Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆర్మీ 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీంలో 90 ఖాళీలు
 

- ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దివిన‌వాళ్లు అర్హులు
- ఎంపికైతే ఉచితంగా ఇంజినీరింగ్ చ‌దువుతోపాటు లెప్టినెంట్‌గా ఉద్యోగం

భార‌తీయ ఆర్మీ 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీం ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థుల‌ను ఇంట‌ర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మార్కుల ద్వారా షార్ట్‌లిస్టు చేస్తారు. వీరికి అయిదు రోజుల‌పాటు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూలు నిర్వహించి తుది నియామ‌కాలు చేప‌డుతుంది. కోర్సుకి ఎంపికైన‌వారికి ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా చ‌దువుకునే అవ‌కాశం ల‌భిస్తుంది. మొత్తం అయిదేళ్లపాటు శిక్షణ కొన‌సాగుతుంది. ఈ స‌మ‌యంలో బేసిక్ మిలిట‌రీ ట్రైనింగ్‌, సాంకేతిక శిక్షణ (ఇంజినీరింగ్ విద్య) రెండింటిపైనా త‌ర్ఫీదునిస్తారు. అనంత‌రం లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీలో శాశ్వత ఉద్యోగిగా చేర్చుకుంటారు. ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తిచేసిన‌వాళ్లు ఈ పోస్టుల‌కు అర్హులు. 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీంకు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

మొత్తం ఖాళీలు: 90
విద్యార్హత‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌.
వ‌యోప‌రిమితి: 16 1/2 - 19 1/2 ఏళ్ల మ‌ధ్యలో ఉండాలి. అంటే జ‌న‌వ‌రి 1, 1998 కంటే ముందు; జ‌న‌వ‌రి 1, 2001 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు.
ఇత‌ర అర్హత‌లు: ఈ పోస్టుల‌కు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎత్తు క‌నీసం 157.5 సెం.మీ. ఉండాలి (అభ్యర్థుల వ‌య‌సును బ‌ట్టి ఎత్తులో స‌డ‌లింపులు ల‌భిస్తాయి). ఎత్తుకు త‌గ్గ బ‌రువు ఉండాలి.

ఎంపిక ఇలా:
అభ్యర్థుల‌ను ఇంట‌ర్(పీసీఎం) మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇందులో అర్హత‌సాధించిన‌వారికి స‌ర్వీసెస్ సెల‌క్షన్ బోర్డు (ఎస్ఎస్‌బీ)... భోపాల్‌, బెంగ‌ళూరు, అల‌హాబాద్‌ల్లో ఏదోఒక చోట ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తుంది. ఈ ఇంట‌ర్వ్యూలు ఫిబ్రవ‌రి లేదా మార్చిలో నిర్వహించ‌వ‌చ్చు. ఇవి అయిదు రోజుల‌పాటు కొన‌సాగుతాయి. తొలిరోజు స్టేజ్-1 ప‌రీక్షను నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన‌వారికే మిగిలిన 4 రోజుల‌పాటు ఇంట‌ర్వ్యూలు కొన‌సాగుతాయి. సైక‌లాజిక‌ల్ ప‌రీక్షలు, గ్రూప్ ప‌రీక్షలు, ముఖాముఖి, ఫిజిక‌ల్ టెస్టు (ఎత్తు, బరువు), వైద్య ఆరోగ్య ప‌రీక్షలు నిర్వహించి అర్హుల‌ను ఎంపిక‌చేస్తారు.

శిక్షణ‌
ఎంపికైన‌వారికి 2017 జులై నుంచి ఏడాది పాటు అధికారుల శిక్షణ కేంద్రం (ఓటీఏ-గ‌య‌)లో త‌ర్ఫీదునిస్తారు. అనంత‌రం మూడేళ్లపాటు ఫేజ్‌-1 (ప్రి క‌మిష‌న్‌) శిక్షణ కొనసాగుతుంది. దీన్ని సీఎంఈ-పుణే లేదా ఎంసీటీఏ-మ‌హోవ్‌(ఇండోర్ స‌మీపాన‌) లేదా ఎంసీఎంఈ- సికింద్రాబాద్‌లో నిర్వహిస్తారు. శిక్షణ‌ను విజ‌వంతంగా పూర్తిచేసుకుని, ప‌రీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన‌వారికి ఇంజినీరింగ్ డిగ్రీని ప్రదానం చే్స్తారు. శిక్షణ స‌మ‌యంలో ఉచితంగా వ‌స‌తి, భోజ‌న స‌దుపాయాలు క‌ల్పిస్తారు. మూడేళ్ల శిక్షణ అనంత‌రం స్టైపెండ్‌గా నెల‌కు రూ.21 వేలు చొప్పున నాలుగో ఏట ప్రారంభం నుంచి చెల్లిస్తారు. నాలుగేళ్ల శిక్షణ పూర్తికాగానే లెఫ్టినెంట్ హోదా కేటాయించి పూర్తి వేత‌నం చెల్లిస్తారు. ఈ స‌మ‌యంలో అన్ని ర‌కాల ప్రయోజ‌నాలూ క‌లుపుకుని నెల‌కు రూ.65,000 వేత‌న‌రూపంలో పొంద‌వ‌చ్చు. అయిదేళ్ల శిక్షణానంత‌రం శాశ్వత ఉద్యోగిగా చేర్చుకుంటారు.

ద‌ర‌ఖాస్తులు
ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అనంత‌రం రెండు సెట్ల ప్రింట‌వుట్లు తీసుకోవాలి. ఒక సెట్ ప్రింట‌వుట్‌ను రిఫ‌రెన్స్ కోసం ఉంచుకోవాలి. మ‌రో సెట్ ప్రింట‌వుట్‌పై సంత‌కం చేయాలి. ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ మార్కుల స‌ర్టిఫికెట్లు, ఒక ఐడీ ప్రూప్ ఇవ‌న్నీ ఒరిజిన‌ల్స్‌ తీసుకుని ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూకు హాజ‌రుకావాలి. అలాగే ఈ స‌ర్టిఫికెట్ల రెండు ఫొటోకాపీ సెట్లను ఎస్ఎస్‌బీకి ఇవ్వాలి. ఇంట‌ర్వ్యూకు ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, ఐడీ ప్రూఫ్ ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్లను తీసుకెళ్లాలి. వీటిని ప‌రిశీలించి అభ్యర్థుల‌కు తిరిగి ఇచ్చేస్తారు. పాస్పోర్టు ప‌రిమాణంలో ఉన్న 20 ఫొటోలు తీసుకెళ్లడం త‌ప్పనిస‌రి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల ప్రారంభం: న‌వంబ‌రు 8 ఉద‌యం 10 నుంచి
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: డిసెంబ‌రు 7 ఉద‌యం 10 వ‌ర‌కు

వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

posted on 31-10-2016

» Notification