వివరంగా...
అభ్యర్థి ఒక రాష్ట్రానికి, ఒక బ్యాంకుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ ఆ రాష్ట్రంలో ఆ బ్యాంకుకు పోస్టులు లేకపోతే పోస్టులున్న బ్యాంకుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఉదా. మన రాష్ట్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్ బ్యాంకులకు మాత్రమే పోస్టులున్నాయి. కాబట్టి మన రాష్ట్రంలో ఈ మూడు బ్యాంకుల్లో ఏదో ఒక బ్యాంకుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అంతేగాని మన రాష్ట్రంలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుపడదు- ఆ రెండు బ్యాంకులకు మన రాష్ట్రంలో ఖాళీల్లేవు కాబట్టి. అదేవిధంగా అభ్యర్థి ఏ రాష్ట్రంలో ఉద్యోగం కోరుకుంటున్నాడో కచ్చితంగా ఆ రాష్ట్రానికి చెందిన పరీక్షా కేంద్రం నుంచి మాత్రమే పరీక్షకు హాజరు కావల్సి ఉంటుంది.
మెరిట్ లిస్టులు క్యాటగిరీల వారీగా, బ్యాంకుల వారీగా, రాష్ట్రాల వారీగా తయారుచేస్తారు. ఉదాహరణకు ఒ.బి.సి. క్యాటగిరీకి హాజరయిన అభ్యర్థుల్లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్ కోసం ఒక మెరిట్ లిస్టు తయారుచేస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఒ.బి.సి. అభ్యర్థులు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కోసం దరఖాస్తు చేసి ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రాస్తే, వారిని మన రాష్ట్రానికి చెందిన ఒ.బి.సి. అభ్యర్థుల జాబితాలో కలపరు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడిగా ఆయా బ్యాంకుల వారీగా- క్యాటగిరీల వారీగా- మెరిట్ జాబితా రూపొందిస్తారు.
ఎంపికయిన అభ్యర్థుల ప్రారంభ జీతం సుమారు నెలకు రూ. 14,200 ఉంటుంది. దరఖాస్తుదారులకు విద్యార్హత 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత లేదా ఏదయినా గుర్తింపు పొందిన డిగ్రీ పాసై ఉండాలి.
అభ్యర్థులు ఏ రాష్ట్రానికి దరఖాస్తు చేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ భాష తెలిసి ఉండటం అవసరం. ఇంటర్వ్యూ సమయంలో ప్రాంతీయ భాషలో అభ్యర్థికి ఉన్న ప్రావీణ్యాన్ని పరీక్షిస్తారు.
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు 01.08.2012 నాటికి కనిష్ట వయసు 18 సంవత్సరాలు. గరిష్ఠ పరిమితి 28 సంవత్సరాలు..
ఎంపికయిన అభ్యర్థులకు ప్రొబేషన్ కాలపరిమితి ఆర్నెల్లు. ఈ ఆరు నెలల కాలంలో సంతృప్తికరంగా పనిచేయలేకపోతే ప్రొబేషన్ కాలపరిమితి పొడిగించే అవకాశం ఉంటుంది.
పరీక్షల వేదికలు.. ఎంపిక తీరు...
ఎంపిక విధానం రెండు దశల్లో ఉంటుంది. 1. ఆబ్జెక్టివ్ రాత పరీక్ష 2. ఇంటర్వ్యూ. రాత పరీక్షలో ఐదు విభాగాలు- 1. జనరల్ అవేర్‌నెస్ 2. జనరల్ ఇంగ్లిష్ 3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 4. రీజనింగ్ ఎబిలిటీ 5. మార్కెటింగ్ ఆప్టిట్యూడ్/ కంప్యూటర్ నాలెడ్జి
అభ్యర్థుల సంఖ్యను బట్టి ఆయా విభాగాల్లో వారి సామర్థ్యం, వచ్చే మార్కుల ఆధారంగా ప్రతి విభాగానికీ కనీస మార్కులు విడివిడిగా బ్యాంకు నిర్ణయిస్తుంది. అభ్యర్థులు తప్పనిసరిగా ఆ కనీస మార్కులు సాధించవలసి ఉంటుంది. రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు పరిగణనలోకి తీసుకుని మెరిట్ లిస్ట్ తయారుచేస్తారు.
అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు సాధించే విషయంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలో 5 శాతం సడలింపు ఉంటుంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులలో నుంచి మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకు ఒక ఖాళీకి ముగ్గురు అభ్యర్థులను(1:3) చొప్పున పిలుస్తారు.
మనరాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు నాలుగు. 1. హైదరాబాద్ 2. తిరుపతి 3. విజయవాడ 4. విశాఖపట్నం. అసలు ఖాళీలు ప్రకటించని రాష్ట్రాల్లో పరీక్షను నిర్వహించరు. అంటే ఖాళీలు ప్రకటించిన రాష్ట్రాల్లో మాత్రమే రాత పరీక్ష జరుగుతుంది.
రాత పరీక్ష తేదీలు 7.10.2012, 14.10.2012. దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్య ఆధారంగా పై రెండు తేదీల్లోనే కాక ఇంకా అదనపు తేదీల్లో కూడా పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ప్రతి ఒక తప్పు సమాధానానికీ పావు మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు చేసే విధానం:
దుగా అభ్యర్థి తన ఫొటో, సంతకం స్కాన్ చేసి పెట్టుకోవాలి. అభ్యర్థికి వాడుకలో ఉన్న ఇ-మెయిల్ తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ లేకపోతే ముందుగా ఇ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసి ఉంచుకోవాలి. www.sbi.co.inసైటుగానీ, statebankofindia.comకానీ ఓపెన్ చేసి అందులో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్ ఫార్మాట్ ఓపెన్ చెయ్యాలి.
తర్వాత అభ్యర్థి వివరాలన్నీ చాలా జాగ్రత్తగా నింపాలి. ఒకేసారి అభ్యర్థి తన పూర్తి వివరాలన్నీ నింపలేకపోయినట్లయితే, నింపినంతవరకు వివరాలు సేవ్ చేయవచ్చు. ఆ విధంగా డేటా సేవ్ చేసిన వెంటనే ఓ తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరు, పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి. అభ్యర్థి ఆ విధంగా స్క్రీన్‌పై వచ్చిన పాస్‌వర్డ్ రిజిస్ట్రేషన్ నంబరు నోట్ చేసి పెట్టుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ నంబరు, పాస్‌వర్డ్ ఉపయోగించి తిరిగి రీఓపెన్ చేసి మిగిలిన వివరాలు నింపడం/ అవసరమైతే గతంలో నింపిన వివరాలు మార్పు చేసుకోవడం చేయవచ్చు. ఈ సౌకర్యం 3 పర్యాయాలు మాత్రమే వినియోగించుకోవడానికి సాధ్యమవుతుంది. ఒకసారి దరఖాస్తులో వివరాలు పూర్తిగా నింపి 'సబ్‌మిట్' చేసిన తరవాత 'సిస్టమ్ జనరేటెడ్ ఫీజు పేమెంట్ చలాన్' వస్తుంది. దాని ప్రింట్ అవుట్ వెంటనే తీసుకోవాలి. తదుపరి దరఖాస్తులో ఎటువంటి మార్పులూ చేర్పులను అంగీకరించరు.
రిజిస్ట్రేషన్ అయిన రెండు పని దినాల తరవాత ఏదయినా ఎస్.బి.ఐ. బ్యాంకు బ్రాంచిలో ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా ఫీజు చెల్లించడానికి మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఫీజు చెల్లించడానికి సిస్టమ్ జనరేటివ్ ఫీజు చెల్లింపు చలానాను ఉపయోగించాలి. ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసినట్లు లెక్క.
రిజిస్ట్రేషన్ ఖరారు చేస్తూ ఫీజు చెల్లించిన మూడు పని దినాల తరవాత అభ్యర్థి మొబైల్ నంబరుకు ఎస్సెమ్మెస్ వస్తుంది. అలాగే అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న ఇ-మెయిల్ అడ్రస్‌కు మెయిల్ కూడా వస్తుంది. అభ్యర్థులు తమ మొబైల్ నంబరు, ఇ-మెయిల్ ఐడీ తప్పులు లేకుండా దరఖాస్తులో నింపాలి.
ఫీజు చెల్లించిన మూడ్రోజుల తర్వాత అభ్యర్థి ఫీజు చెల్లింపు వివరాలతో కూడిన తన దరఖాస్తు ప్రింట్ అవుట్ తీసుకుని జాగ్రత్తగా తన వద్ద ఉంచుకోవాలి. అభ్యర్థి ఇంటర్వ్యూకు ఎంపికయి దానికి హాజరయినప్పుడు ఈ దరఖాస్తు ప్రింటవుట్ తప్పనిసరిగా దాఖలు చేయవలసి ఉంటుంది. అలాగే పరీక్షకు హాజరు కావడానికి కాల్‌లెటర్ వెబ్‌సైట్ నుంచి పరీక్ష తేదీకి సుమారు రెండు మూడు వారాల ముందు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింటవుట్ తీసి పెట్టుకోవాలి. పోస్టు ద్వారా ఎటువంటి కాల్ లెటర్లు ఇంటికి పంపరు..
పరీక్షకు హాజరయ్యేప్పుడు అభ్యర్థి కాల్‌లెటర్‌తో పాటు తన ఫొటో, ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకొని వెళ్లాలి. పరీక్షా సమయంలో అభ్యర్థి కాల్ లెటర్, ఫొటో గుర్తింపు కార్డు కాపీ ఇన్విజిలేటర్‌కు దాఖలు చేయవలసి ఉంటుంది.