ప‌దో త‌ర‌గ‌తి మార్కుల‌తో 2286 పోస్ట‌ల్ ఉద్యోగాలు

ఏపీ పోస్టల్‌ సర్కిల్‌ పరిధిలో ఉద్యోగాల భర్తీకి తాజాగా ప్రకటన విడుదలైంది. ఈ సర్కిల్‌కు సంబంధించి గతంలో విడుదలైన 1126 పోస్టుల ఫలితాలను ప్రభుత్వం రద్దుచేసింది. పాత ఖాళీలతో కలిపి కొత్తగా ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించనవసరం లేదు.

పోస్టు: గ్రామీణ్ డాక్ సేవ‌క్ (జీడీఎస్‌)- బీపీఎం, ఎండీ, ఎంసీ, ప్యాక‌ర్‌.
ఖాళీలు: 2286
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌, కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం.
వ‌య‌సు: 18-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక: అక‌డ‌మిక్ ప్రతిభ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 24.05.2018

Posted on 25-04-2018