Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
POLYCET - 2016 Mock Counselling

TS POLYCET - 2016 Mock Counselling

  • Telangana
  • TS POLYCET - 2016 Mock Counselling

  • Andhra Pradesh
  • >> 3 నుంచి పాలిసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌

    ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి చివరి విడత కౌన్సెలింగ్‌ జులై 3 నుంచి ప్రారంభమవుతుందని తెలంగాణ పాలిసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో 25,684సీట్లు భర్తీ కాగా 24,948సీట్లు ఖాళీగా ఉన్నాయి. తుదివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా 3న ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. 3, 4వ తేదీల్లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలి. 6న సీట్లు కేటాయిస్తారు. 8లోపు ఫీజు చెల్లించి కళాశాలల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

    >> 15 నుంచి ఏపీ పాలిటెక్నిక్ తరగతులు

    * తొలివిడత కౌన్సెలింగ్‌లో 41,360 మందికి సీట్లు
    * కన్వీనర్ కోటాలో ఇంకా 43,423 సీట్లు ఖాళీ

    ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాలీసెట్-2015కు అర్హత సాధించిన విద్యార్థులకు నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు పూర్తయింది. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలీసెట్‌లో మొత్తం 81,069 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో భాగంగా 45,059 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాగా.. 43,996 మంది మాత్రమే ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 41,360 మందికి సీట్లు లభించాయి. కన్వీనర్ కోటాలో ఇంకా 43,423 సీట్లు మిగిలాయి. ఏపీ సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి మాట్లాడుతూ.. సీట్లు పొందిన విద్యార్థులు 'ఏపీ పాలీసెట్' వెబ్‌సైట్ ద్వారా 'సెల్ఫ్ రిపోర్టింగ్' చేయవచ్చని తెలిపారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటు పట్ల సంతృప్తిచెందని విద్యార్థులు మలివిడత కౌన్సెలింగ్‌లోనూ పాల్గొనవచ్చని సూచించారు. జులై 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని ఆమె చెప్పారు. తొలివిడత కౌన్సెలింగ్ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన సీట్ల వివరాలు..


    >> 25 నుంచి టీఎస్ పాలీసెట్ ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న‌
    హైదరాబాద్: తెలంగాణలోని పాలీసెట్ ధ్రువపత్రాల పరిశీలన జూన్ 25 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. జూన్ 28 నుంచి జులై 1 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 2వ తేదీన ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చని వివరించారు. 5వ తేదీన సీట్లను కేటాయించి పాలీసెట్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. వికలాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కేటగిరీలకు చెందినవారికి జూన్ 25, 26 తేదీల్లో మాసాబ్ ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వెల్లడించారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా దాదాపు 60వేల సీట్లను భర్తీ చేయనున్నారు.