తెలంగాణ పోస్టల్ స‌ర్కిల్‌లో 136 పోస్ట్‌మ‌న్‌, మెయిల్‌గార్డ్ ఖాళీలు

తెలంగాణ పోస్టల్ స‌ర్కిల్ ప‌రిధిలోని వివిధ తపాలా డివిజ‌న్లు, ఆర్ఎంఎస్ యూనిట్లలో ఖాళీగా ఉన్న పోస్ట్‌మ‌న్‌, మెయిల్‌గార్డ్ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌లైంది.
వివ‌రాలు.....
పోస్టు: పోస్ట్‌మ‌న్‌, మెయిల్‌గార్డ్
మొత్తం ఖాళీలు: 136 (పోస్ట్‌మ‌న్‌-132, మెయిల్‌గార్డ్‌-04)
డివిజన్ల వారీ పోస్ట్‌మ‌న్‌ ఖాళీలు: హైదరాబాద్ సిటీ-23, హైదరాబాద్ సౌత్ ఈస్ట్-30, సికింద్రాబాద్-15, సంగారెడ్డి-04, మెదక్-03, ఆదిలాబాద్-09, హన్మకొండ-07, కరీంనగర్-08, ఖమ్మం-11, మహబూబ్ నగర్-01, నల్గొండ-01, నిజామాబాద్-05, పెద్దపల్లి-06, సూర్యాపేట-04, వనపర్తి-01, వరంగల్-04.
డివిజన్ల వారీ మెయిల్‌గార్డ్‌ ఖాళీలు: హైదరాబాద్ ఆర్ఎంఎస్ డివిజన్-04.
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌.
వ‌య‌సు: 21.04.2018 నాటికి 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక‌: రాత‌ప‌రీక్ష ద్వారా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: అప్లికేషన్‌ ఫీజు రూ.100, పరీక్ష ఫీజు రూ.400. అందరు అభ్యర్థులూ ప‌రీక్ష ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్‌లైన్‌లో ప్రాథమిక వివరాల నమోదుకు చివరి తేది: 21.04.2018
హెడ్‌ పోస్టాఫీసుల్లో ఫీజు చెల్లించడానికి చివరి తేది: 25.04.2018
ఆన్‌లైన్‌లో తుది దరఖాస్తుకు చివరి తేది: 28.04.2018

Posted on 22-03-2018

Exam Resources