మనసుకు చేయండి రీఛార్జ్‌
ఒకటే వాతావరణం.
ఒకే తరహా పని.
ఏళ్లతరబడి చేస్తున్నా ఎలాంటి మార్పు లేదు.
ఉద్యోగం అంటే విసుగు.. నిరాసక్తత.
చాలా మందిలో కనిపించే భావనలివి. ఇందుకు ప్రధాన కారణం ప్రేరణ లేకపోవడం. ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం. ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు ఆ ఉద్యోగం చేయలేని పరిస్థితికి తలెత్తవచ్చు. ఎంత బాగా పని చేసినా.. మంచి ఫలితాలు వచ్చినా సంతృప్తి కలగకపోవచ్చు.
read more-->

ప్రాజెక్టు మేనేజర్‌గా రాణించాలంటే...
ప్రాజెక్టు మేనేజర్‌... ఈ స్థానం చాలా మంది కనే కల. ఆ స్థానానికి చేరుకోవడానికి ఎంతటి ప్రతిభ చూపించాలో, దాన్ని నిలబెట్టుకోవడానికి అంతే ప్రతిభ చూపించాలి. ప్రాజెక్టు మేనేజర్‌ స్థానాన్ని దక్కించుకోవాలన్నా, ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలన్నా ఆ బాధ్యత చేపట్టేవారికి ఉండాల్సిన నైపుణ్యాలేమిటో తెలిసి ఉండాలి. నిపుణులు చెప్పే ఆ అంశాలేమిటో చూడండి..
read more-->

తొందరపడొద్దు

* ఉద్యోగం మారేముందు అన్నీ ఆలోచించుకోండి..
ఒక అధ్యయనం ప్రకారం ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్న వారిలో 60 శాతానికిపైగా యువకులే. వీరిలో 60 శాతం మంది పట్టుమని అయిదేళ్లు కూడా ఒక సంస్థలో పని చేయడం లేదు. దీని ప్రకారం ప్రస్తుతం ఉద్యోగుల్లో నిలకడ లేమి ఏ మేరకు ఉందో తెలుసుకవోచ్చు. వీరు కాస్త ఉద్యోగ అనుభవం రాగానే సంస్థలు మారుతూ ఉంటారు.
read more-->

ఇలాగైతే ఇక పండగే..!
ఎక్కడెక్కడో నగరాల్లో పని చేస్తున్న స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్లు ఇలా అందరూ ఈ వారాంతం సొంతూళ్లలో వాలిపోతారు. వచ్చే వారం సంక్రాంతి కావడంతో అందరూ ఇళ్ల వద్దే అందుబాటులో ఉంటారు. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌ లేదా స్కైప్‌లలో చాట్లాడిన వారితో ప్రస్తుతం ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుకొనే వీలుంటుంది. ఈ సమయం ఉద్యోగార్థులకు చాలా కీలకం.
read more-->
కలల సంస్థలోకి ఇలా!
ఉద్యోగావకాశాల కోసం అభ్యర్థులు పత్రికలు, అంతర్జాలాన్ని ప్రముఖంగా ఆశ్రయిస్తారు. పలు సంస్థల ప్రకటనలు ఉద్యోగార్థులను వూరిస్తుంటాయి. అయితే వాటిలో తాము చేరదలచుకున్న సంస్థ ప్రకటన మాత్రం కనిపించదు. సర్వేల ప్రకారం ప్రతి ఐదు ఉద్యోగాల్లో ఒకదానికి సంబంధించి మాత్రమే ప్రకటనలు వస్తున్నాయి. మరి అభ్యర్థులు తాము చేరదలుచుకున్న సంస్థలో ఖాళీల గురించి తెలుసుకోవడం ఎలా?
read more-->
పై చేయి సాధించాలంటే...
ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నపుడు చాలా పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతిభ, నైపుణ్యాలు, అర్హతలు అన్నీ మీతో పాటే సమానంగా ఉన్నా.. కొన్నిసార్లు మీ పోటీ దారులు మీపై పైచేయి సాధించి కొలువును చేజిక్కించుకొంటూ ఉంటారు. ఇందుకు కారణం మీ పోటీదారులతో పోల్చితే మీలో కొన్ని అంశాలపై అవగాహన లేకపోవడం.
read more-->
ఆరంభించడం ఎలా?
చాలా మంది తమ కెరియర్‌ను పెద్ద సంస్థలతో ప్రారంభిచాలని భావిస్తారు. ఇలా చేయడం వల్ల కెరియర్‌లో మరింత దూసుకెళ్లొచ్చని వారి అభిప్రాయం. ఇటీవల కాలంలో చిన్న సంస్థలపైనా ఉద్యోగార్థులు దృష్టి పెడుతున్నారు. సంస్థ పెద్దదా? చిన్నదా? అనే దానికన్నా కెరియర్‌ పురోగతికి తోడ్పడుతుందా లేదా అనే అంశమే దీనికి కారణం.
read more-->
కొత్తదనం కావాలి!
దాదాపు అన్ని సంస్థలూ ఉద్యోగుల ఎంపికలో ఇన్ఫోసిస్‌ ధోరణిని అనుసరిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా నిపుణులైన ఉద్యోగులకు గిరాకీ ఉన్నా సరిపడా నైపుణ్యం.. సృజనాత్మకత.. కొత్త తరహా ఆలోచనలు కలిగిన వారు లేరు. దీంతో లక్షలాదిగా ఉన్నత విద్యావంతులున్నా అందరికీ తగిన కొలువులు..
read more-->
ఇలా అంచనాకొస్తారు..
రాతపరీక్షలో విజయం సాధించిన అనంత్‌కు మౌఖికపరీక్షకు హాజరు కావాలని పిలుపు వచ్చింది. గతంలో ఎన్నడూ మౌఖికపరీక్షకు హాజరుకాని అనంత్‌కు ఒకింత ఆందోళన ప్రారంభమైంది. ఏం అడుగుతారు.. ఏయే అంశాలపై కసరత్తు చేయాలన్న ఆలోచన మొదలైంది. సన్నిహితులు, సంస్థలో పనిచేసే వారిని కలిసి మౌఖికపరీక్షకు ఎలా సిద్ధం కావాలో అడిగి తెలుసుకున్నాడు.
read more-->
ఈ ఏడాది ఏం చేశాను!
2013.. అప్పుడే ముగింపునకు వచ్చేసింది. మరో రెండున్నర వారాలు గడిస్తే.. ఈ ఏడాది పూర్తయిపోతుంది కూడా. ఈ నేపథ్యంలో చాలా మంది ఎక్కువగా.. కొత్త సంవత్సరం గురించి ఆలోచిస్తుంటారు. 2014లో ఏం చేయాలో ప్రణాళికలు వేసుకొంటూ ఉంటారు. వాటిని ఎలా అమల చేయాలో వ్యూహాలు రచిస్తూ ఉంటారు.
read more-->
రాజీనామా ఎందుకు చేశావు?
కిరణ్ చాలా కాలంగా ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. మంచి వేతనం, హోదా ఉన్నప్పటికీ ఇటీవలే వేరే సంస్థకు మారాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా సహచరులతో తర్వాత బాస్‌తో మాట్లాడాడు. సంస్థకు రాజీనామా చేసి విపణిలో పేరెన్నికగన్న మరో సంస్థలో ఉద్యోగం నిమిత్తం మౌఖిక పరీక్షకు హాజరయ్యాడు.
read more-->
ఇలా పంపి చూడండి
ఉద్యోగ వేటలో రెజ్యూమె పాత్ర చాలా కీలకం. రెజ్యూమెలో ఎంత రాసినా.. సంస్థకు కావాల్సినవి అందులో ప్రధానంగా లేకుంటే.. అది తిరస్కరణకు గురవుతుంది. ఫలితంగా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. అందువల్ల రెజ్యూమెను రూపొందించే ముందు దాన్ని అందుకొనే సంస్థకు కావాల్సినవి ఏంటో.. గుర్తించాలి.
read more-->
ఏకాగ్రత కోల్పోవద్దు
వృత్తి జీవితంలో పని ఒత్తిడి అధికంగానే ఉంటుంది. విపరీతమైన ఆలోచనల వల్ల ఒక్కోసారి ఏకాగ్రత కోల్పోతుంటారు. ఇల్లు, స్నేహితులు, షాపింగ్ ఇలా ఒకటేమిటి అనేక రకాల ఆలోచనలు పని నుంచి పక్కదోవ తప్పిస్తుంటాయి. తేరుకొని మళ్లీ పని మొదలు పెట్టేసరికి విలువైన సమయం చాలానే వృథా అవుతూ ఉంటుంది. ''ఉద్యోగులు కార్యాలయంలో ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి ఏకాగ్రత కోల్పోతారు.
read more-->
తగిన నైపుణ్యం ఉందా?
ఒకవైపు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు బాగానే ఉన్నాయి.. మరోవైపు ఆ ఉద్యోగాలకు సరిపడా విద్యార్హతలు కలిగిన యువత కూడా ఉంది. అయితే సంస్థల్లో ఉద్యోగుల కొరత.. యువతకు ఉద్యోగాలు రాక ఇరువైపులా ఇబ్బందికర పరిస్థితి. ఇదీ ప్రస్తుతం ఉన్న సమస్య. దీనికి కారణం యువతలో సదరు ఉద్యోగానికి తగిన నైపుణ్యాలు, ప్రతిభ లేకపోవడం.
read more-->
స్ఫూర్తి నింపండిలా!
పదోన్నతుల ద్వారా ఏదో ఒక సమయంలో నాయకత్వ స్థానానికి చేరుకుంటారు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం కొందరు విఫలమవుతుంటారు. నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ వాటిని ప్రదర్శించడం తెలియని వారు కొందరైతే తానో అధికారి అన్న భావనతో సభ్యులను దూరంగా పెట్టి విజయాలకు దూరమయ్యేవారు ఉన్నారు.
read more-->
మీ ప్రత్యేకత ఏమిటి?
ఈ- మెయిల్ చేయడం.. క్లయింట్ల ప్రశ్నలకు స్పందించడం... సిబ్బందిని సమావేశపరచడం... సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయడం.. సమస్యలకు పరిష్కారాలు గుర్తించడం.. ఇవన్నీ తెలిస్తే వృత్తి జీవితంలో ప్రొఫెషనల్ అయినట్లేనా? కార్యాలయంలో రోజూ చేసే పని క్రమం తప్పకుండా చేస్తుంటే
read more-->
1 2 3 4 5 6 7 8 9 10 11 12


Ushodaya Enterprises Private Limited 2017