Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీచేసే రిట్లు :::
 
» హెబియస్ కార్పస్: ఈ రిట్ ప్రకారం నిర్బంధించిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి.  
» మాండమస్: 'మేము ఆజ్ఞాపిస్తున్నాం' అని దీని అర్థం. ఏ అధికారి అయినా ప్రజాసంబంధ, చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు వాటిని నిర్వర్తించమని కోర్టులు జారీ చేసే రిట్.
సుప్రీంకోర్టు
» ప్రొహిబిషన్: దిగువ కోర్టు తన అధికార పరిధిలో లేని విషయాన్ని గురించి విచారిస్తున్నప్పుడు దాన్ని నిలిపివేయమని ఈ రిట్‌ను జారీ చేస్తారు.
» సెర్షియోరరి: కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిలో ఉండేలా చూడటం ఈ రిట్ ఉద్దేశం. కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేయడానికి ఈ రిట్‌ను జారీ చేస్తారు.
» కోవారంటో: 'ఏ అధికారంతో' అని దీని అర్థం. ఏ అధికారంతో పదవిలో కొనసాగుతున్నారో ఆధారాలు చూపమని కోర్టులు జారీ చేసే రిట్.
* రిట్ అంటే 'ఆజ్ఞ' అని అర్థం.

Back