close

JEE > LATEST NEWS

జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ విడుద‌ల‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా జనవరి 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-1, 2కు సంబంధించిన ప్రాథమిక కీతో పాటు ప్రశ్నపత్రాలను జాతీయ పరీక్ష సంస్థ(ఎన్‌టీఏ) వెబ్‌సైట్‌లో ఉంచింది. పేపర్‌-1 పరీక్షను రోజుకు రెండు విడతలుగా మొత్తం ఎనిమిది సార్లు ఆన్‌లైన్‌ విధానంలో జరిగాయి. అంటే ఎనిమిది ప్రశ్నపత్రాలుంటాయి. పేపర్‌-2కు మరో ప్రశ్నపత్రం. ఆ ప్రశ్నపత్రాలతోపాటు విద్యార్థులు గుర్తించిన జవాబులు నింపిన పత్రం, ప్రాథ‌మిక కీ వెబ్‌సైట్‌లో ఉంచారు. వాటిని విద్యార్థులు చూసుకునేందుకు వెబ్‌సైట్‌లో లింకు ద్వారా ఎవరి ప్రశ్నపత్రాన్ని వారు చూసుకోవచ్చని ఎన్‌టీఏ తెలిపింది. ప్రాథ‌మిక కీ పై అభ్యంత‌రాలు 17వ తేదీలోగా స్వీకరించిన అనంత‌రం జనవరి 31న ఫలితాలను వెల్ల‌డికానున్నాయి. ఏప్రిల్‌లో మరో మారు పరీక్షలు ఉన్నందున ఈ సారి కేవలం ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయన్నదే ప్రకటిస్తుంది. ఏప్రిల్‌లో జరిగే పరీక్షల అనంతరం దేనిలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని ర్యాంకులిస్తుంది. తాజా పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది హాజరయ్యారు.

వెబ్‌సైట్‌

Published on 16-01-2019