చర్చలో.. రచ్చ వద్దు
సమర్థులైన ఉద్యోగులను ఎంపిక చేసుకోవడంలో ఎక్కువ సంస్థలు అనుసరిస్తున్న ఒక వ్యూహం బృంద చర్చ. ఇందులో నెగ్గిన అభ్యర్థులకే ఇంటర్వ్యూ, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మరి ఆ దశను విజయవంతంగా పూర్తి చేయాలంటే ఏం చేయాలి? అసలు ఈ చర్చ ఎందుకు? దీని వెనుక ఉన్న రహస్యమేంటి? తెలుసుకోండి మరి.
read more-->
హావభావాలు అతిముఖ్యం
భావ వ్యక్తీకరణలో భాష.. హావభావాలు చాలా ప్రధానం. తాజా అధ్యయనం మేరకు భాష వల్ల 7శాతం మాత్రమే భావ వ్యక్తీకరణ జరిగితే హావభావాల ప్రభావం 55 శాతం మేర ఉంటోంది. ఉద్యోగ వేటలో ఉన్నవారు, ఉద్యోగులకు హావభావాలు చాలా కీలకం. ముఖాముఖి, సమావేశాలు, కార్యాలయాల్లో వీటికి అత్యంత ప్రాధాన్యం ఉంటోంది.
read more-->
మౌఖిక పరీక్షకు వెళ్లే ముందు..
ఉద్యోగ వేటలో కీలక దశ ఇంటర్వ్యూ. ఇక్కడ విజయం సాధిస్తే చాలు దాదాపు ఉద్యోగం వచ్చేసినట్టే. మరి ఇంత ముఖ్యమైన ముఖాముఖికి సిద్ధమవడంలో చాలా మంది తెలిసో.. తెలియకో నిర్లక్ష్యం కనబరుస్తుంటారు. మౌఖిక పరీక్ష సందర్భంగా సంస్థ ప్రతినిధులకు అవసరమైన పత్రాలు ఇంటి వద్దే వదలివెళ్లి ఇబ్బంది పడుతుంటారు.
read more-->
వృత్తి మారాలంటే..!
ఇష్టమైన ఉద్యోగం. మంచి సంస్థ. మంచి జీతం. అభివృద్ధికి గొప్ప అవకాశాలు. ఒత్తిడి తక్కువ.. వంటి అంశాలు ఉద్యోగులు వృత్తి మారేందుకు ప్రేరేపిస్తున్నాయి. కొన్ని సంస్థలు ప్రతిభా వంతులైన ఉద్యోగుల కోసం జీతం పెంపు.. ఇష్టమైన చోట ఉద్యోగం చేసే అవకాశం.. కార్యాలయంలో ప్రత్యేక వసతులు వంటి పలు ఆకర్షణలను ఎర వేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది వృత్తి, ఉద్యోగాలు మారుతున్నారు.
read more-->
కొత్తగా కొలువు సాధ్యమే!
ఈ రోజుల్లో ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా.. ప్రతిభతో పాటు ఆ రంగంలో కాస్తో కూస్తో అనుభవం ఉన్న వారికే ప్రాధాన్యం ఉంటోంది. మరి అది లేకుంటే పరిస్థితి ఏంటి? అనుభవం లేకున్నా ఉద్యోగం సాధించడం ఎలా?
ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథనం. ''మంచి ప్రణాళిక.. కసరత్తుతో కూడిన ఉద్యోగ అన్వేషణ'' చేస్తే అనుభవం లేకున్నా మంచి కొలువు సాధ్యమేనని అంటున్నారు నిపుణులు. అదెలాగో చదవండి..
read more-->
చలో హైదరాబాద్‌
ఎంసెట్‌లో ర్యాంకు వచ్చింది...ఆనందం. ఇంజినీరింగ్‌లో సీటొచ్చింది...సంతోషం. బీటెక్‌ పట్టా చేతికి అందింది... పట్టరాని సంతోషం. మరి ఉద్యోగం వచ్చిందా?... సమాధానం లేదు. నెలలు.. ఏళ్లు గడిచినా అవును అన్న సమాధానం రావటంలేదు.. ఆ సమాధానం కోసమే రాష్ట్ర నలుమూలల నుంచి చలో హైదరాబాద్‌ అంటున్నారు విద్యార్థులు.
read more-->
మాట్లాడు చక్కగా
ప్రతిభ ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ఉద్యోగ ప్రయత్నాలూ చేస్తున్నారు. కాని కొలువు మాత్రం దక్కడం లేదు. రెజ్యూమె బాగున్నా.. సాంకేతిక పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నా.. ఉద్యోగం అందని ద్రాక్షలాగే మిగులుతోంది. ఇది ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మంది యువత పరిస్థితి.
read more-->
స్థానం పదిలపరచుకోండిలా!
బృంద సారథ్య బాధ్యతలు నిర్వర్తించేవారికి ప్రత్యేక లక్షణాలు అవసరమేనా? అవి లేకుండా రాణించలేరా.. చాలా మందికి సహజంగా వచ్చే అనుమానమిది. నాయకుడి పాత్రలోకి వెళ్లిన తర్వాత ఆ లక్షణాలు తప్పకుండా పుణికిపుచ్చుకోవాల్సిందే అని నిపుణులు అంటున్నారు. కొత్త బాధ్యతలు స్వీకరించాక నాయకత్వ లక్షణాలు అలవర్చుకోకుంటే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేస్తున్నారు.
read more-->
       
1 2 3 4 5 6 7 8 9 10 11 12


Ushodaya Enterprises Private Limited 2017