నేరుగా మాట్లాడేది 60 శాతమే

కార్యాలయంలో సాధారణంగా ఉద్యోగుల తీరు ఒకొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. విదేశాలతో పోల్చితే వైవిధ్యంగా ఉంటుంది. ఉద్యోగుల మధ్య వస్త్రధారణ, కమ్యూనికేషన్‌, పని చేసే తీరు, సహోద్యోగులను పట్టించుకొనే వైఖరి ఏమేరకు ఉందనేది ఆసక్తికరం. ఇవే విషయాలను తెలుసుకొనేందుకు ఉద్యోగులు, ఉద్యోగాలకు సంబధించిన వెబ్‌సైట్‌ కెరీర్‌బిల్డర్‌ ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. అమెరికా, భారత్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, చైనా, జర్మనీ, ఇటలీ, జపాన్‌, రష్యా, బ్రిటన్‌లలో మూడు వేల మంది దాకా ఉద్యోగులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ సర్వే వివరాలు..

కమ్యూనికేషన్‌
చైనా: ఇక్కడి ఉద్యోగులు ప్రత్యక్షంగా మాట్లాడేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సహోద్యోగులైనా, ఉన్నతాధికారులైనా మౌఖికంగానే మాట్లాడేందుకు ఆసక్తి చూపుతారు. మొత్తానికి ఈ దేశంలో 81 శాతం మంది ఉద్యోగుల తీరు ఇలాగే ఉంటుంది. రష్యాలో 80 శాతం మంది, ఫ్రాన్స్‌లో 79 శాతం మంది.. బ్రిటన్‌లో 68 శాతం మంది ఇలాగే వ్యవహరిస్తూ ఉంటారు.
భారత్‌లో: 60 శాతం మంది భారతీయులు మౌఖిక సంప్రదింపులు జరిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కిన వారిలో ఎక్కువ శాతం మంది ఆన్‌లైన్‌లో, ఫోన్‌లో మాట్లాడుతుంటారు. 17 శాతం మంది ఫోన్‌లో 23 శాతం మంది ఆన్‌లైన్‌లో సంప్రదింపులు జరుపుతుంటారని అంచనా.

వస్త్రధారణ
భారత్‌లో.. ఎక్కువ మంది కార్యాలయానికి వెళ్లేటపుడు బిజినెస్‌ ఫార్మల్స్‌ ధరించేందుకే ఆసక్తి చూపుతున్నారు. 50 శాతం మంది ఈ పార్మల్స్‌ను ఎంచుకుంటారు. 36 శాతం మంది సాధారణ దస్తుల్లో కార్యాలయాలకు వెళ్తుంటారు.
11 శాతం మంది అమెరికన్లు ఫార్మల్స్‌లో కార్యాలయాకు వెళ్తుండగా.. 64 శాతం మంది బిజినెస్‌ ఫార్మల్స్‌ ధరిస్తున్నారు. చైనాలో 38 శాతం మంది, జపాన్‌లో 37 శాతం మంది బిజినెస్‌ ఫార్మల్స్‌లో కార్యాలయాలకు వెళ్తుంటారు.
ఇంట్లో కార్యాలయ పని
భారత్‌లో ఎక్కువ మంది కార్యాలయంలో పనిని అక్కడే పూర్తి చేసి ఇంటికి వెళ్లాలని భావిస్తున్నారు. ఇక్కడ 29 శాతం మంది ఉద్యోగులు కార్యాలయ పనిని అక్కడే పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. బ్రిటన్‌లో 26 శాతం మంది తీరు కూడా భారతీయుల్లాగానే ఉంటోంది.
జపాన్‌లో 60 శాతం మంది ఉద్యోగులు కార్యాలయ పనిని ఇంట్లో కూడాపూర్తి చేసుకోవచ్చని భావిస్తున్నారు. దీంతో వారు కార్యాలయ పనిని అక్కడే పూర్తి చేయకుండా ఇంటికికీ తీసుకెళ్తున్నారు. ఇక ఇటలీలోనూ ఇంతే. ఇక్కడ 43 శాతం మందిదీ ఇదే తీరు.
విధులు ముగిశాక..
భారత్‌లో 93 శాతం మంది కార్యాలయంలో విధులు ముగిశాక కూడా సహోద్యోగులతో కలిసి ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. చైనాలో దాదాపు ప్రతి ఉద్యోగి తీరూ ఇలాగే ఉంటోంది. ఇక్కడ 98 శాతం మంది ఉద్యోగులు సహోద్యోగులను తమకు సన్నిహితులుగా భావిస్తుంటారు.
అమెరికా, జర్మనీల్లో కార్యాలయంలో విధులు ముగిశాక సహోద్యోగులను పట్టించుకొనేవారు చాలా తక్కువ. జర్మనీలో 38 శాతం మంది సహోద్యోగులను పట్టించుకోవడం లేదు. అమెరికాలో 41 శాతం మందిదీ జర్మనీలో ఉద్యోగుల తీరే.
సరాసరి పని వేళలు
40-50 గంటలు: భారత్‌లో ఒక్కో ఉద్యోగి సరాసరి వారానికి 40 నుంచి 50 గంటల పాటు పని చేస్తారు. ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, రష్యా, జపాన్‌, బ్రెజిల్‌, అమెరికాల్లోనూ ఇలాగే ఉంటుంది.
31-40 గంటలు: చైనా, బ్రిటన్‌లలో సరాసరి ఒక్కో ఉద్యోగి 30 నుంచి 40 గంటలు మాత్రమే పని చేస్తారు.


 
 
 
 
Ushodaya Enterprises Private Limited 2017