Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: వివిధ ప్లాస్టిక్‌ల ఉపయోగాలు :::
 
పాస్టిక్ పేరు ఉపయోగం
అల్పసాంద్రత గల పాలిథీన్ పాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ సంచులు, వర్షపు కోట్లు
అత్యధిక సాంద్రత గల పాలిథీన్ బొమ్మలు, విద్యుత్ బంధకాలు, పాత్రలు
పి.వి.సి (పాలీ వినైల్ క్లోరైడ్) చేతి సంచులు, గ్రామ్‌ఫోన్ రికార్డులు, విద్యుత్ బంధకాలు
ఓర్లాన్ నీరు అంటని కార్పెట్‌లు, వస్త్రాలు, దుప్పట్ల తయారీ
యూరియా ఫార్మాల్డిహైడ్ బాటిల్ మూతలు, విద్యుత్ నిరోధకాలు, ఫ్త్లెవుడ్ అతికించడానికి, గుండీలు, అలంకరణ బొమ్మలు
మెలమైన్ ఫార్మాల్డిహైడ్ పగలని వంటింటి టేబుల్ వస్తువుల తయారీకి
టెఫ్లాన్ రసాయన పంపు భాగాలు, గాస్కెట్‌లు, అంటకుపోని వంట పాత్రలపై పూతకు
పాలిప్రొపిలీన్ విద్యుత్ పరికరాలు, విద్యుత్ బంధకాలు, మెడికల్ పరికరాలు, బొమ్మలు, పైపులు
నైలాన్ 6, 6 బ్రష్‌లు, తివాచీలు, దారాల తయారీకి
పాలిస్త్టెరీన్ విద్యుత్ బంధకాలు, దువ్వెనలు, టి.వి, ఫ్రిజ్‌ల లైనింగ్
టెరిలీన్ మాగ్నటిక్ టేపులు, ముడుతలు పడని వస్త్రాల తయారీకి
బెకలైట్ పెన్నులు, దువ్వెనలు, రేడియో, టి.వి. కేబినెట్, విద్యుత్ స్విచ్‌ల తయారీకి
ప్లాస్టిక్‌ల తయారీ విధానాలు
పాలీవినైల్ క్లోరైడ్
వినైల్ క్లోరైడ్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలివినైల్ క్లోరైడ్ ఏర్పడుతుంది.
పాలిథీన్
» ఇథిలీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలీ ఇథిలీన్ ఏర్పడును.
» దీని వ్యాపార నామం పాలిథీన్
బెకలైట్
ఫినాల్‌ను ఫార్మాల్డిహైడ్‌తో ఆమ్లం లేదా క్షారం సమక్షంతో పాలిమరీకరణం జరిపినప్పుడు ఫినాల్ ఫార్మాల్డిహైడ్ రెజీన్ ఏర్పడుతుంది. దీన్నే బెకలైట్ అంటారు.
పాలిస్త్టెరీన్
స్త్టెరీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలీస్త్టెరీన్ ఏర్పడుతుంది.
యూరియా ఫార్మాల్డిహైడ్
యూరియా, ఫార్మాల్డిహైడ్‌లను క్షారం సమక్షంలో పాలిమరీకరణం జరిపినప్పుడు యూరియా ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది.
నైలాన్ 6, 6
ఎడిపిక్ ఆమ్లాన్ని హెక్సామిథిలీన్ డై ఎమైన్‌తో పాలిమరీకరణం జరిపినప్పుడు నైలాన్ 6, 6 ఏర్పడుతుంది.
టెఫ్లాన్
టెట్రాఫ్లోరో ఇథిలీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలి టెట్రా ప్లోరో ఇథిలీన్ ఏర్పడుతుంది. దీన్నే టెఫ్లాన్ అంటారు.
టెరిలీన్
డైమిథైల్ టెర్‌థాలేట్‌ను ఇథిలీన్ గ్త్లెకాల్‌తో పాలిమరీకరణం జరిపినప్పుడు టెరిలీన్ ఏర్పడుతుంది.
మెలమైన్ ఫార్మాల్డిహైడ్
మెలమైన్‌ను ఫార్మాల్డిహైడ్‌తో పాలిమరీకరణం జరిపినప్పుడు మెలమైన్ ఫార్మాల్డిహైడ్ ఏర్పడుతుంది.
పాలిప్రొపిలీన్
ప్రొపిలీన్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు పాలిప్రొపిలీన్ ఏర్పడుతుంది.
ఓర్లాన్
వినైల్ సయనైడ్‌ను పాలిమరీకరణం జరిపినప్పుడు ఓర్లాన్ ఏర్పడుతుంది.

Back