close

JEE > LATEST NEWS

జేఈఈలో అత్యధిక ‘తెలుగు’ మార్కులు 350!‌

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ పేపర్‌-1లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మార్కులు 350గా ఉండొచ్చని తెలుస్తోంది. జ‌న‌వ‌రి 9వ తేదీ నుంచి 12 వరకు రోజుకు రెండు సార్లు చొప్పున మొత్తం ఎనిమిది విడతల ఆన్‌లైన్‌ పరీక్షలు జరిగాయి. అనుకున్న దానికంటే ఒక రోజు ముందే జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ఎనిమిది ప్రశ్న పత్రాలకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేసింది. మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహించగా ఏపీలోని ఓ కార్పొరేట్‌ కళాశాల విద్యార్థి 350 మార్కులను కచ్చితంగా సాధిస్తున్నట్లు సమాచారం. రెండు ప్రశ్నలకు సంబంధించిన కీపై సందిగ్ధత ఉండటం వల్ల దానిపై అభ్యంతరాలు పంపిస్తామని జేఈఈ శిక్షణ నిపుణుడు ఒకరు చెప్పారు. అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో పంపించేందుకు గురువారం వరకు అవకాశం ఉంది. జ‌న‌వ‌రి 31వ తేదీ లోపు మార్కులు వెల్లడికానున్నాయి.

Published on 17-01-2019