TREIRB Notification

తెలంగాణ గురుకుల విద్యాల‌యాల్లో 465 డీఎల్ పోస్టులు (చివ‌రితేది: 13.09.18)

రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాల‌య సంస్థ‌ల్లో డిగ్రీ లెక్చ‌రర్ (డీఎల్) పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఆర్ఈఐఆర్‌బీ) ప్ర‌క‌ట‌నను విడుద‌ల చేసింది.
వివ‌రాలు...
* డిగ్రీ కాలేజ్ లెక్చ‌రర్లు
మొత్తం పోస్టుల సంఖ్య‌: 465
సొసైటీల వారీగా ఖాళీలు:
1) తెలంగాణ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ - 227
2) తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ - 238

స‌బ్జెక్టులు: ఇంగ్లిష్‌, తెలుగు, మ్యాథ‌మేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, కంప్యూట‌ర్ సైన్స్, బోట‌నీ, జువాల‌జీ, మైక్రో - బ‌యాల‌జీ, ఎల‌క్ట్రానిక్స్, హిస్ట‌రీ, ఎక‌నామిక్స్, పొలిటిక‌ల్ సైన్స్, కామ‌ర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్.
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో క‌నీసం 55 శాతం మార్కుల‌తో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌తోపాటు నెట్/ స్లెట్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 01.07.2018 నాటికి 18 - 44 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: రాత ప‌రీక్ష‌, డెమాన్‌స్ట్రేష‌న్ ఆధారంగా.
రాత ప‌రీక్ష విధానం: రాత ప‌రీక్షలో పేప‌ర్-1, 2 ఉండ‌నున్నాయి. రుణాత్మ‌క మార్కులు ఉన్నాయి. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికీ ఆ ప్ర‌శ్న‌కు కేటాయించిన మార్కులో నాలుగో వంతు చొప్పున త‌గ్గిస్తారు. ప్ర‌శ్న‌ల‌న్నీ ఆబ్జెక్టివ్ త‌ర‌హాలో ఉంటాయి..
పేప‌ర్ - 1: ఇందులో జ‌న‌ర‌ల్ స్ట‌డీస్‌, జ‌న‌ర‌ల్ ఎబిలిటీస్‌, ఇంగ్లిష్ బేసిక్ ప్రొఫిషియ‌న్షీ నుంచి వంద‌ ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. వీటికి వంద మార్కులు కేటాయించారు. ప‌రీక్ష వ్య‌వ‌ధి రెండు గంట‌లు.
పేప‌ర్-2: అభ్య‌ర్థి పీజీలో చదివిన స‌బ్జెక్టు మీద ఉంటుంది. ప్ర‌శ్న‌లు ఆ స‌బ్జెక్టు నుంచి పీజీ స్థాయిలో అడుగుతారు. వంద ప్ర‌శ్న‌ల‌కు వంద మార్కులు. రెండు గంట‌ల వ్య‌వ‌ధి ఉంటుంది.
డిమానిస్ట్రేష‌న్ కి 25 మార్కులు కేటాయించారు. అంటే మొత్తం 225 మార్కుల‌కు ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: అప్లికేష‌న్ ప్రాసెసింగ్ ఫీజు, ఎగ్జామినేష‌న్ ఫీజు క‌లిపి రూ.1,200 చెల్లించాలి. అయితే తెలంగాణ‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అభ్య‌ర్థులు కేవ‌లం రూ.600 మాత్ర‌మే చెల్లించాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేది: 14.08.2018
చివరితేది: 13.09.2018


Notification Syllabus Website
Posted on 02-08-2018