తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి - చోకిలా అయ్యర్
» ఇంగ్లిష్‌ఛానెల్ ఈదిన తొలి మహిళ - ఆర్తిసాహా (1959)
» ఇంగ్లిష్ ఛానెల్‌ను ఈదిన తొలి భారతీయుడు - మిహిర్‌సేన్ (1958)
» ఇంగ్లిష్ ఛానెల్‌ను రెండుసార్లు ఈదిన తొలి భారతీయురాలు - బులా చౌదరి (2004)
» సప్త సముద్రాల్లోని 7 జలసంధులను ఈదిన తొలి భారతీయురాలు - బులా చౌదరి (ప్రపంచంలోనే మొదటి వ్యక్తి)
» జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మొదటి భారతీయ మహిళ - ఆర్తి సాహా
» అయిదు ఖండాల్లో సముద్రాలను ఈదిన తొలి మహిళ - బులా చౌదరి
» స్వతంత్ర భారత పోస్టల్ స్టాంపుపై దర్శన మిచ్చిన తొలి వ్యక్తి - మహాత్మా గాంధీ (1948)
» మొదటి భారతీయ మహిళా ఫొటో జర్నలిస్ట్ - హోమియా వ్యారవల్లా (బాంబే క్రానికల్, 1938)
» రైల్వే ఇంజిన్ డ్రైవర్ అయిన మొదటి భారతీయ మహిళ - సురేఖా యాదవ్ (ఇండియన్ రైల్వేస్, 1992)
» నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు - ఒమనా అబ్రహం (కొట్టాయం, కేరళ)
» భారత్‌ను పాలించిన తొలి మహిళ - రజియా సుల్తానా (1236 - 1240)
» అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు - రాకేష్ శర్మ (1984)
» అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ టూరిస్ట్ - సంతోష్ జార్జి (కేరళ)
కల్పనా చావ్లా
» అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ - కల్పనా చావ్లా
» ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం పొందిన తొలి భారతీయుడు - ఖాషాబా జాదవ్ (1952, రెజ్లింగ్, కాంస్యం)
» ఒలింపిక్స్‌లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారతీయురాలు - కరణం మల్లేశ్వరి (2000, వెయిట్‌లిఫ్టింగ్, కాంస్యం)  
» ఒలింపిక్ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ - పి.టి. ఉష (1984)
» ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయుడు - రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (2004, ఏథెన్స్, షూటింగ్)
» ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు - అభినవ్ బింద్రా (2008, బీజింగ్, షూటింగ్)
» భూగోళం చుట్టివచ్చిన మొదటి భారతీయుడు - లెఫ్టినెంట్ కల్నల్ కె.ఎస్. రావు
» భూగోళం చుట్టివచ్చిన తొలి భారతీయ మహిళ - ఉజ్వల రాయ్
విశ్వనాథన్ ఆనంద్
» చదరంగంలో తొలి భారతీయ గ్రాండ్‌మాస్టర్ - విశ్వనాథన్ ఆనంద్
» చదరంగంలో తొలి భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్ - ఎస్. విజయలక్ష్మి (2000)
» ప్రపంచ బిలియర్డ్స్ ట్రోఫీని గెలుచుకున్న తొలి భారతీయుడు - విల్సన్ జోన్స్  
» ప్రపంచ అథ్లెటిక్స్‌లో పతకం పొందిన తొలి భారతీయ మహిళ - అంజూ బాబీ జార్జ్
» అంటార్కిటికాను చేరిన తొలి భారతీయుడు - లెఫ్టినెంట్ రామ్‌చరణ్ (1960)
» అంటార్కిటికాను చేరుకున్న తొలి భారతీయ మహిళ - మోహర్‌మూస్ (1976)
» మొదటి భారతీయ ప్రపంచ సుందరి - రీటా ఫారియా (1966)
» మొదటి భారతీయ విశ్వసుందరి - సుస్మితాసేన్ (1994)
» మొదటి మిస్ ఇండియా - ప్రమీల (1947)
» మొదటి మిస్ ఏసియా పసిఫిక్ - దియామీర్జా (2000)
» పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి నటి - నర్గీస్ దత్
» నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు (ఆసియావాసి) - రవీంద్రనాధ్ ఠాగూర్ (1913)
మదర్ థెరిసా
» నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ వనిత - మదర్ థెరిసా (శాంతి, 1971)
» ఆసియాన్ గేమ్స్‌లో వ్యక్తిగత బంగారు పతకం పొందిన తొలి భారతీయ మహిళ - కమలజిత్ సంధూ (1970)
» భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ - సి.కె. నాయుడు (1932)  
» స్వతంత్ర భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ - లాలా అమర్‌నాథ్ (1947 - 48)
» తొలి టెస్ట్ సెంచరీ సాధించిన భారతీయుడు - లాలా అమర్‌నాథ్ (ఇంగ్లండ్‌పై)
వీరేంద్ర సెహ్వాగ్
» ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు - వీరేంద్ర సెహ్వాగ్ (పాకిస్థాన్, 2004)
» టెస్టుల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు - సునీల్ గవాస్కర్
» టెస్టుల్లో వన్డేల్లో పదివేల పరుగులు పూర్తిచేసిన తొలి భారతీయుడు - సచిన్ టెండూల్కర్  
» టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడు - హర్భజన్ సింగ్ (ఆస్ట్రేలియాపై 2001)
» భారతదేశ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ - విలియం బెంటిక్
» భారత్‌లో హత్యకు గురైన ఏకైక వైశ్రాయి - లార్డ్ మేయో (1872)
» బెంగాల్ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ - వారన్ హేస్టింగ్స్
జె.ఆర్.డి. టాటా
» భారత్‌లో మొదటి పైలట్ - జె.ఆర్.డి. టాటా (1929)
» ఎయిర్ బస్ మొదటి భారతీయ మహిళా పైలట్ - దుర్గా బెనర్జీ
» వైమానిక దళంలో పైలట్‌గా పనిచేసిన తొలి భారతీయ మహిళ - హరితాకౌర్ దయాల్  
» మొదటి భారతీయ ఎయిర్ మార్షల్ - అర్జున్ సింగ్
» వైమానిక దళ తొలి మహిళా ఎయిర్ వైస్ మార్షల్ - పద్మా బందోపాధ్యాయ
» మొదటి వైమానిక దళాల ప్రధానాధికారి - ఎస్.కె. ముఖర్జి (1954 - 60)
» మొదటి నావికా దళాల ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ - ఆర్.డి. కటారి (1958 - 62)
» నావికా దళంలో మొదటి మహిళా వైస్ అడ్మిరల్ - పునీతా అరోరా
» సైనికా దళంలో తొలి మహిళా లెఫ్టినెంట్ జనరల్ - పునీతా అరోరా
» సైనిక దళాల మొదటి ప్రధానాధికారి - జనరల్ ఎమ్. రాజేంద్ర సింగ్ (1955)
» తొలి ఫీల్డ్ మార్షల్ జనరల్ - మానెక్ షా (1973)
» స్వతంత్ర భారత మొదటి ఎయిర్ చీఫ్ ఎయిర్ మార్షల్ - సర్ థామస్ ఎల్ మ్రిస్ట్ (1947 - 50)
» స్వతంత్ర భారత తొలి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ - కె.ఎం. కరియప్ప (1949 - 53)
» డబ్ల్యూహెచ్‌వో ఆరోగ్య సమావేశాలకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ - రాజకుమారి అమృత కౌర్ (1950)
» తొలి భారతీయ మహిళా వైద్యురాలు - కాదంబినీ గంగూలీ (1886)
» పదవిలో ఉండగా మరణించిన ఏకైక స్పీకర్ - జి.ఎం.సి. బాలయోగి
» మొదటి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ - ఎస్.వి. కృష్ణమూర్తి (1952)
» రాజ్యసభకు తొలి మహిళా డిప్యూటీ ఛైర్మన్ - వయిలెట్ ఆల్వా (1962 - 69)
» రాజ్యసభ మొదటి మహిళా సెక్రటరీ జనరల్ - వి.ఎస్. రమాదేవి
» మొదటి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ - అనంతశయనం అయ్యంగార్ (1952 - 56)
» మొదటి మహిళా కేంద్రమంత్రి - రాజకుమారి అమృతకౌర్ (ఆరోగ్యశాఖ 1947 - 57)
మౌలానా అబుల్ కలాం ఆజాద్
» మొదటి విద్యాశాఖామంత్రి - మౌలానా అబుల్ కలాం ఆజాద్
» తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి - ఆర్.కె. షుణ్ముగం చెట్టి (1947)
» రాష్ట్రాల పరంగా తొలి మహిళా మంత్రి - విజయలక్ష్మీ పండిట్ (ఉత్తర ప్రదేశ్)  
» రాష్ట్రాలపరంగా మొదటి మహిళా స్పీకర్ - షానోదేవి (హర్యానా)
» సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసినవారు - వై.వి. చంద్రచూడ్ (7 ఏళ్లకు పైగా)
» సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పనిచేసినవారు - కె.ఎన్. సింగ్ (18 రోజులు)
» మొదటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - వి. నరహరి రావు
» మొదటి అటార్నీ జనరల్ - ఎం.సి. సెతల్‌వాడ్
» మొదటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ - హెచ్.కె. కృపలాని
» దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టిన తొలి ప్రధాని - వి.పి. సింగ్
» కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ప్రధాని - మన్మోహన్ సింగ్
» రఘుపతి వెంకయ్య అవార్డు పొందిన తొలి వ్యక్తి - ఎల్.వి. ప్రసాద్
» టెంపుల్టన్ అవార్డు పొందిన తొలి భారతీయుడు - సర్వేపల్లి రాధాకృష్ణన్
» రైట్ టు లైవ్‌లీ హుడ్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి - రూత్ మనోరమ
జవహర్‌లాల్ నెహ్రూ
» ఎర్రకోటపై ఎక్కువసార్లు జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని - జవహర్‌లాల్ నెహ్రూ (17 సార్లు)
» తొలి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ - డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్
» చీఫ్ విజిలెన్స్ కమిషనర్‌గా నియమితులైన తొలి వ్యక్తి - ఎన్. శ్రీనివాసరావు  
» జాతీయ సమగ్రతా మండలికి తొలి అధ్యక్షుడు - జవహర్‌లాల్ నెహ్రూ
» జాతీయ భద్రతా మండలికి తొలి అధ్యక్షుడు - బ్రిజేష్ మిశ్రా
» జాతీయ వినియోగదారుల కమిషన్ మొదటి ఛైర్మన్ - జస్టిస్ వి. బాలకృష్ణ ఎరాడి
డాక్టర్ అంబేద్కర్
» తొలి కేంద్ర‌ న్యాయశాఖామంత్రి - డాక్టర్ అంబేద్కర్
»తొలి కేంద్ర‌ కార్మిక శాఖామంత్రి - బాబూ జగ్‌జ్జీవన్ రామ్
» తొలి కేంద్ర‌ రక్షణ శాఖామంత్రి - బల్‌దేవ్‌సింగ్  
» తొలి కేంద్ర‌ హోంశాఖామంత్రి - సర్దార్ వల్లభాయ్ పటేల్
» తొలి కేంద్ర‌ వ్యవసాయ శాఖామంత్రి - బాబూ రాజేంద్రప్రసాద్
» తొలి కేంద్ర‌ ఆర్థికమంత్రి - ఆర్.కె. షణ్ముగం చెట్టి
» ఉత్తర ధ్రువాన్ని చేరుకున్న తొలి వ్యక్తి - రాబర్ట్ పియరీ (1909)
» దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి మహిళ - కరోలిన్ మికెల్‌సెన్ (1935)
» దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న తొలి వ్యక్తి - అముండ్‌సెన్ (నార్వే, 1911)
» దేశానికి అధ్యక్షురాలైన తొలి మహిళ - ఇసబెల్ పెరాన్ (అర్జెంటీనా, 1974)
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు - టెన్సింగ్ నార్కే (భారత్), ఎడ్మండ్ హిల్లరీ (న్యూజిలాండ్) 1955
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి తల్లీకూతుళ్లు - చెరైల్ బర్ట్, సిక్కి (ఆస్ట్రేలియా, 2008)
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి దంపతులు - ఆండ్రిజ్, మరిజా స్ట్రీమ్‌ఫెల్జ్ (స్లోవేకియా)
» ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తులు - పీటర్ హబెలర్ (ఆస్ట్రేలియా), రెన్‌హోల్డ్ మెస్నర్ (ఇటలీ)
» ఎవరెస్ట్ శిఖరంపై అధిక సమయం గడిపిన తొలి వ్యక్తి - బాబూ చిరిషెర్పా
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అతిపిన్న వయస్కురాలు - డిక్కిడోల్మ
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగుడు - టామ్ విట్టేకర్
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అంధుడు - ఎరిక్ విహెన్మియర్ (అమెరికా, 2001)
» ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ - జుంకోతాబి (జపాన్, 1975)
» తొలి విశ్వసుందరి - ఆర్మికౌసెల (ఫిన్‌లాండ్, 1952)
» తొలి ప్రపంచ సుందరి - కెర్‌స్టిన్ కికి హాకోన్సన్ (స్వీడన్, 1951)
నీల్ఆర్మ్‌స్ట్రాంగ్
» చంద్రుడిపై కాలు మోపిన తొలి వ్యక్తి - నీల్ఆర్మ్‌స్ట్రాంగ్ (అమెరికా 1969)
» బ్రిటన్ మొదటి ప్రధాని - రాబర్ట్ వాల్‌పోల్ (1721)
» బ్రిటన్ మొదటి మహిళా ప్రధాని - మార్గరెట్ థాచర్ (కన్జర్వేటివ్ పార్టీ, 1979 - 90)  
» సముద్ర మార్గంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి - ఫెర్టినాండ్ డిమాజిలాన్ (స్పెయిన్)
» జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి మహిళ - ఆర్తి సాహా (భారత్)
» జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి వికలాంగుడు - తారానాథ్ షెనాయ్ (1988)
» అమెరికా మొదటి అధ్యక్షుడు - జార్జి వాషింగ్టన్ (1789)
» రాజీనామా చేసిన మొదటి అమెరికా అధ్యక్షుడు - రిచర్డ్ నిక్సన్ (1974)
అబ్రహం లింకన్
» హత్యకు గురైన మొదటి అమెరికా అధ్యక్షుడు - అబ్రహం లింకన్ (1865)
» గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి మహిళ - మౌరీన్ క్యాథరిన్ (1953)
» మొదటి ప్రపంచ చెస్ ఛాంపియన్ - విల్‌హెల్మ్ స్టెయిన్ట్జ్ (1886)  
» ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న తొలి మహిళ - చార్లొట్టే కూపర్ (యూకే టెన్నిస్, 1900)
» జర్మనీ మొదటి మహిళా ఛాన్సెలర్ - ఎంజెలా మెర్కెల్ (2005)
నెల్సన్ మండేలా
» దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు - నెల్సన్ మండేలా (1994)
» అమెరికాకు అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు - బరాక్ హుస్సేన్ ఒబామా
» తొలి మహిళా బిషప్ - రీవ్ బార్బరా సి హ్యారీస్ (1988, అమెరికా)  
» అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి - లైలా అనే కుక్క (స్పుత్నిక్ - 2, 1957)
» అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికా వ్యోమగామి - అలెన్ షెపర్డ్ (1961)
యూరీ గగారిన్
» అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి - యూరీ గగారిన్ (సోవియట్ యూనియన్ 1961)
» అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ - వాలెంటీనా తెరిష్కోవా (యూఎస్ఎస్ఆర్, 1963)
» అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి - అలెక్సి లియనోవ్ (యూఎస్ఎస్ఆర్, 1965)  
» అంతరిక్షంలో నడిచిన తొలి మహిళ - స్వెత్లానా సవిత్సకయ (యూఎస్ఎస్ఆర్, 1982)
» అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ - డెన్నిస్ టిటో (అమెరికా, 2001)
» అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళా టూరిస్ట్ - అనౌషి అన్సారి (2006)
» అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ముస్లిం మహిళ - అనౌషి అన్సారి (2006)
» ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి వ్యక్తి - ఎమిల్ జెన్నింగ్స్ (1928)
» ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి నల్ల జాతీయురాలు - హాలీ బెర్రి (2002)
» ఓడపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి - ఫెర్డినాండ్ మాజిలాన్ (స్పెయిన్)
» పులిట్జర్ బహుమతి పొందిన తొలి నల్లజాతీయురాలు - జి.బ్రూక్స్ (1950)
» ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్ - ట్రిగ్వేలీ (నార్వే, 1946 - 53)
» ఐక్యరాజ్యసమితి తొలి డిప్యూటీ సెక్రెటరీ జనరల్ - లూయిస్ ఫ్రీ చెట్టి
» గ్రాడ్యుయేట్ అయిన తొలి మూగ, చెవిటి మహిళ - హెలెన్ కెల్లర్ (1904)
హెలెన్ కెల్లర్
» అంటార్కిటిక్ వలయాన్ని దాటిన తొలి వ్యక్తి - జేమ్స్ కుక్ (1773)
» ప్రపంచంలో అన్ని ఖండాల్లోని ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ - అన్నా బిల్లీబెండ్
 
» ఇంగ్లిష్ ఛానెల్ ఈదిన తొలి వ్యక్తి - మాథ్యువెబ్ (1875)
» తొలి టెస్ట్‌ట్యూబ్ బేబి - లూయిస్ బ్రౌన్ (1978, ఇంగ్లండ్)
» గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి - క్రిస్టియన్ బెర్నార్డ్ (1967, దక్షిణాఫ్రికా)
» భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి - విలియం రాంట్‌జన్ (1901, జర్మనీ)
» రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి - జాకబ్స్ వాంట్ హాప్ (1901, నెదర్లాండ్స్)
» వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి - ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ (1901, జర్మనీ)
» ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తులు - రాగ్నర్ ఫ్రిష్ (నార్వే), జాన్ టిన్ బెర్జెన్ (నెదర్లాండ్స్) 1969
» నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి వ్యక్తులు - జీన్ హెన్రీ డ్యునాంట్ (స్విస్), ఫ్రెడరిక్ పాసీ (ఫ్రాన్స్)
» సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి - సల్లీప్రుదోమ్మి (ఫ్రాన్స్, 1901)
» నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి నల్లజాతీయుడు - రాల్ఫ్ బంచె (1950)
మేరీ క్యూరి
» రెండుసార్లు నోబెల్ బహుమతి అందుకున్న తొలి వ్యక్తి - మేరీ క్యూరి (భౌతికశాస్త్రం (1903), రసాయన శాస్త్రం (1911))
» నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ముస్లిం మహిళ - షిరిన్ ఎబాది (ఇరాన్, 2003)
» అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ - రోజాలిన్ హిగ్గిన్స్  
» జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ మొదటి ఛైర్మన్ - సూరజ్ భాను
» జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మొదటి ఛైర్మన్ - కున్వర్ సింగ్
» జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ మొదటి ఛైర్మన్ - ఆర్.ఎన్. ప్రసాద్
» జాతీయ మైనారిటీల కమిషన్ మొదటి ఛైర్మన్ - జస్టిస్ ఎం.డి. సర్దార్ అలీఖాన్
» జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ మొదటి ఛైర్మన్ - శాంతా సిన్హా
» జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి ఛైర్మన్ - జస్టిస్ రంగనాథ్ మిశ్రా
» వయోపరిమితి సమస్య ఎదుర్కొన్న తొలి సైనిక దళాల ప్రధాన అధికారి - జనరల్ వి.కె. సింగ్
» 1987లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ ట్యాంకు - వైజయంతి
» భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం - నిశాంత్
» భారత నావికాదళంలో తొలి యుద్ధ నౌక - ఐఎన్ఎస్ సావిత్రి
» ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి యుద్ధ నౌక - ఐఎన్ఎస్ తరంగిణి
» భారత్‌లో తొలి విమాన వాహక నౌక - ఐఎన్ఎస్ విశ్రాంత్
» మన దేశ తొలి గూఢచార నౌక - ఐఎన్ఎస్ శివాలిక్
» స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దేశ తొలి క్షిపణి నౌక - ఐఎన్ఎస్ విభూతి
» దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి సబ్‌మెరైన్ - ఐఎన్ఎస్ షల్కి
» భారత దేశ తొలి అణు సబ్‌మెరైన్ - ఐఎన్ఎస్ చక్ర
» స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి - అరిహంత్ (2009)
» మన దేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం - భాస్కర - 1
» ప్రపంచంలోనే తొలిసారిగా సముద్ర పరిశోధనలకు ప్రయోగించిన ఉపగ్రహం - ఓషన్‌శాట్ - 1
» చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం - చంద్రయాన్ - 1
» సింగపూర్ తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం - ఎక్సోశాట్
» జీఎస్ఎల్వీ శ్రేణిలో మొదటి నౌక - జీఎస్ఎల్వీ - డీ1
» స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి - పృథ్వీ
» గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి - అగ్ని-2
» భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి - సూర్య
» భారతదేశ తొలి అణు పరిశోధనా కేంద్రం - బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బీఏఆర్‌సీ)
» భారతదేశ తొలి ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహం - భాస్కర - 1
» భారతదేశ తొలి జియో స్టేషనరీ ఉపగ్రహం - ఆపిల్
» అమెరికా తొలి రోదసి నౌక - ఎక్స్‌ప్లోరర్
» మనదేశంలో తొలి ఎఫ్.ఎం. స్టేషన్ ప్రారంభమైన నగరం - చెన్నై (1977)
» ప్రైవేటు రంగంలో తొలి ఎఫ్.ఎం. ప్రారంభమైన నగరం - బెంగళూరు (2001)

Back