టీఎస్ సెట్

‘సెట్‌’లో నిలుద్దాం దీటుగా!

       ఉమ్మడి రాష్ట్రంలో స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సెట్‌)ను నిర్వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రస్తుతం తెలంగాణ పరిధిలో ఈ పరీక్షను నిర్వహించటానికి సిద్ధమైంది. అర్హులైన పీజీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అధ్యాపకులుగా/సహాయక ఆచార్యులుగా నియమితులు కావాలనుకునేవారికి అర్హత కల్పించటానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించాలనేది జాతీయ విద్యావిధానం సూచన. ఏకీకృత ప్రమాణాలు నెలకొల్పాలన్న లక్ష్యం అనుసరించి జాతీయస్థాయిలో హ్యుమానిటీస్‌ విభాగాలకు యూజీసీ నెట్‌, సైన్స్‌ విభాగాలకు సీఎస్‌ఐఆర్‌ నెట్‌లను నిర్వహిస్తున్నారు.అయితే ఆంగ్లమాధ్యమంలో ఈ పరీక్షలు జరుగుతుండటం వల్ల మాతృభాషలో చదువుకున్న చాలామంది ప్రావీణ్యం ఉండి కూడా వాటిలో అర్హత సాధించలేకపోతున్నారు. దీన్ని అధిగమించటానికే రాష్ట్రాల స్థాయిలో సెట్‌ నిర్వహణకు యూజీసీ అనుమతించింది. జూనియర్‌ లెక్చరర్లు డిగ్రీ అధ్యాపకులుగా పదోన్నతి పొందాలన్నా కూడా నెట్‌/సెట్‌ అర్హత తప్పనిసరి. పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి కూడా ఈ అర్హత వీలు కల్పిస్తుంది.కామర్స్‌లో మెరుద్దాం

రాష్ట్ర అర్హత పరీక్ష (సెట్‌)లోని మొత్తం 29 సబ్జెక్టుల్లో కామర్స్‌ సబ్జెక్టు ఒకటి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రామాణిక పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ముఖ్యమైన అంశాలతోపాటు వర్తమాన వ్యవహారాలను కూడా అధ్యయనం చేస్తే మంచి స్కోరుతో కామర్స్‌ సెట్‌ అర్హత సులభంగా సాధించవచ్చు!

ఎం.కామ్‌ పూర్తిచేసినవారూ, ఎం. కామ్‌ చివరి సం॥ (చివరి సెమిస్టర్‌) చదువుతున్నవారూ కామర్స్‌ సెట్‌ రాయడానికి అర్హులు.మెలకువలు పాటిస్తే మార్కులు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుదారులు ఐచ్ఛిక సబ్జెక్టుపై తగిన దృష్టిపెట్టడం అవసరం. ఆర్థిక శాస్త్రంలో మెరుగైన మార్కులు తెచ్చుకోవాలంటే ఏ తీరులో సిద్ధం కావాలి? కీలకమైన అంశాలేమిటి?

విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకానికి నెట్‌/సెట్‌లో అర్హత తప్పనిసరి.


టీఎస్ సెట్ - 2017 వివరాలు

  • ప్రిప‌రేష‌న్ ప‌ద్ధ‌తి(కామర్స్‌)
  • ప్రిప‌రేష‌న్ ప‌ద్ధ‌తి(ఆర్థిక శాస్త్రం)
  • పాత ప్రశ్నపత్రాలు
  • నోటిఫికేషన్
  • ముఖ్యమైన తేదీలు
  • సిలబస్‌
  • ఆన్‌లైన్ అప్లికేష‌న్