close

JEE > TOPPER VOICE

JEE(MAIN) 2014 Toppers

ఐఐటీ ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలని ఉంది

- వాకచర్ల ప్రమోద్‌, 355 మార్కులు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మధ్యతరగతి కుటుంబం మాది. నాన్న వాకచర్ల భగవాన్‌ బాపూజీ వీధిలో చంద్రా ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తున్నారు. అమ్మ జయశ్రీ గృహిణి. పదో తరగతి గుడివాడలోని కె.కె.ఆర్‌ గౌతమ్‌కాన్సెప్ట్‌ స్కూల్‌లో చదివి 98 శాతం మార్కులు సాధించా. ఇంటర్‌లో ఎంపీసీలో చేరి 978 మార్కులు తెచ్చుకున్నా.
ఇప్పుడు జేఈఈ మెయిన్స్‌లో 355 మార్కులు వచ్చాయి. గతంలో గణిత ఒలింపియాడ్‌కు, నేషనల్‌ ఫిజిక్స్‌ ఒలింపియాడ్‌కు కూడా ఎంపికయ్యాను. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే కిషోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహక యోజన (కేవీపీవై) పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు 2013-14 సంవత్సరానికి ఉపకారవేతనం దక్కింది. 'ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ టీచర్స్‌' నిర్వహించిన పరీక్షల్లో టాప్‌ 37లో నిలిచాను. ఐఐటీ ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలన్నది నా కల.

ఐఐటీ ముంబయిలో చేరాలని..

- మహ్మద్‌ అక్రమ్‌ ఖాన్‌, 350 మార్కులు
నాకు ఐఐటీ జేఈఈ మెయిన్స్‌లో 350 మార్కులు వచ్చాయి. ఆదిలాబాద్‌ జిల్లా లక్సెట్టిపేట మా సొంతూరు. మా నాన్న ఎజాజుల్లాఖాన్‌ ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణిలో సివిల్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌ కె.కె.ఆర్‌. గౌతమ్‌ స్కూల్‌లో పదో తరగతి చదివాను. ఇంటర్‌ ఎంపీసీలో 977 మార్కులు సాధించా. ఐఐటీ ముంబయిలో చేరాలని కష్టపడి చదువుతున్నాను.

ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలి

- కృష్ణ చైతన్య, 345 మార్కులు
మాది అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన వ్యవసాయ కుటుంబం. జేఈఈలో 345 మార్కులొచ్చాయి. నారాయణ శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్‌ చదివా. అందులో 979 మార్కులు సాధించా. ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలన్నది ప్రస్తుతం నా లక్ష్యం.
అందుకే ఇప్పుడు దృష్టంతా ఐఐటీ అడ్వాన్స్‌పైనే ఉంది. అందులో టాప్‌ 10 ర్యాంకు సాధిస్తా.

మధ్య తరగతి కుటుంబం నుంచి...

- కె.వీరవెంకట సతీష్‌, 345 మార్కులు
మాది తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులోని మధ్యతరగతి కుటుంబం. నాన్న వెంకటరమణ స్థానికంగా ఒక ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తున్నారు. ఇంటర్‌లో 976 మార్కులు సాధించాను. జేఈఈ పరీక్షలో 345 మార్కులు సాధించడం చాలా సంతోషంగా ఉంది.
ఐఐటీలో సీటు సంపాదించి కంపూట్యర్‌ సైన్స్‌ పూర్తి చేయాలన్నదే నా లక్ష్యం.

సొంతంగా కంపెనీ స్థాపిస్తా

- పూసా నిహాల్‌, 345 మార్కులు
మా నాన్న వసంతకుమార్‌ సింగరేణిలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌. అమ్మ సునీతాదేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. నాకు ఇంటర్‌లో 973 మార్కులు వచ్చాయి. కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలని అనుకుంటున్నాను.
భవిష్యత్తులో ఇదే రంగంలో సొంతంగా ఒక కంపెనీ స్థాపించి పలువురికి ఉపాధి చూపాలన్నది నా లక్ష్యం.

వ్యవసాయ కుటుంబ నేపథ్యం..

- కె.జయచంద్ర, 345 మార్కులు
మాది గుంటూరు జిల్లాలోని నరసరావుపేట. మా నాన్న వెంకటేశ్వరరావు వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ సీతామహాలక్ష్మి గృహిణి. బాగా చదువుకొని మంచి స్థాయిలోకి రావాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. అందుకు తగ్గట్లుగానే పట్టుదలగా చదివాను.
ఇంటర్‌లో 929 మార్కులు వచ్చాయి. ఐఐటీలో చేరి కంపూట్యర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేయాలనుకుంటున్నాను.

ఎలక్ట్రానిక్స్‌లో పరిశోధన చేస్తా

- భావినేని ఈశ్వర్‌, 345 మార్కులు
మాది విజయవాడ. నాన్న శ్రీనివాసరావు వి.ఆర్‌. సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రొఫెసర్‌. అమ్మ మాధవి గృహిణి. మొదటి నుంచి కష్టపడి చదువుతున్నాను. ఇంటర్‌లో 954 మార్కులు వచ్చాయి. అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించడం వల్లే జేఈఈ మెయిన్స్‌లోనూ 345 మార్కులు సాధించాను.
గతంలో రామానుజన్‌ టాలెంట్‌ టెస్టులో అత్యుత్తమ ప్రతిభ సాధించినందుకు బంగారు పతకం లభించింది. భవిష్యత్తులో ఐఐటీలో చేరి ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో పరిశోధన చేయాలన్నది నా ఆలోచన.

సివిల్‌ సర్వీస్‌ నా లక్ష్యం

- వినోద్‌రెడ్డి, 345 మార్కులు
సివిల్‌ సర్వీస్‌కు ఎంపికవ్వడం నా లక్ష్యం. జేఈఈలో మంచి మార్కులు వచ్చాయి. వరంగల్‌ ఎస్‌ఆర్‌ కళాశాలలో అధ్యాపకుల ప్రోత్సాహంతో ఈ మార్కులు సాధించా. దేశంలోని ఉత్తమ ఐఐటీలో చేరి బీటెక్‌ పూర్తి చేస్తా.
తర్వాత సివిల్‌ సర్వీస్‌ చేయాలని నిర్ణయించుకున్నాను.