Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
::: శాసనసభ, శాసనమండలి :::
 
శాసనసభ
» శాసనసభను విధాన సభ అని కూడా అంటారు.
» శాసనసభలో ప్రజలు ఎన్నుకున్నవారు సభ్యులుగా ఉంటారు.
» ఆయా రాష్ట్రాల జనాభాను బట్టి సభలో సభ్యులు సంఖ్య ఉంటుంది.
» శాసనసభకు పోటీచేయడానికి కావాల్సిన కనీస వయసు 25 సంవత్సరాలు.
» శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు.
» స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు.
» స్పీకరు లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
» స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ప్యానెల్ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు.
» శాసనసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలు దిల్లీ, పాండిచ్చేరి.
» విధానసభలో గరిష్ఠ సభ్యుల సంఖ్య 500కు మించకూడదు.
» కనిష్ఠ సభ్యుల సంఖ్య 60కు మించకూడదు.
» గోవా (40), సిక్కిం (32), మిజోరాం (40) రాష్ట్రాల్లో 60 కంటే తక్కువ సభ్యులున్నారు.
» ఆర్థిక బిల్లు విషయంలో శాసనసభదే అంతిమ నిర్ణయం.
శాసనమండలి
» శాసనమండలిని విధాన పరిషత్ అని కూడా అంటారు.
» మండలిలో సభ్యుల సంఖ్య శాసనసభ సభ్యుల సంఖ్యలో మూడింట ఒకవంతు కంటే ఎక్కువ ఉండకూడదు. కనీసం 40 మంది సభ్యులుండాలి.
        (i) మొత్తం సభ్యుల్లో 5/6వ వంతు పరోక్షంగా ఎన్నికవుతారు.
       (ii) 1/3వ వంతును రాష్ట్ర శాసనసభ్యులు ఎన్నుకుంటారు.
       (iii) 1/3వ వంతును స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు.
       (iv) 1/12వ వంతును పట్టభద్రులు ఎన్నుకుంటారు.
       (v) 1/12వ వంతును ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు.
       (vi) 1/6వ వంతును గవర్నర్ నామినేట్ చేస్తారు.
» విధానపరిషత్‌లో సభ్యుడిగా ఎన్నికవడానికి ఉండాల్సిన కనీస వయసు 30 సంవత్సరాలు.
» ఇది శాశ్వత సభ.
» ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మూడింట ఒకవంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు.
» సభ్యుల కాలపరిమితి 6 సంవత్సరాలు.
» ప్రస్తుతం శాసనమండలి ఉన్న రాష్ట్రాలు 7. అవి (1) ఉత్తరప్రదేశ్ (2) ఆంధ్రప్రదేశ్ (3) తెలంగాణ (4) కర్ణాటక (5) మహారాష్ట్ర
(6) బిహార్ (7) జమ్మూకశ్మీర్

Back