JEE > LATEST NEWS

మే 19న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశం కోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2019 పరీక్షను వచ్చే ఏడాది మే 19వ తేదీ (ఆదివారం)న నిర్వహించనున్నారు. నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ రూర్కీ అక్టోబ‌రు 11న‌ పరీక్ష తేదీని వెల్లడించింది. వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. ఈ సంవత్సరం తొలిసారిగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(ఆన్‌లైన్‌)ను నిర్వహించగా వచ్చే ఏడాది సైతం అదే విధానం అమలుకానుంది. ఉదయం 9-12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2-5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరగనుంది. జేఈఈ మెయిన్‌ నుంచి కటాఫ్‌ మార్కులు, సామాజిక వర్గాల రిజర్వేషన్‌ ప్రకారం మొత్తం 2.20 లక్షల మందికి మాత్రమే అడ్వాన్సుడ్‌ పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తారు. ఈ పరీక్ష ర్యాంకులతో 2019-20 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్‌ సీట్లను భర్తీ చేస్తారు. మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఐఐటీ రూర్కీ ప్రకటించింది.

Published on 01-12-2018