Subjects

దేశ బ్యాంకింగ్‌ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఉన్నత స్థానంలో ఉన్న అతిపెద్ద వాణిజ్య బ్యాంకు భారతీయ స్టేట్‌ బ్యాంకు. దీనిలో పీఓగా చేరే అవకాశం ఉద్యోగార్థులకు వచ్చింది. చిత్తశుద్ధితో దీక్షగా సిద్ధమై పోటీలో ముందుకువెళ్తే గౌరవప్రదమైన ఈ ఉద్యోగాన్ని గెలుచుకోవచ్చు!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1897 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్లు.
మొత్తం ఖాళీలు: 1897 (వీటిలో జనరల్- 758, ఓబీసీ-405, ఎస్సీ- 235, ఎస్టీ- 439, వీహెచ్-29, ఓహెచ్- 31 ఉన్నాయి).
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులే.
వయసు: 2014 ఏప్రిల్ 1 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా.
* ఫేజ్-1: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్). ఇది ఆన్‌లైన్‌లో జరగుతుంది. ఇది పూర్తయిన వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్. (పేపర్/ పెన్ విధానం).
* ఫేజ్-2: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ ఎస్సీ/ పీడబ్ల్యూడీ కేటగిరీలకు చెందిన వారు రూ.100లను ఫీజు కింద ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం.
* ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు: చివరి తేదీ: ఏప్రిల్ 25.
* ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లింపు : ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 28 వరకు.