Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

స్వాగతిస్తోన్న ఎస్‌ఐ పోస్టులు!

 

      స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా ఎస్‌ఐ, అసిస్టెంట్‌ ఎస్‌ఐ పోస్టుల నియామకానికి ప్రకటన విడుదలయింది. మంచి వేతనంతో పాటు దేశం కోసం పనిచేసే అవకాశం ఈ కొలువుల ద్వారా వస్తుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసి, సన్నద్ధతకు నాంది పలకాలి!
కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) తదితర శాఖల్లోని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) పోస్టులు, దిల్లీ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) శాఖలోని అసిస్టెంట్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ వివరాల్లోకి వెళితే..
భర్తీ చేయనున్న పోస్టులు గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌), గ్రూప్‌-సీ కేటగిరీలకు చెందినవి.
* సబ్‌- ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు పే స్కేల్‌ సుమారు రూ.35,000
* అసిస్టెంట్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు పే స్కేల్‌ రూ.20,000గా కేటాయించారు.
ప్రస్తుత ప్రకటన ద్వారా 2902 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 2651 పోస్టులను పురుషులకూ, 251 పోస్టులను మహిళలకూ కేటాయించారు.
రాతపరీక్ష తేదీ: 21.06.2015
* ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు పూర్తి చేయనున్న అభ్యర్థులు http://ssconline.nic.inలేదా http://ssconline2.gov.in వెబ్‌సైట్లలో 26.04.2015 తేదీలోపు ప్రాథమిక రిజిస్ట్రేషన్‌ (పార్ట్‌-1), 28.04.2015 లోపు (పార్ట్‌-2) రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయగలగాలి.
* రాతపరీక్ష విధానం ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ (ఓఎంఆర్‌) విధానంలో ఉంది. అయినప్పటికీ ప్రభుత్వ అనుమతులు పొందినట్త్లెతే రాతపరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో జరిపే అవకాశాలున్నాయి.
వయః పరిమితులు
* అభ్యర్థులు 20- 25 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. తమ వయసును 01.01.2015 తేదీతో పరిగణించుకోవాలి.
* ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాల మినహాయింపు; ఎస్‌సీ/ ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది.
ఇతర వివరాల కోసం ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌ చూడవచ్చు.
విద్యార్హతలు
* అభ్యర్థులు 01.01.2015 నాటికి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి.
* గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు ఈ పరీక్షకు అనర్హులు.
* దిల్లీ పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు (పురుషులు మాత్రమే) డ్రైవింగ్‌ లైసెన్స్‌ (ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి.
* డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని అభ్యర్థులు దిల్లీ పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తప్ప మిగిలిన శాఖల్లోని పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
రాతపరీక్ష 400 మార్కులకు, మౌఖిక పరీక్ష 100 మార్కులకుజరుగుతుంది. మొత్తం 500 మార్కుల్లో ప్రతిభ కనబరచిన అభ్యర్థులకు పోస్టులను కేటాయిస్తారు.
దరఖాస్తు ఫీజు వివరాలు
* ఆఫ్‌లైన్‌: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు పూర్తిచేసే అభ్యర్థులు పోస్టాఫీసుల్లో లభ్యమయ్యే సీఆర్‌ఎఫ్‌ స్టాంప్‌ ద్వారా మాత్రమే ఫీజు చెల్లించాలి.
* ఆన్‌లైన్‌: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు పూర్తి చేస్తున్నవారు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు, డెబిట్‌కార్డు/ ఎస్‌బీఐ శాఖలో ఛలానా ద్వారా చెల్లించాలి.
* మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
* మిగిలిన కేటగిరీ, పురుషులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
పరీక్ష కేంద్రాలు
తెలంగాణ: హైదరాబాద్‌లో మాత్రమే
ఆంధ్రప్రదేశ్‌: గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి
ఎంపిక విధానం
* మొదట రాతపరీక్ష, రాతపరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండు పేపర్లకు పరీక్షను 21.06.2015 తేదీన నిర్వహించనున్నారు.
* రాతపరీక్షలోని పేపర్‌-1లో కనీస అర్హత మార్కు సాధించిన అభ్యర్థులకు ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ (పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (పీఎస్‌టీ), మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
* పీఈటీ, ఇతర పరీక్షల్లో అర్హత సాధించి రాతపరీక్షలోని పేపర్‌-2లో షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు.
రాతపరీక్ష 400 మార్కులకు, మౌఖికపరీక్ష 100 మార్కులకు. మొత్తం 500 మార్కుల్లో ప్రతిభ కనబరచిన అభ్యర్థులకు పోస్టులను కేటాయిస్తారు.
పీఈటీ, పీఎస్‌టీ, మెడికల్‌ టెస్ట్‌లు కేవలం క్వాలిఫయింగ్‌, ఎలిమినేషన్‌ కోసం మాత్రమే. వీటికి ఎటువంటి మార్కులూ కేటాయించరు.
రాతపరీక్ష
1) పేపర్‌-1: పేపర్‌-1ను 2 గంటల వ్యవధిలో పూర్తిచేయాలి. 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. దీనిలో నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి.
ఎ. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ బి. జనరల్‌ నాలెడ్జ్‌ సి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ డి. ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌
2. పేపర్‌-2: ఇంగ్లిష్‌, కాంప్రహెన్షన్‌ పేపర్‌ నుంచి 200 ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులు కేటాయించిన ఈ పేపర్‌ను 2 గంటల వ్యవధిలో పూర్తిచేయాలి.
* ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి.
* ప్రతి తప్పు సమాధానానికీ 0.25 రుణాత్మక మార్కులున్నాయి.
3. మౌఖిక పరీక్ష: మెడికల్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు 100 మార్కులు కేటాయించారు. మొత్తం 500 మార్కులకు (400 రాతపరీక్ష; 100 మౌఖిక పరీక్ష) ప్రతిభ ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు.

posted on 6.4.2015