నోటిఫికేషన్

ఇండియ‌న్ బ్యాంకులో 324 పీవో ఉద్యోగాలు

* ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా నియామ‌కాలు
* ఎంపికైన‌వారికి ఏడాది పీజీడీబీఏ కోర్సు
* అనంత‌రం పీవో కొలువు
ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియ‌న్ బ్యాంకు 324 పీవో పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ, మెయిన్ ప‌రీక్షలు, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. అన్ని ద‌శ‌ల‌నూ విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్నవాళ్లు మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో ఏడాది వ్యవ‌ధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు చ‌ద‌వాల్సి ఉంటుంది. అనంత‌రం ఇండియ‌న్ బ్యాంకులో పీవో కొలువు సొంత‌మ‌వుతుంది. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

మొత్తం ఖాళీలు: 324. వీటిలో ఎస్సీ-48 , ఎస్టీ-24, ఓబీసీ-87, జ‌న‌ర‌ల్‌-165 ఖాళీలు ఉన్నాయి.
అర్హత‌: జులై 1, 2017 నాటికి 60 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు.
వ‌యోప‌రిమితి: జులై 1, 2016 నాటికి క‌నిష్ఠం 20, గ‌రిష్ఠంగా 28 ఏళ్లు. అంటే జులై 2, 1988 కంటే ముందు; జులై 1, 1996 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష:
వంద మార్కుల‌కు ఈ ప‌రీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు అడుగుతారు. ప‌రీక్ష వ్యవ‌ధి ఒక గంట‌. ప‌రీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ నుంచి 30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ 35, రీజ‌నింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. త‌ప్పుగా గుర్తించిన‌స‌మాధానాల‌కు రుణాత్మక మార్కులు ఉన్నాయి.

ఈ పరీక్షలో అర్హత సాధించ‌డానికి అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లోనూ నిర్ణీత క‌టాఫ్ మార్కుల‌ను పొంద‌డం త‌ప్పనిస‌రి. ఈ క‌టాఫ్ మార్కుల‌ను ఇండియ‌న్ బ్యాంకు నిర్ణయిస్తుంది. అన్ని సెక్షన్ల మార్కులూ క‌లుపుతారు. నిర్ణీత క‌టాఫ్ సాధించిన వారిని మెయిన్స్‌కు ఎంపిక‌చేస్తారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్షలో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు..

మెయిన్ ఎగ్జామ్‌:
ఈ ప‌రీక్షను 200 మార్కుల‌కు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప‌రీక్షలో 200 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రీజ‌నింగ్ -50, ఇంగ్లిష్ లాంగ్వేజ్ -40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ -50, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ -40, కంప్యూట‌ర్ నాలెడ్జ్ -20 ప్రశ్నలు వ‌స్తాయి. ప్రశ్నప‌త్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. త‌ప్పుగా గుర్తించిన‌ స‌మాధానాల‌కు రుణాత్మక మార్కులు ఉన్నాయి.

డిస్క్రిప్టివ్ టెస్టు: ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై 50 మార్కుల‌కు డిస్క్రిప్టివ్ ప‌రీక్షను నిర్వహిస్తారు. రెండు ప్రశ్నలు అడుగుతారు. అవి లెట‌ర్ రైటింగ్‌పై ఒక‌టి, ఏదేని అంశంపై వ్యాసం రాయ‌మ‌ని మ‌రొక‌టి ఉంటాయి. ప‌రీక్ష వ్యవ‌ధి 30 నిమిషాలు. మెయిన్ ప‌రీక్షలో అర్హత‌ సాదించిన‌వారి డిస్క్రిప్టివ్ పేప‌ర్‌ను మూల్యాంక‌నం చేస్తారు.

ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే ప్రతి సెక్షన్‌లోనూ నిర్ణీత క‌టాఫ్ మార్కులు పొంద‌డం త‌ప్పనిస‌రి. ఈ క‌టాఫ్ మార్కుల‌ను ఖాళీల‌కు అనుగుణంగా ఇండియ‌న్ బ్యాంకు నిర్ణయిస్తుంది. క‌టాఫ్ మార్కులు సాధించిన వారినే త‌ర్వాతి ద‌శ ఇంట‌ర్వ్యూకు ఎంపిక‌చేస్తారు.

ఇంట‌ర్వ్యూ
మౌఖిక ప‌రీక్షకు వంద మార్కులు కేటాయించారు. ఇందులో 40 శాతం మార్కులు సాధించడం త‌ప్పనిస‌రి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులైతే క‌నీసం 35 శాతం మార్కులు రావాలి.

తుది నియామ‌కాలు
ప్రిలిమిన‌రీ, మెయిన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ల్లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది నియామ‌కాలు చేప‌డ‌తారు. ప్రిలిమ్స్ + మెయిన్స్ , ఇంట‌ర్వ్యూల్లో సాధించిన‌మార్కుల‌కు 80:20 నిష్పత్తిలో వెయిటేజీ ఉంటుంది. మొత్తం ఖాళీలు, కేట‌గిరీల‌వారీ సీట్లు ఆధారంగా అభ్యర్థులు సాధించిన మార్కుల ప్రకారం నియామ‌కాలు చేప‌డ‌తారు.

ఎంపికైతే...
ఎంపికైన‌వాళ్లు మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో ఏడాది వ్యవ‌ధి ఉండే పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు పూర్తి చేస్తారు. వ‌స‌తి, భోజ‌నం, కోర్సు, ఇత‌ర అన్ని ర‌కాల ఫీజులు క‌లుపుకుని ఎంపికైన‌వాళ్లు రూ.3.5 లక్షలు చెల్లించాలి. ఈ మొత్తానికి త‌క్కువ వ‌డ్డీకి రుణ స‌దుపాయం క‌ల్పిస్తారు. ఉద్యోగంలో చేరిన త‌ర్వాత నెల‌స‌రి వాయిదాల ప‌ద్ధ‌తిలో ఫీజు చెల్లించ‌వ‌చ్చు. ఈ ఏడాది వ్యవ‌ధిలో 9 నెల‌ల త‌ర‌గ‌తి శిక్షణ బెంగ‌ళూరు క్యాంప‌స్‌లో నిర్వహిస్తారు. చివ‌రి మూడు నెల‌లు ఏదైనా ఇండియ‌న్ బ్యాంకు శాఖ‌లో ఇంట‌ర్న్‌షిప్ చేయాలి. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి మ‌ణిపాల్ యూనివ‌ర్సిటీ పీజీడీబీఎఫ్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. వీరిని ఇండియ‌న్ బ్యాంకు జూనియ‌ర్ మేనేజ‌ర్ గ్రేడ్‌-1/ ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (పీవో) హోదాతో విధుల్లోకి తీసుకుంటుంది.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: డిసెంబ‌రు 22, 2016
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.100. మిగిలిన అంద‌రికీ రూ.600.
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీ: జ‌న‌వ‌రి 22, 2017
ప్రిలిమినరీ ఫ‌లితాలు: జ‌న‌వ‌రి 30, 2017
మెయిన్ ప‌రీక్ష తేదీ: ఫిబ్ర‌వ‌రి 28, 2017
ప్రిలిమినరీ హాల్ టికెట్లు: జ‌న‌వ‌రి 11 త‌ర్వాత డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
మెయిన్ హాల్‌టికెట్లు: ఫిబ్ర‌వ‌రి 16 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష కేంద్రాలు: హైద‌రాబాద్‌, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం.

Posted on 06-12-2016