ఫోన్లో మాట్లాడేటపుడు

ఎవరైనా సరే సంస్థ నుంచి వచ్చే ఫోన్ తీయగానే ఆ సమయానికి తగినట్లు గుడ్ మార్నింగ్/ఆఫ్టర్‌నూన్/ఈవెనింగ్ చెప్పాలి.

మీరు ఉన్నతాధికారికి ఫోన్ చేసినపుడు మాట్లాడటానికి ఇది సరైన సమయమేనా అడగాలి. లేకుంటే ఫలానా అంశంపై మీతో మాట్లాడాలని ఉంది. అని సందేశం ఇస్తే వారే మీకు ఫోన్ చేయొచ్చు.

ఇక్కడ మీ సమాధానాలు, ప్రశ్నలు నేరుగానే ఉండాలి. డొంక తిరుగుడు పనికిరాదు.

అవతలివారు మాట్లాడటానికి సమయమివ్వండి. వారు చెబుతున్నపుడు మౌనంగా ఉండకుండా సందర్భానుసారం అవునా.. సరే. అంటూ స్పందించాలి.

అవతలి వ్యక్తిని ఎక్కువసార్లు పేరుపెట్టి పిలవకూడదు. 8నుంచి 10నిమిషాలకు 3సార్లు పిలిస్తే చాలు. సంభాషణ వీలైనంత సంక్షిప్తంగా ఉండాలి.