జేఈఈ మెయిన్‌కు తుది మెరుగులు విద్యార్థి కెరియర్‌ దిశనూ, దశనూ నిర్ధారించేవి ప్రవేశపరీక్షలు. కానీ అకడమిక్‌ పరీక్షల్లో అత్యధికంగా స్కోరు చేసేవారిలో కూడా కొందరు ప్రవేశపరీక్షల్లో సరైన ర్యాంకులు తెచ్చుకోలేకపోతున్నారు. ఏడాదికి రెండుసార్లు జేఈఈ నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మొదటిసారి మొదటి విడత పరీక్ష జనవరిలో జరగబోతోంది. మొదటి పట్టే గట్టిగా పట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. జేఈఈ మెయిన్స్‌.. ఇంజినీరింగ్‌ ప్రవేశానికి జరిగే దేశవ్యాప్త పరీక్ష! ఐఐటీల్లో ప్రవేశానికి తొలిమెట్టు కూడా ఇదే. ఈ విద్యాసంవత్సరం నుంచి రెండుసార్లు నిర్వహించబోతున్నారు.