close

JEE > LATEST NEWS

వెబ్‌సైట్‌లో జేఈఈ మెయిన్‌ ప్రశ్నపత్రాలు

* 17 వరకూ అందుబాటులో
* 16న ప్రాథమిక కీ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా జనవరి 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-1, 2కు సంబంధించిన ప్రశ్నపత్రాలను జాతీయ పరీక్ష సంస్థ(ఎన్‌టీఏ) సోమవారం(జనవరి 14) వెబ్‌సైట్‌లో ఉంచింది. పేపర్‌-1 పరీక్షను రోజుకు రెండు విడతలుగా మొత్తం ఎనిమిది సార్లు ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. అంటే ఎనిమిది ప్రశ్నపత్రాలుంటాయి. పేపర్‌-2కు మరో ప్రశ్నపత్రం. ఆ ప్రశ్నపత్రాలతోపాటు విద్యార్థులు గుర్తించిన జవాబులు నింపిన పత్రాన్ని కూడా వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిని విద్యార్థులు చూసుకునేందుకు జేఈఈ మెయిన్‌ వెబ్‌సైట్‌లో లింకు ద్వారా ఎవరి ప్రశ్నపత్రాన్ని వారు చూసుకోవచ్చని ఎన్‌టీఏ తెలిపింది. జనవరి 17వ తేదీ వరకు ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయని, వాటిని విద్యార్థులు భద్రపరుచుకోవాలని సూచించింది. జనవరి 16వ తేదీన ప్రాథమిక కీ వెలువడనుంది. ఈ పరీక్షలకు మొత్తం 9,41,117 మంది దరఖాస్తు చేశారని అధికారికంగా మొదటిసారి ప్రకటించిన ఎన్‌టీఏ... ఎంత మంది పరీక్షలకు హాజరయ్యారన్నది మాత్రం చెప్పకపోవడం గమనార్హం. దరఖాస్తు చేసిన వారిలో దాదాపు 98 శాతం వరకు హాజరవుతారని అనధికారిక అంచనా.

Published on 14-01-2019