Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
Joint Entrance Examination (Main) - 2017

జేఈఈ మెయిన్ 'కీ' విడుదల

హైదరాబాద్: జేఈఈ మెయిన్‌కు సంబంధించిన 'కీ' మంగళవారం(ఏప్రిల్ 18) విడుదలైంది. విద్యార్థులు జవాబులు నింపిన ఓఎంఆర్ పత్రాలను కూడా సీబీఎస్ఈ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఏప్రిల్‌ 18-22వ తేదీ వరకు వాటిని వెబ్‌సైట్లో ఉంచుతారు. 'కీ', వెబ్‌సైట్లో ఉంచిన ఓఎంఆర్ పత్రంపై అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్ ద్వారా పంపించవచ్చు. తనకు పరీక్ష రోజు ఇచ్చిన ఓఎంఆర్ పత్రం, వెబ్‌సైట్లో ఉంచినది ఒకటి కాకున్నా, తాను గుర్తించిన జవాబులను పరిగణలోకి తీసుకోకున్నా, ఇతర అభ్యంతరాలను అభ్యర్థులు సవాల్ చేయవచ్చు. ఓఎంఆర్ పత్రంపై అభ్యంతరానికి రూ.1000, 'కీ'కు సంబంధించి ఒక్కో ప్రశ్నపై అభ్యంతరానికి రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సీబీఎస్ఈ అభ్యర్థి అభ్యంతరంపై ఏకీభవిస్తే చెల్లించిన డబ్బులను తిరిగి ఇస్తారు. సవాల్ చేయడానికి ఏప్రిల్‌ 22వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అవకాశముంటుంది. ఆన్‌లైన్‌లో పరీక్ష రాసిన వారికి పరీక్ష జరిగిన రోజే ప్రశ్నపత్రం, ఓఎంఆర్ పత్రం ఈ-మెయిల్‌కు పంపించారు. వారు మాత్రం కేవలం 'కీ'పై మాత్రమే అభ్యంతరాలు పంపించుకోవాలని సీబీఎస్ఈ సృష్టం చేసింది.

JEE Main Paper -1        Official Anwser Keys


Question Paper & Key

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏప్రిల్ 2న దేశవ్యాప్తంగా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) - 2017 మెయిన్ రాతపరీక్షను నిర్వహించింది. ఈ రాతపరీక్ష ప్రశ్నపత్రంతో పాటు నిపుణులు రూపొందించిన 'కీ'ని అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. సీబీఎస్ఈ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.
ఈ రాతపరీక్ష ద్వారా ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో నడిచే జాతీయ స్థాయి ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బీఈ/ బీటెక్ లో ప్రవేశాలకు పేపర్ 1, బీఆర్క్/ బీ ప్లానింగ్‌లో ప్రవేశాలకు పేపర్ 2 నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆన్‌లైన్‌ పరీక్ష జరగనుంది.
ఏప్రిల్ 27న సీబీఎస్ఈ ఫలితాలను విడుదల చేయనుంది.

JEE Main Paper 1        Question Paper       All Series Key     'Code-C' Solutions

JEE Main Paper 2        Question Paper

ఈ 'కీ'ని రూపొందించినవారు: శ్రీ గాయత్రి విద్యాసంస్థలు, హైదరాబాద్.

Published on 02-04-2017