కొలువు విలువ తెలుసుకోండి
ఉద్యోగ జీవితానికి కావాల్సిన పునాదిని కళాశాలలు వేస్తాయి. ఉద్యోగం సాధించడానికి కావాల్సిన పరిజ్ఞానం, నైపుణ్యాలు అక్కడ నేర్పిస్తారు. ఈ పునాదితో ఉద్యోగం సాధించేస్తారు. ఇక అక్కడితో విజయం సాధించేసినట్లేనా? లక్ష్యం పూర్తయిపోయినట్లేనా? కానే కాదు.
read more-->
విరామం తర్వాత..
పెళ్లి.. పిల్లలు.. అనారోగ్యం.. అనాసక్తి.. కుటుంబ సమస్యలు.. ఇలా చాలా కారణాల వల్ల కొందరు కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు ఉద్యోగం మానేస్తారు. కొన్నాళ్లకు పరిస్థితి కుదుటపడ్డాక మళ్లీ ఉద్యోగంలో చేరాలనిపిస్తుంది. మహిళల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది.
read more-->
ప్రాంగణ నియామకాల్లో మారిన ధోరణి
ఇంటర్‌ పూర్తయింది. అయ్యాక..? ఇప్పుడంతా ఇంజినీరింగ్‌ వైపేగా! ఆ తర్వాత...? ఇంజినీరింగ్‌లో చదివింది ఏ విభాగమైనా.. అందులో ఉద్యోగాలు లేకున్నా.. రాకున్నా.. ఉండనే ఉంది సాఫ్ట్‌వేర్‌ రంగం!! కానీ ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో స్థిరపడడానికి ఇంజినీరింగే చేయక్కర్లేదు. మామూలు డిగ్రీ చాలు.
read more-->
నియామక సంస్థలను మెప్పించేవేమిటి?
అవసరానికి మించి ఇంజినీరింగ్‌ సీట్లు. దీంతో ఇంటర్మీడియట్‌ పూర్తవుతూనే ఇంజినీరింగ్‌లో ప్రవేశిస్తున్నారు. పట్టా తెచ్చుకునేవరకూ సాఫీగానే సాగుతోంది ప్రయాణం. ఉద్యోగవేటలో పడేవేళ మాత్రం తడబాటు, వైఫల్యం... అసలు ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో
read more-->
సారథ్యం నిలబెట్టుకోవాలంటే..
ప్రతి రంగంలోనూ ప్రస్తుత పరిస్థితులు క్లిష్టంగానే ఉన్నాయి. ఒకప్పుడు బృంద నాయకుడు స్థాయికి వెళ్తేచాలు ఆపై స్థానాలకు అదే చేరుకుంటామని అనుకొనేవారు. కానీ ఇప్పుడు పై స్థాయి సంగతటుంచి, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడమే కష్టంగా ఉంది. ఎంతటి విజయాలు సాధించినా నాయకత్వం విషయంలో నైపుణ్యానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు.
read more-->
కార్యాలయంలో కథా కమామిషు
సీనియర్‌ అధికారి ఒకరు.. కార్యాలయంలో ఉద్యోగులందరినీ సమావేశపరిచారు. ఉత్పత్తులు, వాడుకదారులకు సంబంధించి పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్లు.. రేఖాచిత్రాలు.. గణాంకాలు.. సమాచార విశ్లేషణ.. చేస్తున్నారు. అయితే సమావేశంలో అందరూ ఆయన ప్రసంగాన్ని ఏకాగ్రతతో ఆలకించడం లేదు.
read more-->
ఖాళీగా ఎందుకున్నానంటే...!
వృత్తి జీవితం మధ్యలో కొంతమంది కొంతకాలం ఖాళీగా ఉండాల్సి రావచ్చు. ఉద్యోగాలు మారుతున్నప్పుడో, మరో కారణం వల్లో ఖాళీగా ఉండడం అనివార్యం కావచ్చు. ఈ ఖాళీ గురించి రిక్రూటర్లకు వివరించడంలో పలువురు విఫలమవుతుంటారు. ఉన్నత చదువులు ముగియగానే ఏదో ఒక సంస్థ అని భావించి ఉద్యోగంలో చేరడం చివరికి ఆ సంస్థ ఎలాంటి అనుభవ పత్రం ఇవ్వకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోతుంటారు.
read more-->
అంగీకారానికి ముందు...
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం రావడమే బహు కష్టం. అలాంటి సందర్భాల్లో ఏదో ఒక ఉద్యోగం అని సర్దిచెప్పుకొనే వారూ ఉన్నారు. అంతేకాదు, ఎలాంటి షరతులు అంగీకరించి ఉద్యోగంలో చేరాలనే సందిగ్ధంలో చాలా మందిలో ఉంటుంది. చిన్న సంస్థ, పెద్ద సంస్థ అని కాకుండా ముందు ప్రాధాన్యం ఉద్యోగానికే అంటూ అడుగిడే వారూ ఉన్నారు.
read more-->
సాధన చేయండి.. సాధించండి!
ఇటీవల పలు సంస్థలు భారీ ఎత్తున నియామకాలపై దృష్టి సారించాయి. ఖాళీల భర్తీకి భారీస్థాయిలో నోటిఫికేషన్లు కూడా వెలువరిస్తున్నాయి. ఓ సర్వే ప్రకారం మన దేశంలో ఈ ఏడాది కోటి ఉద్యోగాలు పైగా భర్తీ కానున్నాయి. నూతనంగా వృత్తి జీవితంలో అడుగుపెట్టే వారికి ఇది శుభసూచకమే. ఇంకా వృత్తిజీవితంలోకి అడుగుపెట్టని వారు ఎంత అసహనంగా ఉన్నారో ఉద్యోగాలు చేస్తున్న కొందరి పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే నైపుణ్యాలు ఉన్నప్పటికీ తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగం చేయడమే.
read more-->
అన్వేషణ కొత్త పుంతలు!
ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని అంతర్జాలంలో వెదికి పట్టుకోవడం... సామాజిక అనుసంధాన వేదికల్లో చురుగ్గా ఉండటం... అక్కడ ప్రొఫైల్స్ హుందాగా ఉంచుకోవడం... ఎంచుకున్న రంగానికి సంబంధించిన సంస్థల వెబ్‌సైట్లను అనుసరించడం.. ఆన్‌లైన్‌లో పరిచయమైన వారికి ప్రతిభ, నైపుణ్యాలను తెలియజేయడం.. వారి ద్వారా రిఫరెన్స్‌లు పొందడం.. చివరకు కలల కొలువును సాకారం చేసుకోవడం...
read more-->
మౌఖిక పరీక్షలో నెగ్గాలంటే..
శ్రీకాంత్‌కు వృత్తి జీవితానికి సరిపడా నైపుణ్యాలన్నీ ఉన్నాయి. ఉద్యోగానికి సరిపడా విద్యార్హతలున్నాయి. హుందాగా దుస్తులు ధరించి మౌఖిక పరీక్షకు హాజరయ్యాడు. రెజ్యూమెను అద్భుతంగా రూపొందించాడు. రిక్రూటర్లను ఆకట్టుకోవడానికి అన్నివిధాలా యత్నించినప్పటికీ ఉద్యోగం మాత్రం పొందలేకపోయాడు. ఇలాంటి పరిస్థితి చాలామంది ఎదుర్కొనే ఉంటారు.
read more-->
తాజాగా ఉంటేనే రాజా!
ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒకే తరహా పని. ఏళ్లు గడుస్తున్నా అదే పదవి. అదనపు బాధ్యతలు.. పదోన్నతులు లేవు. పైగా జూనియర్లు బాగా రాణిస్తున్నారు. వారితో పోటీ పడాలంటే.. అనుభవం తప్ప వారికి ఉన్నంత నైపుణ్యం లేదు. ఉద్యోగంలో స్థిరపడిన చాలా మందికి ఇదే పరిస్థితి. మారుతున్న కాలానికి తగినట్లు తమని తాము మార్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు.
read more-->
'ఇంటర్‌..వ్యూ'హం!
అభ్యర్థికి..ఉద్యోగానికి మధ్య ఓ పద్మవ్యూహం ఇంటర్వ్యూ. చాలా మందికి అది పెద్ద అవరోధంలా అనిపిస్తుంది. క్లిష్టమైనా, కష్టమైనా ఈ దశ దాటితేనే కొలువు దిశకు చేరుకునేది. ఎప్పుడు ఏ రూపంలో ఎలాంటి ప్రశ్న దూసుకొస్తుందో ఊహించలేం. అసలు ప్రశ్నలేవీ సంధించకుండానే అభ్యర్థి కథ ముగించేయొచ్చు. మరి ఇంటర్వ్యూలకు ఎలా సన్నద్ధం కావాలి అంటే...
read more-->
ఇచ్చిన గడువు సహేతుకమేనా?
వృత్తి జీవితంలో ప్రతి ఒక్కరూ సకాలంలో లక్ష్యాలు చేరుకోవాలని భావిస్తారు. దాని కోసం ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటారు. ఒక్కోసారి గడువు దగ్గర పడే సమయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. మరికొంత మంది సామర్థ్యం ఉన్నప్పటికీ ఇదిగో అదిగో అంటూ సాకులు చూపుతూ కాలం సాగదీస్తుంటారు?
read more-->
భలే మంచి రోజు..!
పని ఎలా చేస్తే కార్యాలయంలో రోజూ గొప్పగా ఉంటుంది! ఏం చేస్తే.. చేస్తున్న పనిలో పనిలో ఉత్సాహం తొణికిసలాడుతుంది! పనిలో పొరపాట్లు దొర్లకుండా ఉండాలంటే ఏం చేయాలి! ఒత్తిడి దూరంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి! సకాలంలో లక్ష్యాన్ని సాధించడం ఎలా..! ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే.. వాటిని తూచ తప్పకుండా పాటిస్తే ఆ ఉద్యోగికి అంతకు మించిన ఆనందం ఉండదు. వీటికి సమాధానాలు తెలుసుకోవడం.. తెలిసినా..
read more-->
కొలువుకు తొలి మెట్లు
కొత్తగా చదువు ముగించుకుని బయటికి వచ్చే పట్టభద్రులకు రెజ్యూమె రాయటం కత్తి మీద సాములాంటిదే! ఇది రాసే విధానంపై ఆధారపడి అభ్యర్థులను ప్రాథమిక అంచనా వేస్తాయి పెద్ద సంస్థలు. దీనిలో ఏమేం రాయాలో, ఎలా రాయాలో పరిశీలిద్దాం!
రెజ్యూమె స్వరూప స్వభావాలు విప్లవాత్మకంగా మారిపోయాయి. సూటిగా, క్లుప్తంగా, సృజనాత్మకంగా ఉండేలా రాసేవే మానవ వనరుల విభాగాన్ని త్వరగా ఆకర్షిస్తాయి!
read more-->
1 2 3 4 5 6 7 8 9 10 11 12


Ushodaya Enterprises Private Limited 2017