స్టేజ్ -1: రిజిస్ట్రేషన్
మొదట అభ్యర్థులు హెల్ప్ లైన్ సెంటర్లో తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పేరు నమోదు చేయించుకోవాలి. దీనికోసం అధికారుల ప్రకటన అనంతరం ర్యాంక్ కార్డులను అందజేయాలి. ర్యాంక్ పిలిచిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిసిప్ట్ తీసుకోవాలి.

కంప్యూటర్ నుంచి రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్‌ను పొంది దానిపై మొబైల్ నెంబర్ కరెక్ట్‌గా ఉందో లేదో చెక్‌చేసుకోవాలి. హాల్‌టికెట్ నెంబర్, ర్యాంక్, సంతకం తదితర వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాఇల. తర్వాత కౌంటర్లో ఇచ్చిన స్క్రాచ్ కార్డ్‌ను జాగ్రత్త చేసుకోవాలి. ఆప్షన్ ఎంట్రీకి ఈ కార్డే కీలకం. రిజిస్ట్రేషన్ కౌంటర్ పని పూర్తయ్యిందని అధికారి ప్రకటించిన తర్వాత సర్టిఫికెట్ల తనిఖీ నిమిత్తం సంబంధిత కౌంటర్‌కు వెళ్లాలి.

స్టేజ్ -2: సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ఈ దశలో రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్‌లో పేర్కొన్న పేరు, అర్హతలు, స్థానిక ప్రాంతం, కేటగిరీ తదితర వివరాలను పరిశీలిస్తారు. ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని వెరిఫికేషన్ అధికారి దృష్టికి తీసుకువెళ్లి సరిచేయించాలి.

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ కేటగిరీలకు చెందిన వారైతే కుల ధ్రువీకరణ పత్రాన్ని కూడా అధికారికి చూపించాల్సి ఉంటుంది. ఓపెన్ కేటగిరీ (ఓసీ)కి చెందిన వారు నేరుగా తమ సర్టిఫికెట్లను అధికారికి చూపించవచ్చు. అన్ని వివరాలను సక్రమంగా ఉన్నాయని అధికారి తెలుసుకున్న తర్వాత రిసీట్ ఇస్తారు.

స్టేజ్ -3: ఆప్షన్ల ఎంపికలో విద్యార్థులకు సూచనలు
ఈ దశలో చేరదలుచుకున్న కాలేజీలను, కోర్సులను వాటి ప్రాధాన్యాల వారీగా ఎంపికచేసుకోవాలి. కాలేజీల జాబితా, కోర్సులు, వాటి కోడ్‌లు, ఆప్షన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆప్షన్ల ఎంపికలో సంబంధిత అధికారి ఇచ్చే సూచనలను జాగ్రత్తగా గమనించాలి.

స్టేజ్ -4: కౌన్సెలింగ్‌కు వెళ్లబోయే ముందే...
కౌన్సెలింగ్‌కు వెళ్లబోయే ముందే ఆప్షన్ల ఎంపిక గురించి అభ్యర్థులు ఇంటివద్ద ప్రాక్టీస్ చేయడం అవసరం. దీనికోసం కాలేజీల వివరాలు, లభిస్తున్న కోర్సులు, ఉద్యోగ పరంగా కాలేజీలు కల్పిస్తున్న అవకాశాల గురించి తెలుసుకోవాలి.

పూర్తి సమాచారాన్ని తెలుసుకుని ఆప్షన్ల ఎంపిక ప్రాక్టీస్ చేయడం ద్వారా కౌన్సెలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

స్టేజ్ 5: ఆప్షన్ల ఎంపికలో పాటించాల్సిన విధానం
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన అభ్యర్థులు హెల్ప్‌లైన్ సెంటర్ లేదా ఇంటర్‌నెట్ సెంటర్ ద్వారా ఆప్షన్ల ఎంపిక కోసం ప్రయత్నించాలి.
ఆప్షన్ల ఎంపిక కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు....

1) బ్రౌజర్‌లో యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి. ఈ దశలో ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ (బ్రౌజర్)పై డబుల్ క్లిక్ చేయాలి. బ్రౌజర్‌లో సంబంధిత యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి. తర్వాత హోమ్ పేజీ వస్తుంది. ఇందులో కౌన్సెలింగ్ ప్రక్రియ, కోర్సుల వివరాలు, సెంటర్లు, కాలేజీల వివరాలు ఉంటాయి.


2) పాస్‌వర్డ్ జనరేట్ చేయాలి. హోంపేజీలోని క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి అడిగిన వివరాలను నమోదు చేయాలి. తర్వాత జనరేట్ పాస్‌వర్డ్ బటన్‌పై క్లిక్ చేయగానే అభ్యర్థి వివరాలతో కూడిన స్క్రీన్ వస్తుంది. దీని కింది భాగంలో ఇచ్చిన పాస్‌వర్డ్ బాక్స్‌లో జనరేట్ చేసిన పాస్‌వర్డ్‌ను ఎంటర్‌చేయాలి. రీ ఎంటర్ పాస్‌వర్డ్ బాక్స్‌లో కూడా అదే పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. అభ్యర్థి మొబైల్‌నెంబర్, తమ ఈ మెయిల్ ఐడీ నమోదు చేయాలి. తర్వాత సేవ్ పాస్‌వర్డ్‌పై క్లిక్ చేసి పాస్‌వర్డ్‌ను సేవ్ చేసుకోవాలి. అభ్యర్థి తన పాస్‌వర్డ్‌ను రహస్యంగా ఉంచుకోవాలి.


3) ఆప్షన్ ఎంట్రీ ఇవ్వాలి. ఈ దశలో నేరుగా ఆప్షన్ల ఎంపిక ప్రారంభించడం మంచిది కాదు. దీన్లో పొరపాట్లు రాకుండా ఉండేందుకు ముందుగా ప్రాక్టీస్ చేసి ఉండటం మంచిది. క్యాండిడేట్స్ లాగిన్‌పై క్లిక్ చేసి ఆప్షన్ల ఎంపిక ప్రారంభించవచ్చు. ఇక్కడ వీరికి స్క్రీన్ వస్తుంది. దీన్లో ఎక్కడ లాగ్ఇన్ కావాలి వంటి వివరాలన్నీ ఉంటాయి.

ఆప్షన్ ఎంట్రీ స్క్రీన్ ద్వారా ఎంటర్ అయిన తర్వాత లాగ్ఇన్ఐడీ నెం., హాల్ టికెట్ నెంబరు, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను పేర్కొనాలి. సైన్ ఇన్‌పై క్లిక్ చేయగానే స్క్రీన్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ ఎంట్రీ సూచనలు ఉంటాయి. డిక్లరేషన్ చదువుకుని చెక్ బాక్స్‌పై క్లిక్ చేయాలి.
ఆప్షన్ ఎంట్రీ ఫామ్‌పై క్లిక్ చేస్తే ఆప్షన్ల ఎంపిక కోసం తగిన సమాచారం కనిపిస్తుంది. నిర్దేశిత బాక్సులో ఐసెట్ హాల్ టికెట్ నెంబరు పేర్కొనాలి. ఆప్షన్ ఫామ్ పూర్తి చేసి క్లిక్ ఆన్ సేవ్ ఆప్షన్స్‌పై క్లిక్ చేయాలి.

తర్వాత వ్యూ అండ్ ప్రింట్ బటన్‌పై క్లిక్ చేస్తే ఇప్పటిదాకా చేసిన ఆప్షన్లు సేవ్ అయ్యాయో లేదో తెలుస్తుంది. వీటిని ప్రింట్ కాపీగా తీసుకోవచ్చు.


4) లాగ్ అవుట్ కావాలి. ఆప్షన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత లాగ్ అవుట్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ సేవ్ అండ్ లాగ్ అవుట్, కన్‌ఫర్మ్ లాగ్అవుట్, క్యాన్సిల్ లాగ్అవుట్ పేరుతో మూడు బటన్‌లు (అలర్ట్ మెసేజ్‌లు) వస్తాయి. సేవ్ అండ్ లాగ్ అవుట్ బటన్‌పై క్లిక్ చేస్తే మొత్తం ప్రక్రియ పూర్తయినట్లే.

కాలేజీ లేదా కోర్సు నచ్చకపోతే..
* సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత ఐసెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా అలాట్‌మెంట్‌ వివరాలను తెలుసుకోవచ్చు. మీకు లభించిన కాలేజీ, కోర్సుతో తృప్తి చెందితే వాటిలో చేరవచ్చు. ముందుగా అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఫీజు (వర్తిస్తే) చెల్లించి చలానాను, అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను నిర్ణీత గడువులోగా కాలేజీలో సమర్పించాలి.

* దీంతో మీరు ఆ కాలేజీలో చేరినట్లు పరిగణిస్తారు. గడువు తేదీలోగా ఇవి కాలేజీలో సమర్పించకపోతే మీ సీటు రద్దవుతుంది.
* ఒకవేళ కేటాయించిన సీటు మీకు నచ్చకపోతే, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ కాలేజీకి వెళ్లవద్దు. రెండో దశ కౌన్సెలింగ్‌ ఉంటే అందులో పాల్గొనవచ్చు. అప్పటివరకు అసలు కౌన్సెలింగ్‌లో పాల్గొననివారు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌లో పాల్గొని సీటు అలాట్‌ కానివారు కూడా మలిదశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఒకవేళ మొదటి దశలో అలాట్‌ అయిన కాలేజీలో రిపోర్టు చేసినప్పటికీ మలిదశ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి అభ్యర్థులు రెండో దశలో వేరే కాలేజీలో సీటు వస్తే అందులోనే చేరాల్సి ఉంటుంది. చేరిన తర్వాత అవసరం అనుకుంటే సీటు రద్దు చేసుకోవచ్చు. నిర్ణీత గడువులోగా దీన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. వీలైనంతవరకు మలిదశ కౌన్సెలింగ్‌ కోసం వేచిచూడకపోవడమే మంచిది. చాలావరకు సీట్లు తొలిదశలోనే భర్తీఅవుతాయి. అందువల్ల కోరుకున్న కాలేజీ, కోర్సులో సీటు వస్తే వదులుకోవద్దు!

 

<<..Back