Latest News

2,932 పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ

* గురుకుల సొసైటీల్లో కొలువుల సందడి
* జులై 9 నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాలయాల నియామక మండలి (టీఆర్ఈఐ-ఆర్‌బీ) ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకుల సొసైటీల్లో కలిపి మొత్తం 2,932 పోస్టులతో రెండు నియామక ప్రకటనలు జారీ చేసింది. వీటిలో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు 960, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు 1,972 ఉన్నాయి. ఈ నియామక ప్రకటనలు, ఆన్‌లైన్ దరఖాస్తులను వెబ్‌సైట్లో పొందుపరిచింది. జులై 9 నుంచి ఆగస్టు 8 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు గురుకుల బోర్డు ఛైర్మన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో కలిపి దాదాపు 5,300 పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువరించాలని బోర్డు తొలుత భావించింది. అయితే వీటిలో తొలివిడతలో టీజీటీ, పీజీటీ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తోంది. డిగ్రీ లెక్చరర్లు, ప్రిన్సిపల్ తదితర పోస్టులకు తరువాత ప్రత్యేక ప్రకటనలు జారీ చేయనుంది. బీసీ, ఎస్సీ, సాధారణ గురుకులాల్లో పోస్టులపై ఇంకా ఆర్థికశాఖ అనుమతులు రావాల్సి ఉంది.
Website: https://treirb.telangana.gov.in/

Posted on 01-07-2018