IBPS Regional Rural Banks (RRBs)

2018   Calendar

ఐబీపీఎస్-2018 క్యాలెండ‌ర్
దేశంలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(ఆర్ఆర్‌బీ), ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకు(పీఎస్‌బీ)లకు కామ‌న్ రాత ప‌రీక్షల క్యాలెండ‌ర్-2018ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌) ఇటీవ‌ల‌ విడుద‌ల చేసింది. దీనిలో క్లర్కులు, ఆఫీస‌ర్సు, ఆఫీస్ అసిస్టెంట్ల ఎంపిక‌కు సంబంధించి ప్రిలిమినరీ, మెయిన్ ప‌రీక్షల తేదీల‌ను ప్రకటించింది. వాటి వివ‌రాలు..
1. రీజ‌న‌ల్ రూర‌ల్ బ్యాంకులు-ఆర్ఆర్‌బీ(ఆఫీస‌ర్స్‌, ఆఫీస్ అసిస్టెంట్లు)
ప్రిలిమ‌న‌రీ ఎగ్జామినేష‌న్
ఆఫీసర్ స్కేల్‌-1, ఆఫీస్ అసిస్టెంట్స్‌: 11.08.2018, 12.08.2018, 18.08.2018, 19.08.2018, 25.08.2018, 01.09.2018
సింగిల్ ఎగ్జామినేష‌న్
ఆఫీస‌ర్ స్కేల్‌-2&3: 30.09.2018
మెయిన్ ఎగ్జామినేష‌న్‌
ఆఫీస‌ర్ స్కేల్‌-1 : 30.09.2018
ఆఫీస్ అసిస్టెంట్స్‌: 07.10.2018
ఇందులో ఆఫీస‌ర్ స్కేల్-1, ఆఫీస్ అసిస్టెంట్ప్ పోస్టుల‌కు ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామినేష‌న్స్ రెండు ప‌రీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఆఫీస‌ర్ స్కేల్‌-2& 3 పోస్టుల‌కు ఒకే ఒక ప‌రీక్షను నిర్వహిస్తున్నారు.
2. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు- పీఎస్‌బీ(పీవో, క్లర్కులు, స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్‌ )
ప్రిలిమినరీ ఎగ్జామినేష‌న
ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్: 13.10.2018, 14.10.2018, 20.10.2018, 21.10.2018
క్లర్కులు: 08.12.2018, 09.12.2018, 15.12.2018, 16.12.2018
స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్‌: 29.12.2018, 30.12.2018
మెయిన్ ఎగ్జామినేషన్
ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్ : 18.11.2018
క్లర్కులు : 20.01.2019
స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్‌ : 27.01.2019
* రిజిస్ట్రేష‌న్ విధానం:
1) ఆస‌క్తి , అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే రిజిస్ట్ర్రేష‌న్ చేసుకోవాలి. ప్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామినేష‌న్ రెండింటికీ ఒకేసారి రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌చ్చు.
2) అభ్యర్థులు త‌మ పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, సంత‌కం, బొట‌న‌వేలి ముద్ర, నోటిఫికేష‌న్‌లో తెలిపిన‌ ప‌ద్ధతిలో చేతితో రాసిన డిక్లరేష‌న్‌ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
3) నోటిఫికేష‌న్ల పూర్తి వివ‌రాల‌కు అభ్యర్థులు తర‌చుగా www.ibps.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించాలి.
4) ప‌రిపాల‌నా కార‌ణాలు, కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ స‌ల‌హా ప్రకారం నిబంధ‌న‌ల‌ను మార్చుకునే హ‌క్కు ఐబీపీఎస్‌కు ఉంది.