TREIRB Notification

తెలంగాణ గురుకులాల్లో 281 జేఎల్ పోస్టులు

తెలంగాణ‌లోని వివిధ గురుకుల విద్యాల‌య సంస్థ‌ల్లో జూనియ‌ర్ లెక్చ‌రర్ (జేఎల్) పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్ఈఐఆర్‌బీ) ప్ర‌క‌ట‌నను విడుద‌ల చేసింది. పీజీ, బీఎడ్ ఉన్న‌వారు వీటికి పోటీ ప‌డ‌వ‌చ్చు. ప‌రీక్ష‌లో చూపిన ప్ర‌తిభ ద్వారా నియామ‌కాలు చేప‌డ‌తారు.
వివ‌రాలు...
జూనియ‌ర్ లెక్చ‌రర్లు
మొత్తం పోస్టుల సంఖ్య‌: 281
సొసైటీల వారీగా ఖాళీలు:
1) తెలంగాణ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ - 40
2) తెలంగాణ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ- 03
3) తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ - 149
4) తెలంగాణ మైనార్టీస్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ - 89
స‌బ్జెక్టులు: తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, మ్యాథ‌మేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోట‌నీ, జువాల‌జీ, ఎక‌నామిక్స్, కామ‌ర్స్, సివిక్స్, హిస్ట‌రీ
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో క‌నీసం 50 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45) శాతం మార్కుల‌తో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తోపాటు బ్యాచిల‌ర్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ (బీఎడ్) లేదా బీఏ, బీఎడ్/ బీఎస్సీ, బీఎడ్ ఉండాలి.
వ‌య‌సు: జులై 1, 2018 నాటికి 18 - 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు అయిదేళ్లు; దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.
ఎంపిక‌: రాత ప‌రీక్ష‌, డెమాన్‌స్ట్రేష‌న్ ఆధారంగా.
రాత ప‌రీక్ష విధానం: రాత ప‌రీక్షలో మూడు పేప‌ర్లు ఉండ‌నున్నాయి. లాంగ్వేజీలు మిన‌హా మిగ‌తా స‌బ్జెక్టుల‌కు మూడు పేప‌ర్లూ ఇంగ్లిష్ మీడియంలో ఇవ్వ‌నున్నారు. అన్ని స‌బ్జెక్టుల వారికి పేప‌ర్-1,2 కామ‌న్ గా ఉంటాయి. రుణాత్మ‌క మార్కులు ఉన్నాయి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికీ ఆ ప్ర‌శ్న‌కు కేటాయించిన మార్కులో నాలుగో వంతు చొప్పున త‌గ్గిస్తారు. ప్ర‌శ్న‌ల‌న్నీ ఆబ్జెక్టివ్ త‌ర‌హాలో ఉంటాయి. మూడు పేప‌ర్ల‌లోనూ చూపిన ప్ర‌తిభ ఆధారంగా అభ్య‌ర్థుల‌కు 1:2 నిష్ప‌త్తిలో ధృవ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌కు ఆహ్వానిస్తారు.
పేప‌ర్ - 1: ఇందులో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌, జ‌న‌ర‌ల్ ఎబిలిటీస్‌, ఇంగ్లిష్ బేసిక్ ప్రొఫిషియ‌న్షీ నుంచి వంద‌ ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. వీటికి వంద మార్కులు కేటాయించారు. ప‌రీక్ష వ్య‌వ‌ధి రెండు గంట‌లు.
పేప‌ర్‌-2: పెడ‌గాగీ అంశాల‌పై వంద‌ ప్ర‌శ్న‌లు ఉంటాయి. వీటికి వంద మార్కులు. ప‌రీక్ష వ్య‌వ‌ధి రెండు గంట‌లు.
పేప‌ర్‌-3: అభ్య‌ర్థి ఎంచుకున్న స‌బ్జెక్టులో ఉంటుంది. ప్ర‌శ్న‌లు ఆ స‌బ్జెక్టు నుంచి పీజీ స్థాయిలో అడుగుతారు. వంద ప్ర‌శ్న‌ల‌కు వంద మార్కులు. రెండు గంట‌ల వ్య‌వ‌ధి ఉంటుంది.
డిమానిస్ట్రేష‌న్ కి 25 మార్కులు కేటాయించారు. అంటే మొత్తం 325 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ద‌ర‌ఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు, ఎగ్జామినేష‌న్ ఫీజు క‌లిపి రూ.1,200 చెల్లించాలి. అయితే తెలంగాణ‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ.600 చెల్లిస్తే స‌రిపోతుంది.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు: ఆగ‌స్టు 9 నుంచి సెప్టెంబ‌రు 8 వ‌ర‌కు స్వీక‌రిస్తారు.
ప్ర‌వేశ ప‌త్రాలు: ప‌రీక్ష‌కు వారం రోజుల ముందు నుంచి డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు.
ప‌రీక్ష తేదీ: త‌ర్వాత ప్ర‌క‌టిస్తారు.

Notification Syllabus Apply Online
Posted on 31-07-2018