Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home

 

బ్యాంకు ఉద్యోగం... భలే అవకాశం!
ఆకర్షణీయమైన జీతంతో ఆహ్వానం పలుకుతూ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భారీ సంఖ్యలో క్లర్కు ఉద్యోగాల నియామకాలకు ప్రకటన జారీచేసింది. డిగ్రీ అర్హత ఉంటే మీరూ పోటీపడొచ్చు. ఉద్యోగార్థులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనిపిస్తోందా? అయితే చదవండి, మెలకువలు పాటించండి... కొలువు సాధించండి!
ఆంధ్రప్రదేశ్‌లో 1900కు పైగా, తెలంగాణలో 600కు పైగా క్లర్కు పోస్టులను ఎస్‌బీఐ భర్తీ చేయబోతోంది. అంటే తెలుగు రాష్ట్రాల వరకూ చూసినా మొత్తం సుమారు 2500కు మించిన కొలువులు! ప్రస్తుత ప్రకటనలో రెండు క్యాటగిరీల ఉద్యోగాలను పేర్కొన్నారు. 1) జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌) 2) జూనియర్‌ అగ్రికల్చరల్‌ అసోసియేట్‌.

Read more..
 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 17140 ఖాళీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్, జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు....
జూనియర్ అసోసియేట్
విభాగం: కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్
పోస్టుల సంఖ్య: కరెంట్ 10726, బ్యాక్‌లాగ్ 3218, మేఘాలయ, కాశ్మీర్ వ్యాలీ 188
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కేటాయించినవి: 1385, 431; బ్యాక్‌లాగ్ 204, 72.
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి.
వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్
పోస్టుల సంఖ్య: కరెంట్ 3008
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఖాళీలు: 387, తెలంగాణ 108
అర్హతలు: అగ్రికల్చర్/ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్‌లో డిగ్రీ ఉండాలి. చివరి ఏడాది డిగ్రీ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ ద్వారా.
రాత పరీక్ష విధానం: ప్రాథమిక పరీక్ష మొత్తం మార్కులు 100. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 మార్కులు, న్యుమరికల్ ఎబిలిటీ 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులు. దీనిలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ నిర్వహిస్తారు. మెయిన్స్ మొత్తం మార్కులు 200. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 50 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ 40 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 60 మార్కులు. త‌ప్పు స‌మాధానానికి నెగెటివ్ మార్కు ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు: రూ.600 ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఏప్రిల్ 5
చివరితేది: ఏప్రిల్ 25
నోటిఫికేషన్

posted on 4.4.2016