TREIRB

తెలంగాణ గురుకులాల్లో 2932 టీజీటీ, పీజీటీ పోస్టులు

తెలంగాణలోని వివిధ గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల విద్యాలయాల నియామక మండలి (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) ప్రకటనలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో కలిపి దాదాపు 5,300 పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువరించాలని బోర్డు తొలుత భావించింది. అయితే వీటిలో తొలివిడతలో టీజీటీ, పీజీటీ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తోంది. డిగ్రీ లెక్చరర్లు, ప్రిన్సిపల్ తదితర పోస్టులకు తర్వాత ప్రత్యేక ప్రకటనలు జారీ చేయనుంది. ఇటీవల గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీకి అప్పగించిన ప్రభుత్వం.... నియామక ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు ఈ దఫా ఆయా సొసైటీల ఉమ్మడి నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనుంది.