Home
Mathematics
Reasoning
General Science
GK & Current Affairs
Online Exams


కేవలం పదో తరగతి లేదా ఐటీఐతో రైల్వేలో ఉద్యోగాన్ని పొందడానికి ఆర్ఆర్‌బీ రాత పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండవు. రాత పరీక్షల్లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. (నోటిఫికేషన్ నెం: RRC/SCR/Group-D/1/2012)
దరఖాస్తులు చేరాల్సిన చివరితేదీ: 17-09-2012
పోస్టులు:1250

1. అసిస్టెంట్ కుక్ / బేరర్ / కమర్షియల్ పోర్టర్ - 18
2. ట్రాక్‌మ్యాన్ - 541
3. హెల్పర్ - II - 465
4. సఫాయీవాలా - 14
5. అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్ - 212
ఈ పోస్టులకు మొదట దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి దీన్లో అర్హత సాధించిన వారిని రాత పరీక్షలకు ఆహ్వానిస్తారు. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో సాగుతుంది. దీన్లో జనరల్‌నాలెడ్జ్/ అవేర్‌నస్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, రీజనింగ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఇవి పదో తరగతి స్థాయిలో ఉంటాయి. రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారి సర్టిఫికెట్లు తనిఖీ చేసి, వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Assistant Personnel Officer (Recruitment),
Railway Recruitment Cell,
1st Floor, ‘C’ Block,
Rail Nilayam, South Central Railway,
Secunderabad – 500 071.
Download Application Form
Download Notification