Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

ఇస్రోలో 327 సైంటిస్టు పోస్టులు

ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరతారా?
దేశ చరిత్రలో నిలిచిపోయే అంతరిక్ష కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. ఇస్రో 327 సైంటిస్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్ఛు.


భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఉద్యోగమంటే యువతకు ఎంతో ఆసక్తి. తాజాగా ఈ సంస్థ గ్రూప్‌ - ఎ గెజిటెడ్‌ సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. నిర్దిష్ట బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు మొత్తం 327 ఖాళీలున్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు. ఈ ఉద్యోగం సంపాదించుకొని విధుల్లో చేరినవారికి రూ.56,100 మూలవేతనం లభిస్తుంది!


ఇస్రో నియామక ప్రక్రియలో భాగంగా మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 80 ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు వస్తాయి. అన్ని ప్రశ్నలకూ సమాన మార్కులు. ఇందులో చూపిన ప్రతిభ ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థుల్లోంచి మెరిట్‌ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు.


రాత పరీక్ష కేవలం స్క్రీనింగ్‌ కోసమే. అందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. బ్రాంచీల వారీ (కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌) పాత ప్రశ్న పత్రాలు ఇస్రో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎంపికైనవారిని గ్రూప్‌ - ఎ గెజిటెడ్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. లెవల్‌ -10 ప్రకారం మూల వేతనంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులను చెల్లిస్తారు.


ముఖ్యమైన తేదీలు
పోస్టు పేరు: సైంటిస్ట్‌/ ఇంజినీర్‌
ఏ బ్రాంచీకి ఎన్ని ఖాళీలు?: ఎలక్ట్రానిక్స్‌ 131, మెకానికల్‌ 135, కంప్యూటర్‌ సైన్స్‌ 58, (ఎలక్ట్రానిక్స్‌) అటానమస్‌ బాడీ 3 అర్హత: బీఈ లేదా బీటెక్‌లో సంబంధిత / అనుబంధ బ్రాంచీలో 65 శాతం మార్కులు లేదా 10కి 6.84 సీజీపీఏ ఉండాలి.
వయసు: నవంబరు 4, 2019 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి. దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 4.
పరీక్ష ఫీజు: రూ.100. మహిళలకు ఫీజు లేదు.
పరీక్ష తేదీ: జనవరి 12.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌.

నోటిఫికేష‌న్‌ వెబ్‌సైట్‌

 

Posted on 15.10.2019