కీలక అంశాలు గుర్తించండి
రోజూ గంటల తరబడి కార్యాలయంలో పని చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. తీరా ఆ ఫలితాలు వచ్చే సరికి ఆలస్యమవుతోంది. ఎంత ప్రయత్నిస్తున్నా ఇదే పరిస్థితి..! ఎక్కువ మంది ఉద్యోగులు ఇలాంటి ఇబ్బందులు పడీపడీ.. వాటికి అలవాటుపడిపోయి ఉంటారు. మరికొందరు ఉద్యోగాలు సరిగా చేయలేక వేరే రంగాలకు మారి ఉంటారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి పరిస్థితులను అధిగమించొచ్చు.
read more-->
మచ్చ లేని వారికే..
ఉద్యోగం కోసం ఉపాధి కల్పన కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకుని.. కాల్‌ లెటర్‌ కోసం ఎదురుచూడడమో.. ఉద్యోగ నియామక పరీక్షలు రాసి పాసయితే.. ఇంటర్వ్యూలకు వెళ్లడమో అన్నది పాత పద్ధతి. అంతర్జాలం విజృంభించాక అంతా ఆన్‌లైన్‌మయమైపోయింది. మీ విద్యార్హతలు, మొబైల్‌ నంబర్‌ సహా రెజ్యూమెను జాబ్‌ సైట్‌లకు మెయిల్‌ చేస్తే చాలు.
read more-->
ఉద్యోగవేటకు ఉపకరించేవేమిటి?
విద్యాభ్యాసం పూర్తవుతూనే ఉద్యోగవేటలో పడడం ఒకప్పటి ఆనవాయితీ! అయితే చదువు కొనసాగుతున్నపుడే అన్వేషించి, కోర్సు ముగుస్తూనే కొలువులో చేరిపోవడం ఇవాళ్టి నవీన రీతి. అంతర్జాల అనుసంధానంతో ప్రయత్నాలను కొత్తపుంతలు తొక్కిస్తే ఆశించిన లక్ష్యం నెరవేరటం నిశ్చయం!
read more-->
శె'బాస్‌' అనిపించుకోండి!
అప్పటి వరకు బృందంలో ఒక సభ్యుడిగా ఉన్న మీకు ఆ బృందానికో, మరో బృందానికో సారథ్యం వహించే అవకాశం వస్తే! అంతకంటే కావాల్సిందేముంటుంది.. అనుకుంటారా? నిజానికి కెరియర్‌లో ఉన్నత స్థానాలు అధిరోహించడానికి అది మంచి మలుపే. కానీ వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలంటే చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.
read more-->
మర్యాదలు పాటించండి!
చక్కని రెజ్యూమె.. అభ్యర్థిలో ప్రతిభ ఉండి.. ఇంటర్వ్యూని చక్కగా పూర్తి చేస్తే ఉద్యోగం తప్పక వచ్చేస్తుందని చాలా మంది భావిస్తుంటారు. ఇవి మాత్రమే సరిపోవు. మర్యాదలు-పద్ధతులు (ఎటికెట్‌) కూడా చాలా కీలకం. రిక్రూటర్లు అభ్యర్థిలో ప్రతిభ, నైపుణ్యాలతో పాటు మర్యాదలు /పద్ధతులను కూడా పరిశీలిస్తున్నారు.
read more-->
పదోన్నతికి సిద్ధంకండి!
చక్కగా పని చేస్తున్నారు. ఇచ్చిన పనిని సకాలంలో పూర్తి చేస్తున్నారు. తోటి ఉద్యోగులు.. ఉన్నతాధికారులు అందరూ శెభాష్‌ అంటున్నారు. ఇలాగే ఏళ్లుగడుస్తాయి.. అనుభవం పెరుగుతోంది. పదోన్నతి మాత్రం రావడం లేదు. ఈ పరిస్థితుల్లో చాలా మంది..
read more-->
విజేతగా నిలవాలంటే?
ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమించినప్పటికీ కొన్ని సందర్భాల్లో పరాజయాలు పలకరిస్తుంటాయి. నిరాశ చెందకుండా లోపాలను సవరించుకుంటే విజయ తీరాలను చేరుకోవడం సులభమేనంటున్నారు నిపుణులు.
read more-->

లక్ష్యం నెరవేరాలంటే!
కెరియర్‌లో ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. తోటి ఉద్యోగులకన్నా బాగా రాణించి తన లక్ష్యాన్ని త్వరగా సాధించాలని కలలు కంటుంటారు. కాని దానికి తగిన ప్రణాళిక.. కసరత్తు మాత్రం చేయరు.
read more-->

పొర'పాట్లు' అధిగమించండిలా!
సాధారణంగా తప్పులు చేయడానికి ఎవరూ సాహసించరు. వృత్తి జీవితంలో తెలిసో తెలియకో పొరపాట్లు దొర్లుతుంటాయి. అయితే, వెంటనే గుర్తించడం ద్వారా పలువురు వాటిని అధిగమిస్తుంటారు. తప్పులు గుర్తించి మరోసారి పునరావృతం కాకుండా వాటిని అధిగమించడం ద్వారానే వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలతారని నిపుణులు చెబుతున్నారు. విజయవంతమైన ఉద్యోగులుగా గుర్తింపు పొందినవారు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటారు.
read more-->
కొలువులే.. కొలువులు!
ఇప్పటిదాకా సరైన ఉద్యోగం లభించలేదా..! మీలాంటి వారికి శుభవార్త ఇది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 94 శాతం సంస్థలు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని భావిస్తున్నాయట. 2013లో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఇప్పటికే పలు సంస్థల అధ్యయనాలు వెల్లడించగా తాజా సర్వే కూడా అదే విషయాన్ని స్పష్టంచేసింది. తాజా సర్వేలో వెల్లడైన విషయాలేంటో.. ఏఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోండి మరి..!
read more-->
దిశ మార్చే దశ సూత్రాలు
ఒక సంస్థలో సమర్థుడైన నాయకుడంటే ఎవరు? అసలు నాయకుడికిఉండాల్సిన లక్షణాలేంటి? కేవలం దూరదృష్టి, వివేకవంతమైన నిర్ణయాలు తీసుకొనే నేర్పు, ఆత్మవిశ్వాసం ఉంటే చాలా? లేక ప్రాజెక్టు ఆచరణను సమర్థంగా నిర్వహిస్తే సరిపోతుందా?.. ఇవి మాత్రమే చాలవంటున్నారు వృత్తి నిపుణులు. ఉత్తమ నాయకుడిగా ఎదగడానికి ఇవి కొంతమేరకే దోహదం చేస్తాయంటున్నారు.
read more-->
మారుతున్న నియామకాల తీరు
అ'మా వ్యాపారాభివృద్ధి, విస్తరణకు మీరేం చేస్తారో చెప్పండి' ఇది ప్రఖ్యాత ఫిలిప్స్‌ సంస్థ ఇటీవల గ్రాడ్యుయేట్లకు 'బ్లూప్రింట్‌' పేరిట నిర్వహించిన పోటీలో అడిగిన ప్రశ్న. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ మరో అడుగు ముందుకేసి కళాశాల విద్యార్థులూ 'ఐడియాలతో ఆడుకోండి' అంటూ 'ఐడియాథాన్‌' నిర్వహించింది.
read more-->
చిన్న పొరపాటే కానీ!
అకౌంటెంట్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన సుదర్శన్‌ గతంలో ఉపాధ్యాయుడిగా పని చేసి ఉండటంతో ఆ అనుభవాన్ని రెజ్యూమెలో ప్రధానంగా పేర్కొన్నారు. దీంతో మనకు అతను అవసరం లేదని పేర్కొంటూ రిక్రూటర్లు అతని దరఖాస్తును పక్కనపెట్టారు. సుదర్శన్‌ తన రెజ్యూమెను చాలా చక్కగా రూపొందించినా.. తెలియక చేసిన ఒక పొరపాటు అతని ఉద్యోగ అవకాశానికి ఎసరు పెట్టింది.
read more-->
ఎందుకు, ఎక్కడికి, ఎలా!
వృత్తిజీవితం పట్ల విసుగెత్తిపోయారా? కెరియర్‌లో మార్పు కోరుకుంటున్నారా? మార్పు కోరుకోవడమనేది సాహసమే. అందుకే పాత ఉద్యోగం మాదిరి పూర్తిస్థాయిలో హోదా, భద్రత ఉంటాయా అనేదీ యోచించాలి. అంతేకాదు.. ప్రస్తుత అర్హతలు సరిపోతాయా లేక మళ్లీ శిక్షణ అవసరమా అనేది తేల్చుకోవాలి. బృందనాయకుడితో మనస్పర్థలు, సహచరులతో ఇబ్బందులు మార్పునకు కారణం కాకూడదు.
read more-->

అది వారధి మాత్రమే
ఏప్రిల్‌ వచ్చేసింది..! మరో రెండు నెలల్లో డిగ్రీ ఆఖరు పరీక్షలూ పూర్తవుతాయి. ఆ వెంటనే తగిన కొలువు సంపాదించాలి. అందుకు ముందుగా ఓ కోర్సు పూర్తి చేయాలి. మంచి ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీని సంప్రదించి అక్కడ తమ వివరాలను నమోదు చేసుకోవాలి.
read more-->

విజయానికి ఏడడుగులు
వృత్తి జీవితాన్ని నిజంగా ఆస్వాదిస్తున్నారా? పూర్తి స్థాయిలో సంతృప్తి పొందుతున్నారా? ఈ రెండింటికీ మీ జవాబు అవును అని గట్టిగా చెప్పగలితే కెరియర్‌లో మీరు విజయం సాధించినట్లే. కానీ, అన్ని వేళలా కాదు.. అనేది మీ సమాధానమైతే కెరియర్‌లో పూర్తిస్థాయిలో దూసుకెళ్లనట్లే.
read more-->
1 2 3 4 5 6 7 8 9 10 11 12


Ushodaya Enterprises Private Limited 2017