RBI - Officers in Grade ‘B’ - Notification

ఆర్‌బీఐలో 161 ఆఫీస‌ర్ గ్రేడ్‌-బి పోస్టులు

- ఆన్‌లైన్ ప‌రీక్షలు, ఇంట‌ర్వ్యూల ద్వారా నియామ‌కాలు
- డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 161 ఆఫీస‌ర్ గ్రేడ్‌-బి పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన‌వారు వీటికి పోటీప‌డ‌వ‌చ్చు. ఆన్‌లైన్‌లో రెండు ద‌శ‌ల్లో నిర్వహించే ప‌రీక్షలు, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. డిగ్రీ ఉత్తీర్ణులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

విద్యార్హత‌లు:
డీఆర్ (జ‌న‌ర‌ల్ ) పోస్టుల‌కు: 60 శాతం మార్కుల‌తో డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 50 శాతం) దీంతోపాటు ఇంట‌ర్‌/ డిప్లొమా, ప‌దోత‌ర‌గ‌తిలోనూ 60 శాతం మార్కులు సాధించాలి.
డీఆర్ (డీఈపీఆర్‌) పోస్టుల‌కు: క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఎక‌నామిక్స్‌, ఫైనాన్స్ సంబంధ కోర్సుల్లో పీజీ ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 50 శాతం మార్కులు.
డీఆర్ (డీఎస్ఐఎం) పోస్టుల‌కు: స్టాటిస్టిక్స్‌/ మ్యాథ‌మెటిక‌ల్ స్టాటిస్టిక్స్‌/ మ్యాథ‌మెటిక‌ల్ ఎక‌నామిక్స్‌/ ఎక‌నామెట్రిక్స్‌/ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ (ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌) / అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ (ఐఐటీ బాంబే) వీటిలో ఏదైనా కోర్సులో 55 శాతం మార్కుల‌తో పీజీ ఉత్తీర్ణత లేదా 55 శాతం మార్కుల‌తో మ్యాథ్స్‌లో పీజీతోపాటు క‌నీసం ఏడాది వ్యవ‌ధి ఉండే పీజీ డిప్లొమా ఇన్ స్టాటిస్టిక్స్ కోర్సు పూర్తి చేయాలి. లేదా ఇండియ‌న్ స్టాటిస్టిక‌ల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి క‌నీసం 55 శాతం మార్కుల‌తో ఎంస్టాట్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. లేదా ఐఎస్ఐ కోల్‌క‌తా, ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌, ఐఐఎం కోల్‌క‌తా మూడు సంస్థలూ క‌లిసి అందిస్తోన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ ఎన‌లిటిక్స్ కోర్సును క‌నీసం 55 శాతం మార్కుల‌తో పూర్తిచేయాలి.

వ‌యోప‌రిమితి: మే 1, 2017 నాటికి 21 - 30 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి. అంటే మే 2, 1987 కంటే ముందు; మే 1, 1996 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు. ఎంఫిల్ పూర్తిచేసిన‌వారికి 32 ఏళ్లు, పీహెచ్‌డీ అభ్య‌ర్థుల‌కు 34 ఏళ్లుగా గ‌రిష్ఠ వ‌యోప‌రిమితి ఉంటుంది. బోధ‌న‌లో అనుభ‌వం
ఉన్న‌వారికి మూడేళ్ల స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌యో స‌డ‌లింపు వ‌ర్తిస్తుంది.

గ్రేడ్‌-బి డీఆర్ (జ‌న‌ర‌ల్ )
ఫేజ్‌-1 ప‌రీక్ష ఇలా...
ప‌రీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ త‌ర‌హాలో 200 మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది. జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజ‌నింగ్ అంశాల నుంచి ప్రశ్నలు వ‌స్తాయి. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు.
అభ్యర్థులు త‌ర్వాత ద‌శ (ఫేజ్‌-2)కు ఎంపిక కావాలంటే ఫేజ్‌-1లో ప్రతి సెక్షన్ నుంచి క‌నీస క‌టాఫ్ మార్కుల‌ను సాధించాల్సి ఉంటుంది. అలాగే అన్ని సెక్షన్లూ క‌లుపుకుని క‌నీస మార్కులు సాధించాలి. ఆయా విభాగాల్లో ఖాళీల‌కు అనుగుణంగా మెరిట్ ప్రాతిప‌దిక‌న త‌ర్వాత ద‌శ‌కు ఎంపిక చేస్తారు. ఫేజ్‌-1 నిర్వహించిన వారం రోజుల త‌ర్వాత ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఫ‌లితాలు వెల్లడిస్తారు.

ఫేజ్‌-2 ఇలా...
ఈ ప‌రీక్ష కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. మొత్తం 3 పేప‌ర్లు ఉంటాయి.
పేప‌ర్‌-1 ఎక‌నామిక్ అండ్ సోష‌ల్ ఇష్యూస్ అంశంపై ఉంటుంది. ప్రశ్నల‌న్నీ ఆబ్జెక్టివ్ త‌ర‌హాలోనే వ‌స్తాయి. ప‌రీక్ష వ్యవ‌ధి 90 నిమిషాలు. ప్రశ్నప‌త్రానికి 100 మార్కులు కేటాయించారు.
పేప‌ర్‌-2 ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్‌పై నిర్వహిస్తారు. డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఈ ప‌రీక్ష వ్యవ‌ధి 90 నిమిషాలు. మార్కులు వంద‌.
పేప‌ర్‌-3 ఫైనాన్స్ అండ్ మేనేజ్‌మెంట్ అంశాల్లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ త‌ర‌హా ప్రశ్నలు వ‌స్తాయి. ప‌రీక్ష వ్యవ‌ధి 90 నిమిషాలు. వంద మార్కుల‌కు ప్రశ్నప‌త్రం ఉంటుంది.
ఇంగ్లిష్ పేప‌ర్ మిన‌హా మిగిలిన ప్రశ్నప‌త్రాల‌న్నీ ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.

ఇంట‌ర్వ్యూ...
ఫేజ్‌-2 (పేప‌ర్ 1 + పేప‌ర్ 2 + పేప‌ర్ 3) లో చూపిన ప్రతిభ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంట‌ర్వ్యూకు 50 మార్కులు కేటాయించారు. ఇంగ్లిష్‌, హిందీ భాష‌లో ఇంట‌ర్వ్యూలో స‌మాధానం చెప్పవ‌చ్చు. ఫేజ్ 2 + ఇంట‌ర్వ్యూల్లో సాధించిన మార్కుల ద్వారా తుది నియామ‌కాలు చేప‌డ‌తారు.

వేత‌న శ్రేణి: రూ. 35150 - 62400. ఎంపికైన‌వాళ్లు వేత‌న రూపంలో ఆరంభంలోనే నెల‌కు రూ.68 వేల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు.

ఖాళీల వివ‌రాలు:
ఆఫీస‌ర్ గ్రేడ్‌-బి జ‌న‌ర‌ల్‌: 149 (అన్ రిజ‌ర్వ్‌డ్ 73, ఓబీసీ 39, ఎస్సీ 22, ఎస్టీ 11)
ఆఫీస‌ర్ గ్రేడ్‌-బి డీఈపీఆర్‌: 12 (జ‌న‌ర‌ల్ 9, ఓబీసీ 3)
ఆఫీస‌ర్ గ్రేడ్‌-బి డీఎస్ఐఎం: (జ‌న‌ర‌ల్ 1, ఎస్సీ 1, ఎస్టీ 2)

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ ద‌రఖాస్తుల ప్రారంభం: మే 3
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మే 23
ఫేజ్ 1 ప‌రీక్ష తేదీ: జూన్ 17
ఫేజ్ 2 ప‌రీక్ష తేదీ: జ‌న‌ర‌ల్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారికి జులై 7న ఫేజ్‌-2 ప‌రీక్ష నిర్వహిస్తారు. డీఈపీఆర్‌, డీఎస్ఐఎం పోస్టుల‌కు పేప‌ర్ 2, 3 ప‌రీక్షలు జులై 6 లేదా 7 లేదా 6,7 తేదీల్లో నిర్వహిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌ల్లో ఫేజ్‌-1 ప‌రీక్ష కేంద్రాలు: గుంటూరు, న‌ర‌సారావుపేట‌, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, క‌డ‌ప‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, రాజమండ్రి, కాకినాడ‌, తిరుప‌తి, చిత్తూరు, విజ‌య‌వాడ‌, కంచిక‌చెర్ల, గుడ్లవెల్లూరు, ఏలూరు, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.
ప‌రీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.వంద; జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్యర్థుల‌కు రూ.850.

సిల‌బ‌స్ అండ్ రిఫ‌రెన్స్ బుక్స్‌
నోటిఫికేష‌న్‌
అప్లై ఆన్‌లైన్: http://ibps.sifyitest.com/rbisbogbgapr17/