ఇలాగైతే అనుమానించాల్సిందే!
ఉద్యోగం పేరిట మోసపోతున్న యువత సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అంతర్జాల విస్తృతి.. నిరుద్యోగ సమస్యలను ఆసరాగా తీసుకొని యువతను మోసం చేసే వారి సంఖ్య కూడా ప్రస్తుతం ఎక్కువే. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో మోసాలు ఎక్కువగా ఉంటున్నాయి. పైగా ఈ మోసగాళ్లు కొత్తకొత్త పద్ధతులను అనుసరిస్తుండటంతో వారిని గుర్తించలేక చాలా మంది వారి వలలో చిక్కుకుంటున్నారు.
read more-->
అలా అడిగితే.. ఇలా చెప్పాలి
ఒక్కో సంస్థ ఒక్కో తీరుగా మౌఖికపరీక్ష నిర్వహిస్తుందనే విషయంపై ఉద్యోగాన్వేషణలో ఉండే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మౌఖిక పరీక్షలో ఈ తరహా ప్రశ్నలు అడుగుతారని ఎవరూ ముందుగా ఊహించలేరు. ''ఫలానా ధ్రువపత్రాలు అడుగుతారు... నేను లోపలికి వచ్చేటప్పుడు నన్ను ఈ విధంగా పరిశీలిస్తారు...''
read more-->
ఎంపిక తీరు.. మారుతోంది
ఓ సంస్థలో కీలక పదవులకు ప్రతిభావంతులు కావాలి. దీని కోసం దరఖాస్తులు ఆహ్వానించడం.. వాటిని పరిశీలించడం.. ఇంటర్వ్యూలు నిర్వహించడం.. వచ్చిన వారిలో కావాల్సిన వారిని ఎంపిక చేసుకోవడం.. ఇదీ దాదాపు అన్ని చోట్లా ఇటీవలి దాకా ఉద్యోగ నియామకాల తీరు. ప్రస్తుతం కంపెనీల నియామకాల తీరు మారింది. అభ్యర్థుల కోసం ఆయా సంస్థలు ఆన్‌లైన్‌లో, ఇతర నెట్‌వర్క్‌ల ద్వారా అన్వేషించి..
read more-->
నాయకుడు ప్రోత్సహించాలిలా
నాయకుడిగా పదవి స్వీకరించడమంటే స్వేచ్ఛ, స్వాతంత్య్రం పెరగడం కాదు.. మంచి బృందాన్ని రూపొందించుకొని ప్రతి అడుగులోనూ వారికి విజయవంతంగా మార్గదర్శకత్వం చేయగలగాలి. ఆ పదవిలో కలకాలం కొనసాగాలంటే ఆమె / అతడిలో ఆత్వవిశ్వాసం, నిజాయతీ, అంకితభావం, సానుకూల దృక్పథం తప్పకుండా ఉండాలి. ఒక్కోసారి అనుకోని రీతిలో గడువు ముంచుకొస్తూ..
read more-->
ఇలాగైతే దూసుకెళ్లొచ్చు
కార్యాలయంలో రోజూ ఒకే పనితీరు. సమయానికి వెళ్లడం.. చెప్పిన పని చేయడం.. కార్యాలయ వేళలు ముగిశాక ఇంటికి రావడం.. వంటి తరహాతో చాలా మందికి ఉద్యోగంపై విసుగు, నిరాసక్తత తలెత్తుతూ ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా మంది బలవంతంగా పని చేసుకుపోతూ ఉంటారు. దీనివల్ల వృత్తి జీవితంలో ఆనందం దూరమవుతుంది. కనుక ఉద్యోగ జీవితంలో విసుగు కలిగే పరిస్థితి తలెత్తకుండా ముందు నుంచీ జాగ్రత్తపడాలి.
read more-->
సానుకూలమే అనుకూలం
సానుకూల దృక్పథంతో ఆలోచించినపుడే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలరు. సృజనాత్మకత ఉట్టిపడే అలాంటి వారితో పనిచేయడానికి సహచరులంతా ఎంతో ఉత్సాహం చూపుతారు. ప్రతికూల ఆలోచనల వల్ల సమయం వృథా అవడమే కాదు ఒకే చట్రంలో ఉండి ఆలోచనలు విస్తరించుకోలేని పరిస్థితికి చేరుకుంటారని నిపుణులు చెబుతున్నారు.
read more-->
అక్కడి సంస్కృతి తెలుసా?
ఉద్యోగం వచ్చిందంటే చాలు.. దాదాపు కష్టాలన్నీ తీరిపోయిననట్టేనని చాలా మంది భావిస్తుంటారు. ఇది సరికాదు. కొలువు దక్కడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం.. అందులో రాణించడం ప్రధానం. సకాలంలో లక్ష్యాలను సాధించడం చాలా ముఖ్యం. కొలువు వచ్చిన కొత్తలో ఉద్యోగి ప్రవర్తన, పనితీరు అతని కెరియర్‌పై ప్రభావం చూపుతాయి. పనిలో రాణిస్తే చాలు సంస్థలో గౌరవం, పదోన్నతులు దక్కుతాయన్న భావనలో కొందరుంటారు.
read more-->
అచేతనంగా ఉండొద్దు
పనితీరుని మరింత మెరుగుపరచుకోవడానికి మీరేమైనా కసరత్తులు చేస్తున్నారా? అసలు వృత్తిజీవితాన్ని ఆస్వాదిస్తున్నారా? పనితీరు పట్ల సంతృప్తి చెందుతున్నారా? వీటంన్నింటికి అవును సమాధానమైతే మీ కెరియర్‌ విజయపథంలో దూసుకెళ్తున్నట్లే. సమాధానం చెప్పడానికి కాస్తంత ఆలోచన చేసినా మీరు సాధించాల్సింది చాలా ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు.
read more-->
స్వదేశీ నిపుణులకే ప్రాధాన్యం
కొన్ని నెలల కిందట ఓ ప్రముఖ సంస్థలో ఉన్నత పదవికి నిపుణులను ఆహ్వానించారు. దీనికి ఇద్దరు ప్రవాస భారతీయులు, ఒక విదేశీయుడు దరఖాస్తు చేయగా.. ఒకరిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అది తుది దశకు చేరింది. ఇంతలో రూపాయి విలువ పడిపోయింది.
read more-->
మీ గురించి తెలుసుకోండి!
వృత్తి జీవితంలో పనితీరుకి సంబంధించి అనుకూల, ప్రతికూల వాతావరణం సహజంగానే ఉంటుంది. ఒకవేళ మీ పనితీరుకి సంబంధించి ఫీడ్‌బ్యాక్‌ ఎవరిచ్చినా.. ప్రతికూల పరిస్థితుల్లోనైనా దాన్ని ఆనందంగా అంగీకరించండి.
read more-->
తెలియకుండా.. శోధిస్తారు
కలల కొలువులోకి అడుగుపెట్టడానికి ఎంతో ఆత్మవిశ్వాసంతో మౌఖిక పరీక్షకు హాజరవుతారు. రిక్రూటర్లను ఆకట్టుకోవడానికి తమ నైపుణ్యం, అర్హతలు, తెలివితేటలు, సమయస్ఫూర్తి అన్నింటినీ రంగరిస్తారు. అదే సమయంలో రిక్రూటర్లు కూడా తమ నైపుణ్యంతో అభ్యర్థులను తికమకకు గురిచేస్తారు.
read more-->
ఇలా ప్రయత్నించండి
తగిన విద్యార్హతలు.. నైపుణ్యాలున్నా ఈ రోజుల్లో ఆశించిన కొలువు వెంటనే దొరకడం కష్టం. ముఖ్యంగా ఉద్యోగ అనుభవం లేని వారి పరిస్థితి మరీ కష్టంగా ఉంటుంది. అయినా సరే.. ఉద్యోగ వేటలో కొన్ని పద్ధతులు పాటించడంతో పాటు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటే కోరుకున్న ఉద్యోగాన్ని వెంటనే సాధించొచ్చు.
read more-->
రెజ్యూమెకు నకలు కావద్దు
ఉద్యోగాన్వేషణలో రెజ్యూమెతో పాటు ప్రస్తావన లేఖ కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీని విషయంలో పలువురు నిర్లక్ష్యం చూపడం వల్ల సులభంగా వచ్చే అవకాశాలను కఠినం చేసుకుంటున్నారు. పూర్తి వివరాలు రెజ్యూమెలో పొందుపరుస్తున్నాం కదా, ఇక ప్రస్తావన లేఖ ఎందుకు అనే ధోరణి ఎక్కువ మందిలో ఉంటోంది.
read more-->
ఇప్పటికీ మించిపోలేదు..
కలలు కనడం ఎంత సహజమో.. అలాగే ప్రతి ఒక్కరికీ కలల కొలువు అంటూ ఒకటి తప్పకుండా ఉంటుంది. విద్యార్థి దశ నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తే ఆశించిన ఉద్యోగం వెంటనే దొరుకుతుంది. అయితే చాలా మంది అలా చేయరు. డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయినట్లు..
read more-->
కొలువులో చేరిన తొలి రోజుల్లో...
ఎట్టకేలకు ఉద్యోగం వచ్చింది. అది మీ కలల కొలువు కావచ్చు.. కాకపోవచ్చు. కానీ తొలి ఉద్యోగానికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. ఉద్యోగం సాధించడంతోనే సంపూర్ణ విజయం దక్కినట్లు కాదు. ఆ ప్రయాణాన్ని అర్థవంతంగా కొనసాగించడమూ ఎంతో ముఖ్యం. అందుకు తొలిరోజుల్లో అనుసరించాల్సిన ప్రణాళిక కీలకం.
read more-->
నిమిషంలో అటో..ఇటో
రెజ్యూమె తయారీ పూర్తయిందా? దాన్ని రిక్రూటర్లు లేదా సంస్థలకు పంపుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఆ రెజ్యూమెను చివరిసారిగా ఓ 30 సెకన్లపాటు పరిశీలించండి. మీరే రిక్రూటర్‌ అయితే ఆ రెజ్యూమెలో ఏయే అంశాలు ఉండాలని కోరుకుంటారో.. ఆ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలి.
read more-->
1 2 3 4 5 6 7 8 9 10 11 12


Ushodaya Enterprises Private Limited 2017